లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ జట్టు ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత బ్యాటర్లు.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నారు. ఛాంపియన్స్‌గా నిలిచేందుకు భారత జట్టుకు ఆఖరి రోజు 280 పరుగులు అవసరం కాగా.. ఆసీస్ తమ విజయానికి 7 వికెట్ల దూరంలో నిలిచింది.
444 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. అందుకు తగ్గట్టు గానే తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో మంచి ఓపెనింగ్ అందించేందుకు రోహిత్ శర్మ (43), శుభ్‌మన్ గిల్ (18) ప్రయత్నించారు. అయితే థర్డ్ అంపైర్ వివాదస్పద నిర్ణయానికి గిల్ బలయ్యాడు. ఆ తర్వాత రోహిత్(43), పుజారా(27) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించినప్పటికీ... కేవలం 5 బంతుల వ్యవధిలోనే వీరిద్దరూ పెవిలియన్‌కు చేరారు. దీంతో టీమిండియాకు మరో కొత్త భాగస్వామ్యం అవసరమైంది.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి(44), అజింక్య రహానే (20 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో నిలిచింది.
ఆశల మొత్తం వాళ్లపైనే
ఇక 280 పరుగుల భారీ టార్గెట్ ఆసాధ్యమేమి కాదు. భారత జట్టు విజయం సాధించాలంటే క్రీజులో ఉన్న కోహ్లి, రహానే అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాలి. ముఖ్యంగా ఆఖరి రోజు తొలి సెషన్ చాలా ముఖ్యం. అపారమైన అనుభవం ఉన్న ఈ సీనియర్ ఆటగాళ్లు.. తమ వికెట్లను కాపాడుకోని స్కోర్‌బోర్డును ముందుకు తీసుకువెళ్లాలి. కనీసం వీరిద్దరూ మరో 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే.. భారత్ విజయానికి దగ్గరకావచ్చు. అనంతరం రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, శార్ధూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు మ్యాచ్‌ను ఫినిష్ చేసే ఛాన్స్ ఉంటుంది.
అప్పుడు ద్రవిడ్, లక్ష్మణ్
కాగా గతంలో 2001లో ఇదే ఆస్ట్రేలియాపై రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఇద్దరూ అద్భుతంగా పోరాడి 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విషయం అభిమానులకు తెలిసిందే. ఈ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ సాధిస్తుంది. అయితే భారత్ మాత్రం తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే కూప్పకూలిపోతుంది. దీంతో టీమిండియా ఫాలోఆన్ ఆడాల్సి వస్తుంది. ఫాలో ఆన్‌లో కూడా భారత్ తడబడుతుంది.
కేవలం 100 పరుగులకే సచిన్, సుందర్ దాస్ వంటి వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడుతుంది. ఈ సమయంలో ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఇద్దరూ వీరిచిత పోరాటం కనబరిచి భారత్‌కు 657 పరుగుల భారీ స్కోర్‌ను అందిస్తారు. అనంతరం 384 లక్క్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 212 పరుగులకు కుప్పకూలుతుంది. ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కోహ్లి, రహానే కూడా ద్రవిడ్, వీవీఎస్ మాదిరి రాణించి భారత్‌కు విజయం అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?
ఒక వేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. టెస్టు క్రికెట్‌లో ఇంత భారీ టార్గెట్‌ను చేధించిన ఇప్పటివరకు సందర్బాలు లేవు. ఇక టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరుగుల టార్గెట్‌ను అందుకుంది.
రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఉది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్‌ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక భారత్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందా లేదా మరోసారి ట్రోఫీని అప్పగిస్తారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
చదవండి: WTC FINAL: కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్.. సెహ్వాగ్ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment