పెర్త్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేని లోటు స‍్పష్టంగా కనబడిందని ఆ దేశ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టులో స్టోక్స్ లేకపోవడంతో తమ జట్టు ఒక్కసారిగా బలహీనపడిపోయిందన్నాడు. ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు ఉండగానే యాషెస్‌ను కోల్పోవడానికి కారణం తమ ప్రధాన ఆటగాళ్లైన జో రూట్, అలెస్టర్ కుక్‌లు విఫలం కావడమేనని స్వాన్ విమర్శించాడు. తదుపరి మ్యాచ్‌ల్లో ఏ మాత్రం పోరాడి అవకాశం లేకుండా చేశారన్నాడు.
అయితే ఇంగ్లండ్ సంచలనం డేవిడ్ మాలన్‌పై స్వాన్ ప్రశంలస వర్షం కురిపించాడు. ఈ సిరీస్‌లో అతని ఆట తీరు మినహా చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయిందన్నాడు. తమ జట్టులో స్టోక్స్ లేకపోవడం వల్ల తొలి మూడు గేమ్‌ల్లోనే సిరీస్‌ను కోల్పోతుందనే విషయాన్ని ముందే అంచనా వేసినట్లున్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 0-3తో కోల్పోయిన సంగతి తెలిసిందే. పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలై సిరీస్‌ను ముందుగానే ఆసీస్‌కు సమర్పించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment