ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఆసీస్ స్టార్ బ్యాటర్, ఇన్ ఫామ్ ఆటగాడు స్టీవ్ స్మిత్ భరతం పట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న స్మిత్ (16)ను స్టోక్స్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. స్టోక్స్ సంధించిన అద్భుతమైన ఇన్ స్వింగర్‌ను మిస్ అయిన స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. స్మిత్.. రివ్యూకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎత్తు విషయంలో అనుమానం వ్యక్తం చేసినప్పటికీ.. రీప్లేలో బంతి వికెట్ల టాప్ ఎడ్జ్ తగులుతుందని తేలింది. దీంతో స్మిత్ వెనుదిరగక తప్పలేదు.
Ben Stokes delivers a HUGE wicket - Steve Smith lbw for 16!#ENGvAUS | #Ashes pic.twitter.com/whxBbi3x8s
— ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023
స్టోక్స్ గర్జిస్తూ సంబరాలు చేసుకున్నాడు. స్టోక్స్ మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ బౌలింగ్‌కు దిగి కీలకమైన స్మిత్ వికెట్‌ను పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో రెండు సెంచరీలు బాదిన స్మిత్.. ఈ మ్యాచ్‌లో కేవలం 16 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ గడ్డపై స్మిత్‌కు ఉన్న ట్రాక్ రికార్డు చూసి ఇంగ్లండ్ బౌలర్లు వణిపోయారు. అతను ఇక్కడ ఆడిన గత 9 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే స్మిత్ తన భీకర ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కొనసాగించలేకపోయాడు. స్టోక్స్ వ్యూహంలో చిక్కుకుని ఔటయ్యాడు.
కాగా, స్మిత్ ఔటయ్యే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసి, కష్టాల్లో పడింది. తొలుత స్టువర్ట్ బ్రాడ్ వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి (392/8) సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిర్మించగా.. జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: నిప్పులు చెరుగుతున్న బ్రాడ్.. వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్ ఔట్
Comments
Please login to add a commentAdd a comment