ENG vs IND: Graeme Swann Wants India To Open With Virat Kohli - Sakshi
Sakshi News home page

IND vs ENG: 'టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ వద్దు.. కోహ్లిని పంపండి'

Published Fri, Jul 8 2022 4:17 PM | Last Updated on Fri, Jul 8 2022 6:28 PM

Graeme Swann wants India to open with Virat Kohli - Sakshi

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ బౌలింగ్‌లో భారత్‌ దుమ్మురేపింది. అయితే తొలి టీ20లో భారత బ్యాటర్లు అంతా రాణించన్పటికీ.. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ మాత్రం నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ  స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనున్న రెండో టీ20లో ఇషాన్‌ కిషన్‌కు బదులుగా కోహ్లి భారత్‌కు ఓపెనింగ్ చేయాలని స్వాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి వంటి ఆటగాడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రాకూడదని అతడు తెలిపాడు. ఇక తొలి టీ20కి విశ్రాంతి తీసుకున్న కోహ్లి రెండో టీ20కు సిద్దమయ్యాడు. "విరాట్‌ తుది జట్టులోకి వచ్చినట్లయితే.. అతడు కిషన్‌ బదులుగా ఓపెనింగ్‌ చేయాలని భావిస్తున్నాను.

కోహ్లి వంటి అద్భుతమైన ఆటగాడిని మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపకూడదు. కోహ్లి ఆస్థానంలో బ్యాటింగ్‌కు వస్తే అంత త్వరగా పరుగులు చేయలేడు. కాబట్టి కోహ్లి ఓపెనర్‌ గానే రావాలి. రోహిత్‌ అవతలి ఎండ్‌లో దూకుడుగా ఆడితే కోహ్లి కూడా అతడిని ఫాలో అవుతాడు. వీరిద్దరూ భారీ స్కోర్‌లు సాధించి భారత్‌కు అద్భుతమైన ఆరంభం ఇస్తే.. తర్వాత వచ్చే హూడా, సూర్య తమ పని తాము చేసుకు పోతారు" అని స్వాన్ పేర్కొన్నాడు.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టీ20 మ్యాచ్‌:
టాస్‌: ఇండియా- బ్యాటింగ్‌
ఇండియా స్కోరు: 198/8 (20)
ఇంగ్లండ్‌ స్కోరు: 148 (19.3)
విజేత: ఇండియా(50 పరుగుల తేడాతో విజయం)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హార్దిక్‌ పాండ్యా(51 పరుగులు, 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement