Graeme Swann Hilarious Celebration After Taking Catch In Stands, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Graeme Swan: క్యాచ్‌ పట్టగానే చిన్న పిల్లాడిలా మారిపోయిన మాజీ క్రికెటర్‌

Published Sat, Oct 8 2022 10:44 AM | Last Updated on Sat, Oct 8 2022 3:52 PM

Graeme Swann Hilarious Celebration After Taking Catch In Stands Viral - Sakshi

ఇంగ్లండ్‌ మాజీ స్టార్‌ స్పిన్నర్‌ గ్రేమీ స్వాన్‌ టి10 యూరోపియన్‌ లీగ్‌లో స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. ఆటగాడిగా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే స్వాన్‌ ఆ క్యాచ్‌ అందుకుంది ఒక ప్రేక్షకుడిగా. విషయంలోకి వెళితే.. టి10 యూరోపియన్‌ క్రికెట్‌లో భాగంగా ఇటలీ, స్విట్జర్లాండ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇటలీ ఇన్నింగ్స్‌ సమయంలో ఆ జట్టు బ్యాటర్‌ భారీ సిక్సర్‌ బాదాడు.

స్టాండ్స్‌లో ఉన్న గ్రేమీ స్వాన్‌ డైవ్‌ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత తాను పట్టుకున్న బంతితో స్టాండ్స్‌ మొత్తం కలియ తిరుగుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గ్రేమీ స్వాన్‌ ఇంగ్లండ్‌ తరపున మంచి స్పిన్నర్‌గా పేరు పొందాడు. ఇంగ్లీష్‌ జట్టు తరపున స్వాన్‌ 60 టెస్టుల్లో 255 వికెట్లు, 70 వన్డేల్లో 104 వికెట్లు, 39 టి20ల్లో 51 వికెట్లు తీశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇటలీ చేతిలో స్విట్జర్లాండ్‌ జట్టు 66 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇటలీ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు భారీ స్కోరు చేసింది. అమిర్‌ షరీఫ్‌ 24 బంతుల్లో 64 నాటౌట్‌, రాజ్‌మణి సింగ్‌ 18 బంతుల్లో 51, బల్జీత్‌ సింగ్‌ 17 బంతుల్లో 50 పరుగులతో రాణించారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్‌ 10 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 102 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యింది.

చదవండి: పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్‌..

'110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement