లండన్ : టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన జీవితంలో ద్రవిడ్‌ను మించిన అత్యుత్తమ ఆటగాడిని చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.' నా వరకు రాహుల్ ద్రవిడ్ అందరి కంటే గొప్ప బ్యాట్స్‌మన్. కౌంటీల్లో అతడికి నేను బౌలింగ్ చేశా. అతను ఒక అసాధారణంగా ఆటగాడు. అతడి కంటే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను నేను నా జీవితంలో చూడలేదు. ఓ కౌంటీ గేమ్‌లో ద్రవిడ్ అసలు ఔటే కాలేదు.. అప్పుడు ద్రవిడ్ అంటే ఇదేనేమోనని అనిపించింది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే నేను 11 ఏండ్ల స్పిన్నర్‌లా ఫీలయ్యా. 2008లో చెన్నైలో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన నేను తొలి ఓవర్లోనే గంభీర్‌తో పాటు ద్రవిడ్‌ను కూడా ఔట్ చేశాను. ఆ విషయాన్ని ఇప్పటివరకు నేను మరిచిపోలేదు. నిజంగా అది అద్భుతమైన బంతేనని కానీ ద్రవిడ్‌ను ఔట్ చేయగలిగినంత గొప్పది మాత్రం కాదని' గ్రేమ్ స్వాన్ పేర్కొన్నాడు. మిస్టర్ డిపెండబుల్‌గా పేరు పొందిన ద్రవిడ్ తన కెరీర్లో 163 టెస్టులు ఆడి13,265 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు సాధించాడు. ఎన్నోసార్లు ఆపదలో ఉన్న భారత జట్టును ఆదుకొని, పరాజయాల నుంచి తప్పించి 'ది వాల్'గా పేరును దక్కించుకున్నాడు.
(క్లాప్స్ కొట్టడానికి వీధుల్లోకి వస్తారా..?)
'నా జీవితంలో అలాంటి ఆటగాడిని చూడలేదు'
Published Fri, Apr 17 2020 9:35 PM | Last Updated on Fri, Apr 17 2020 9:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment