
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 12 ఏళ్ల తర్వాత క్లబ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. చిన్న కొడుకు అన్వయ్‌తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ద్రవిడ్ విజయా క్రికెట్ క్లబ్‌కు (మాలుర్) ప్రాతినిథ్యం వహించాడు. యంగ్ లయన్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ద్రవిడ్ 8 బంతుల్లో బౌండరీ సాయంతో 10 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ విఫలమైనా కొడుకు అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్.. 58 బంతుల్లో 8 బౌండరీల సాయంతో 60 పరుగులు చేశాడు. రాహుల్-అన్వయ్ కొద్ది సేపు కలిసి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు 17 బంతుల్లో 15 పరుగులు జోడించారు. క్రికెట్ చరిత్రలో తండ్రి కొడుకులు కలిసి ఆడటం చాలా అరుదుగా జరిగింది.
కలిసి క్రికెట్ ఆడిన కొంతమంది తండ్రి కొడుకులు..
డబ్ల్యూజీ గ్రేస్-గ్రేస్ జూనియర్
లాలా అమర్‌నాథ్-సురిందర్ అమర్‌నాథ్
డెన్నిస్ లిల్లీ-ఆడమ్ లిల్లీ
డెనిస్ స్ట్రీక్- హీథ్ స్ట్రీక్
శివ్‌నరైన్ చంద్రపాల్-తేజ్ నరైన్ చంద్రపాల్
ఇయాన్ బోథమ్-లియామ్ బోథమ్
ఇలా చేయడం ద్రవిడ్‌కు కొత్తేమీ కాదు..!
రిటైర్మెంట్ తర్వాత క్లబ్ క్రికెట్ ఆడటం ద్రవిడ్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు తన చిన్ననాటి క్లబ్ అయిన బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. ఈ జట్టుకు ఆడుతూ ద్రవిడ్ ఓ సెంచరీ కూడా చేశాడు.
ద్రవిడ్ పెద్ద కొడుకు కూడా క్రికెటరే..!
ద్రవిడ్ చిన్న పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటరే. గతేడాది ఆగస్ట్‌లో సమిత్ భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది మహారాజా టీ20 టోర్నీలోనే సమిత్ పాల్గొన్నాడు.
ఇటీవలే బెంగళూరుకు వచ్చిన ద్రవిడ్
రాహుల్ ద్రవిడ్ ఇటీవలే తన హో సిటీ బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరుకు రాక ముందు ద్రవిడ్ గౌహతిలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ ప్రీ సీజన్ క్యాంప్‌లో పాల్గొన్నాడు. ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో స్వప్నిల్ అనే ఆటగాడు సుడిగాలి శతంకంతో విజృంభించడంతో విజయ క్రికెట్ క్లబ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. స్వప్నిల్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. యంగ్ లయన్స్ బౌలర్లలో ఆధిత్య నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment