మూలపాడు (ఆంధ్రప్రదేశ్): భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (153 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు.
మూడు రోజుల మ్యాచ్‌లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్‌లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అన్వయ్ మొదట శమంతక్ అనిరుధ్ (76)తో కలిసి మూడో వికెట్‌కు 167 పరుగులు జతచేశాడు.
387 పరుగులకు ఆలౌట్
అనిరుధ్ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్ (33)తో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్ ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది.
జోనల్ టోర్నమెంట్‌లో డబుల్ సెంచరీ
అన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ టోర్నీకి ముందు జరిగిన కేఎస్‌సీఏ (కర్ణాటక క్రికెట్ సంఘం) అండర్–16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో బెంగళూరు జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్... తుంకూర్ జోన్‌పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు.
ఇక అన్వయ్ అన్నయ్య 19 ఏళ్ల సమిత్ కూడా ఇదివరకే జూనియర్ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో సమిత్ ద్రవిడ్ రాణించాడు.
చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment