vijay merchant cricket tournry
-
శతక్కొట్టిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం
మూలపాడు (ఆంధ్రప్రదేశ్): భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (153 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు.మూడు రోజుల మ్యాచ్‌లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్‌లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అన్వయ్ మొదట శమంతక్ అనిరుధ్ (76)తో కలిసి మూడో వికెట్‌కు 167 పరుగులు జతచేశాడు.387 పరుగులకు ఆలౌట్అనిరుధ్ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్ (33)తో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్ ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది.జోనల్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీఅన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ టోర్నీకి ముందు జరిగిన కేఎస్‌సీఏ (కర్ణాటక క్రికెట్ సంఘం) అండర్–16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో బెంగళూరు జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్... తుంకూర్ జోన్‌పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు.ఇక అన్వయ్ అన్నయ్య 19 ఏళ్ల సమిత్ కూడా ఇదివరకే జూనియర్ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో సమిత్ ద్రవిడ్ రాణించాడు. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
అదరగొట్టిన ఆల్‌రౌండర్ వేద్ రెడ్డి.. హైదరాబాద్ భారీ విజయం
సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ ట్రోఫీ దేశవాళీ అండర్–16 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు ఖాతాలో తొలి విజయం లభించింది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భాగంగా లక్నో వేదికగా హైదరాబాద్ టీమ్ మేఘాలయ జట్టుతో తలపడింది. ప్రత్యర్థిపై ఇన్నింగ్స్ 101 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో వేద్ రెడ్డి(Ved Reddy) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి హైదరాబాద్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. వేద్ రెడ్డి 58 పరుగులు చేయడంతోపాటు మ్యాచ్‌లో 4 వికెట్లు తీసుకున్నాడు. మొదట మేఘాలయ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులకు ఆలౌటైంది. వేద్ రెడ్డి 2 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. వేద్ రెడ్డి (58; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 141 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆడిన మేఘాలయ జట్టు 40 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో ఆంధ్ర
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆంధ్ర జట్టు విజయ్ మర్చంట్ అండర్–16 క్రికెట్ టోర్నమెంట్లో క్వార్టర్స్‌కు చేరుకుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నాగాలాండ్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్, 678 పరుగులతో ఘనవిజయాన్ని సాధించింది. శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 50/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నాగాలాండ్ 67 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్ర బౌలర్ వాసు (6/28) చెలరేగాడు. కె. నితీశ్ కుమార్ రెడ్డి 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ నితీశ్ కుమార్ (441), యోగానంద (217) విజృంభణతో ఆంధ్ర 801/2 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో సౌత్జోన్లో ఆంధ్ర 19 పాయింట్లతో అజేయంగా టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర రెండింటిలో గెలిచి మూడు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. ఈనెల 14నుంచి జరిగే క్వార్టర్స్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర ఆడుతుంది. -
నితీశ్ 441
రాజ్‌కోట్: ఈ సీజన్లో భీకరమైన ఫామ్‌లో ఉన్న ఆంధ్ర జట్టు యువ క్రికెటర్ కె. నితీశ్ కుమార్ రెడ్డి మళ్లీ చెలరేగాడు. ఈసారి ఏకంగా ‘క్వాడ్రాపుల్’ సెంచరీ సాధించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నితీశ్ పరుగుల వరద పారించాడు. 366 బంతులు ఆడిన ఈ వైజాగ్ కుర్రాడు 60 ఫోర్లు, 7 సిక్సర్లతో 441 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ ప్రదర్శనతో బీసీసీఐ జూనియర్స్ టోర్నమెంట్ల చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మహారాష్ట్ర ప్లేయర్ విజయ్ జోయల్ (451) తర్వాత నితీశ్ రెండో స్థానంలో నిలిచాడు. ఆంధ్ర జట్టు మరో ఓపెనర్ యోగానంద (260 బంతుల్లో 217; 23 ఫోర్లు) డబుల్ సెంచరీ చేయగా... కెప్టెన్ పి.సుబ్రమణ్యం (131 బంతుల్లో 106 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ శతకం సాధించాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 369/0తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు 127 ఓవర్లలో 2 వికెట్లకు 801 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నాగాలాండ్ జట్టులో 10 మంది బౌలింగ్ చేయడం గమనార్హం. ఓపెనర్లు నితీశ్, యోగానంద తొలి వికెట్‌కు ఏకంగా 535 పరుగులు జోడించడం విశేషం. ఆంధ్ర క్రికెట్ చరిత్రలో తొలి వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2001–2002 సీజన్లో గోవా జట్టుపై ఆంధ్ర ఓపెనర్లు అమిత్ పాఠక్–ప్రసాద్ రెడ్డి 380 పరుగులు జత చేశారు. 745 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నాగాలాండ్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 50 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నాగాలాండ్ 56 పరుగులకు ఆలౌటైంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ ఇంకా 695 పరుగులు వెనుకబడి ఉన్న నేపథ్యంలో ఆంధ్ర జట్టు విజయం లాంఛనమే అనుకోవాలి. ఏసీఏ నజరానా రూ. 2 లక్షలు... ‘క్వాడ్రాపుల్’ సెంచరీ’ చేసిన నితీశ్ కుమార్‌ను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అభినందించింది. అతని ప్రదర్శనకు ప్రోత్సాహకంగా ఏసీఏ అధ్యక్షుడు జీవీకే రంగరాజు రూ. 2 లక్షలు నజరానా ప్రకటించారు. ఈ సీజన్లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో నితీశ్ 6 ఇన్నింగ్స్‌లు ఆడి 1,229 పరుగులు సాధించాడు. ఇందులో ఒక క్వాడ్రాపుల్ సెంచరీ... ఒక ట్రిపుల్ సెంచరీ (తమిళనాడుపై 301)... రెండు సెంచరీలు (గోవాపై 134; కర్ణాటకపై 190)... రెండు అర్ధ సెంచరీలు (హైదరాబాద్‌పై 94; కేరళపై 69) ఉన్నాయి. బంతితోనూ ఆకట్టుకున్న నితీశ్ 18 వికెట్లు కూడా తీశాడు. -
హైదరాబాద్ ‘డ్రా’తో సరి
సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. జింఖానా మైదానంలో కేరళతో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రాగా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 80/2తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 56 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 115 పరుగుల్ని కలుపుకొని ఓవరాల్‌గా 276 పరుగుల లక్ష్యాన్ని కేరళ జట్టు ముందుంచింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ పి. శివ (54 నాటౌట్; 6 ఫోర్లు), వైఎస్ వరుణ్ (64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన కేరళ జట్టు డ్రానే లక్ష్యంగా నెమ్మదిగా ఆడింది. అల్బిన్ బిను (148 బంతుల్లో 62; 10 ఫోర్లు), రోహన్ నాయర్ (134 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) నింపాదిగా ఆడటంతో మ్యాచ్ ముగిసేసమయానికి కేరళ జట్టు 72 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో శ్రాగ్వి, కె. పూర్ణానంద రావు చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన హైదరాబాద్ జట్టుకు 3 పాయింట్లు లభించాయి. ఈనెల 5న జరిగే తదుపరి మ్యాచ్‌లో గోవాతో హైదరాబాద్ తలపడుతుంది. ఆంధ్ర మ్యాచ్ ‘డ్రా’... ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో తమిళనాడు, ఆంధ్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 188/2తో ఆట మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన తమిళనాడు జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 153 ఓవర్లలో 9 వికెట్లకు 388 పరుగులు చేసింది. లక్ష్య జైన్ (97) తృటిలో సెంచరీని చేజార్చుకోగా, మానవ్ పరేఖ్ (55) అర్ధసెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో వాసు 3 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌ను హైదరాబాద్ 127 ఓవర్లలో 4 వికెట్లకు 509 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. -
హైదరాబాద్ 266 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నీలో భాగంగా కేరళ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు రాణించింది. స్థానిక జింఖానా మైదానంలో శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలిరోజు హైదరాబాద్ 87.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇల్యాన్ సథాని (56; 10 ఫోర్లు), టి. రోహన్ (51; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో జట్టు ఓ మోస్తరు స్కోరును సాధించగలిగింది. వైఎస్ వరుణ్ (43; 8 ఫోర్లు), త్రిషాంక్ గుప్తా (39; 6 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో కిరణ్ సాగర్, అభి బిజు చెరో 3 వికెట్లు దక్కించుకోగా, శ్రీనాథ్ 2 వికెట్లు పడగొట్టారు. ఆదుకున్న లోయర్ ఆర్డర్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద కె. కార్తీక్ రెడ్డి (6) ఎల్బీగా వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే మరో ఓపెనర్ సాత్విక్ రెడ్డి (22), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పి. శివ (13), కెప్టెన్ కె. సాయి పూర్ణానంద రావు (0) పెవిలియన్ చేరారు. ఈ దశలో వైఎస్ వరుణ్ కాసేపు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అడపాదడపా అతను బౌండరీలు బాదడంతో స్కోరు ముందుకెళ్లింది. షణ్ముఖ (9)తో కలిసి 40 పరుగుల్ని జోడించాక అభి బిజ్జు బౌలింగ్‌లో వరుణ్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత షణ్ముఖ కూడా అవుటవ్వడంతో 96 పరుగులకే హైదరాబాద్ 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వి. సహస్ర (18), ఇల్యాన్ జోడీ కుదురుగా ఆడింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 67 పరుగులు జోడించిన అనంతరం నిఖిల్ బౌలింగ్‌లో సహస్ర అవుటయ్యాడు. తర్వాత రోహన్, త్రిషాంక్ గుప్తా జంట తొమ్మిదో వికెట్‌కు 88 పరుగుల్ని జతచేయడంతో జట్టు సాధారణ స్కోరును సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన కేరళ జట్టు ఆటముగిసే సమయానికి 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. నితీశ్ 190 బ్యాటింగ్ తమిళనాడు జట్టుతో ఎన్ఎఫ్సీ గ్రౌండ్స్‌లో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు భారీస్కోరు సాధించింది. ఓపెనర్ కె. నితీశ్ కుమార్ రెడ్డి (300 బంతుల్లో 190 బ్యాటింగ్; 25 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు 93 ఓవర్లలో 3 వికెట్లకు 320 పరుగులు చేసింది. జె. సూర్య చైతన్య (56) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, సుబ్రహ్మణ్యం (38) రాణించాడు. నితీశ్‌తో పాటు ధరణి కుమార్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
హైదరాబాద్ ఇన్నింగ్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. షిమోగాలో తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 175 పరుగులతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 4/0తో మూడోరోజు రెండో ఇన్నింగ్‌సను కొనసాగించిన తమిళనాడు జట్టు 58.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో టి. రోహన్ 2 వికెట్లు దక్కించుకోగా... డి. సాయిశ్రాగ్వి, అభిషేక్ పరాడ్కర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలిఇన్నింగ్సలో హైదరాబాద్ జట్టు 433/7 వద్ద ఇన్నింగ్‌సను డిక్లేర్ చేయగా... తమిళనాడు 94 పరుగులు చేసింది. మ్యాచ్ గెలిచిన హైదరాబాద్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి.