సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. షిమోగాలో తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 175 పరుగులతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 4/0తో మూడోరోజు రెండో ఇన్నింగ్‌సను కొనసాగించిన తమిళనాడు జట్టు 58.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
హైదరాబాద్ బౌలర్లలో టి. రోహన్ 2 వికెట్లు దక్కించుకోగా... డి. సాయిశ్రాగ్వి, అభిషేక్ పరాడ్కర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలిఇన్నింగ్‌సలో హైదరాబాద్ జట్టు 433/7 వద్ద ఇన్నింగ్‌సను డిక్లేర్ చేయగా... తమిళనాడు 94 పరుగులు చేసింది. మ్యాచ్ గెలిచిన హైదరాబాద్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి.