హైదరాబాద్‌ ‘డ్రా’తో సరి | Hyderabad secured three point after their match against Kerala ended in a draw | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ‘డ్రా’తో సరి

Published Mon, Dec 4 2017 10:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

Hyderabad secured three point  after their match against Kerala ended in a draw

సాక్షి, హైదరాబాద్‌: విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ అండర్‌–16 క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. జింఖానా మైదానంలో కేరళతో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్‌ డ్రాగా ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 80/2తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ 56 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 115 పరుగుల్ని కలుపుకొని ఓవరాల్‌గా 276 పరుగుల లక్ష్యాన్ని కేరళ జట్టు ముందుంచింది.

ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ పి. శివ (54 నాటౌట్‌; 6 ఫోర్లు), వైఎస్‌ వరుణ్‌ (64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన కేరళ జట్టు డ్రానే లక్ష్యంగా నెమ్మదిగా ఆడింది.  అల్బిన్‌ బిను (148 బంతుల్లో 62; 10 ఫోర్లు), రోహన్‌ నాయర్‌ (134 బంతుల్లో 52 నాటౌట్‌; 6 ఫోర్లు) నింపాదిగా ఆడటంతో మ్యాచ్‌ ముగిసేసమయానికి కేరళ జట్టు 72 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో శ్రాగ్వి, కె. పూర్ణానంద రావు చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌ జట్టుకు 3 పాయింట్లు లభించాయి. ఈనెల 5న జరిగే తదుపరి మ్యాచ్‌లో గోవాతో హైదరాబాద్‌ తలపడుతుంది.   

ఆంధ్ర మ్యాచ్‌ ‘డ్రా’...

ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్‌లో తమిళనాడు, ఆంధ్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 188/2తో ఆట మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన తమిళనాడు జట్టు మ్యాచ్‌ ముగిసే సమయానికి 153 ఓవర్లలో 9 వికెట్లకు 388 పరుగులు చేసింది. లక్ష్య జైన్‌ (97) తృటిలో సెంచరీని చేజార్చుకోగా, మానవ్‌ పరేఖ్‌ (55) అర్ధసెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో వాసు 3 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌ను హైదరాబాద్‌ 127 ఓవర్లలో 4 వికెట్లకు 509 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement