సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ ట్రోఫీ దేశవాళీ అండర్–16 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు ఖాతాలో తొలి విజయం లభించింది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భాగంగా లక్నో వేదికగా హైదరాబాద్ టీమ్ మేఘాలయ జట్టుతో తలపడింది. ప్రత్యర్థిపై ఇన్నింగ్స్ 101 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో వేద్ రెడ్డి(Ved Reddy) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి హైదరాబాద్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. వేద్ రెడ్డి 58 పరుగులు చేయడంతోపాటు మ్యాచ్‌లో 4 వికెట్లు తీసుకున్నాడు. మొదట మేఘాలయ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులకు ఆలౌటైంది. వేద్ రెడ్డి 2 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. వేద్ రెడ్డి (58; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 141 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆడిన మేఘాలయ జట్టు 40 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment