సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆంధ్ర జట్టు విజయ్ మర్చంట్ అండర్–16 క్రికెట్ టోర్నమెంట్‌లో క్వార్టర్స్‌కు చేరుకుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నాగాలాండ్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్, 678 పరుగులతో ఘనవిజయాన్ని సాధించింది. శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 50/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నాగాలాండ్ 67 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్ర బౌలర్ వాసు (6/28) చెలరేగాడు.
కె. నితీశ్ కుమార్ రెడ్డి 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ నితీశ్ కుమార్ (441), యోగానంద (217) విజృంభణతో ఆంధ్ర 801/2 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో సౌత్‌జోన్‌లో ఆంధ్ర 19 పాయింట్లతో అజేయంగా టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర రెండింటిలో గెలిచి మూడు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. ఈనెల 14నుంచి జరిగే క్వార్టర్స్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర ఆడుతుంది.
క్వార్టర్స్‌లో ఆంధ్ర
Published Sat, Jan 6 2018 1:23 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment