సాక్షి, విశాఖపట్నం: కుర్మాన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ శిబిరం వద్ద బీజేపీ సంబరాలు జరుపుకుంది. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతలను బీజేపీ నేత మాధవ్ అవమానించారు. పోరాటాన్ని శంకించే విధంగా మాట్లాడారు. లెఫ్ట్ పార్టీ యూనియన్ నేతలు నిరంతరం విషం చిమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు.
‘‘సమస్య పరిష్కారం కావాలని కార్మిక సంఘాలకు లేదు. సమస్య పరిష్కారం కాకుండా ఉంటే వారికి కూడు దొరుకుతుందని వారి భావన.. కార్మిక సంఘాలే కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న యూనియన్లు అన్ని కుహనా యూనియన్లు. ప్రైవేటికరణ ఆపేస్తామని ఏమి చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుంది’’ అంటూ నోరు పారేసుకున్నారు.
ఇదీ చదవండి: వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది
Comments
Please login to add a commentAdd a comment