టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్ల ఉచ్చులో పడి ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్ పరాజయం పాలైంది. తాజాగా అరుణ్‌జైట్లీ స్టేడియం కూడా స్పిన్‌కు అనుకూలించేలా పిచ్‌ను తయారుచేస్తున్నట్లు క్యురేటర్ ఇప్పటికే తెలిపారు. పిచ్‌కు సంబంధించిన ఫోటోలను కూడా ఢిల్లీ క్రికెట్ తన ట్విటర్‌లో షేర్ చేసింది. దీంతో రెండో టెస్టులోనూ స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సంగతి పక్కనబెడితే.. రెండో టెస్టు ప్రారంభం నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఒక జర్నలిస్టు.. టీమిండియాకు లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్స్ కరువయ్యారు.. షాహిన్ అఫ్రిది, మిచెల్ స్టార్క్ లాంటి ఆరడుగుల 4 అంగుళాలు ఉన్న బౌలర్ భారత్ జట్టులో ఒక్కరు కనిపించడం లేదంటూ ప్రశ్నించాడు.
దీనిపై ద్రవిడ్ స్పందిస్తూ.. '' అవును మీరు అన్నట్లే టీమిండియాలో ప్రస్తుతం లెఫ్టార్మ్ పేసర్ లేడు. నిజానికి లెఫ్మార్మ్ పేసర్ బౌలింగ్‌లో వేరియషన్స్ తీసుకురాగలడు. మీరంతా షాహిన్ , మిచెల్‌స్టార్క్ అని పేర్లు చెబుతున్నారు.. కానీ జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రాలు లెఫ్టార్మ్ బౌలర్లన్న సంగతి మరిచిపోయారు. బీసీసీఐ తప్పకుండా ఇలాంటి సూపర్ టాలెంట్ బౌలర్ల కోసం అన్వేషిస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్ లెఫ్టార్మ్ బౌలర్ అన్న సంగతి తెలిసిందే. అతను ఈ మధ్యన వన్డేల్లో, టి20ల్లో నిలకడగా రాణిస్తూ వికెట్లు తీస్తున్నాడు. క్రమంగా ఎదుగుతున్న అర్ష్‌దీప్ త్వరలోనే టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టే చాన్స్ ఉంది.
ఇలాంటి లెఫ్టార్మ్ బౌలర్ల కోసం సెలెక్టర్లు వెతుకులాట కొనసాగుతూనే ఉంటుంది.. అయితే లెఫ్టార్మ్ బౌలర్ అయినంత మాత్రానా జట్టులో చోటు దక్కదు. జహీర్, ఆశిష్ నెహ్రా, ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వాళ్లు అద్భుతంగా రాణించడం వల్ల జట్టులోకి వచ్చారు తప్ప లెప్టార్మ్ బౌలింగ్ అన్న కారణంతో మాత్రం కాదు. ఇక భారత్ జట్టులో ప్రస్తుతం 6 అడుగుల 4 అంగుళాల బౌలర్ కరువయ్యాడన్న మాట నిజమే. అలాంటి పొడగరి బౌలర్లు మన దేశంలో అరుదుగా దొరుకుతారు. ఎందుకంటే మన దేశంలో సగటు పురుషుడి ఎత్తు 5 నుంచి 6 అంగుళాల మధ్యే ఎక్కువగా ఉంటుంది. మీకు ఎవరైనా అలాంటి పేసర్లు తెలిస్తే మాకు చెప్పండి. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిరంతం ఇదే పనిలో ఉంటుంది'' అంటూ ద్రవిడ్ పేర్కొన్నాడు.
Special praise for a special player! 👏 👏
— BCCI (@BCCI) February 15, 2023
Head Coach Rahul Dravid lauds @cheteshwar1 as he gears up for his 1⃣0⃣0⃣th Test 🙌 🙌 #TeamIndia | #INDvAUS pic.twitter.com/e4PO7MRSST
చదవండి: భారత ఫుట్‌బాల్ దిగ్గజం.. తెలంగాణ ముద్దుబిడ్డ అస్తమయం
చరిత్ర సృష్టించిన ఆండర్సన్.. గడిచిన 21 ఏళ్లలో..!
Comments
Please login to add a commentAdd a comment