నోరు జారిన గ్రేమ్ స్వాన్!
లండన్:తమ దేశంలో స్పిన్నర్ల పట్ల వ్యవహరించే తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ నోరు జారాడు. అసలు ఇంగ్లండ్లో స్పిన్నర్లను గుర్తించకపోవడం ఒకటైతే, వారిని మూడో తరగతి ప్రజల వలే చూస్తారంటూ తీవ్రంగా విమర్శించాడు. అదే ఇంగ్లండ్లో స్పిన్పై అంత ఆసక్తి కనబరచకపోవడానికి కారణమని స్వాన్ పేర్కొన్నాడు.
'మాకు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉండరు. అందుకు కారణం మమ్మల్ని ట్రీట్ చేసే విధానమే. మూడో తరగతికి చెందిన క్రికెటర్ల తరహాలో చూస్తారు. దాంతో స్పిన్పై సీరియస్గా దృష్టి పెట్టం. మాకు ఉపయోగపడని మంచి జట్టు ఉంటుంది. ఉపయోగపడని మంచి క్రికెటర్లు ఉంటారు. దాంతో భారత్తో జరుగబోయే సిరీస్ లను కోల్పోతాం. కారణం.. స్పిన్నర్లను చిన్నచూపు చూడటమే' అని స్వాన్ ధ్వజమెత్తాడు. ప్రస్తుతం జరగబోయే టెస్టు సిరీస్లో భారత్ ను ఒకసారి కుదురుకోనిస్తే ఇంగ్లండ్ కోలుకోవటం అంత ఈజీ కాదన్నాడు.