
పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీకి హీరో ధనుష్ దర్శకత్వం వహించారు.

ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్‌తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి రిలీజ్ చేస్తోంది.













