ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 111 బంతుల్లో 146 పరుగులు సాధించి పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వరల్డ్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన పంత్‌పై ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది ఒక గొప్ప రోజు. ఈ మ్యాచ్‌లో పంత్ ఆడిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. పంత్ ప్రపంచ స్థాయి ఆటగాడు. అటువంటి ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మేము న్యూజిలాండ్‌పై మూడు మ్యాచ్‌ల్లోనూ పై చేయి సాధించాము. కానీ ఇక్కడ తొలి రోజే టీమిండియా మాపై అదిపత్యం చెలాయించింది. టీమిండియా నుంచి గట్టి పోటీ ఉంటుంది అని మెకల్లమ్ ముందే చెప్పాడు. తొలి రోజు మా బౌలర్లు కూడా అద్బుతంగా రాణించారు. తొలుత 30-40 ఓవర్లలో భారత్‌ను బాగానే కట్టడం చేశాం. కానీ తర్వాత పిచ్ బ్యాటర్లకు అనుకూలించడంతో భారత్ మాపై చేయి సాధించింది" అని కాలింగ్‌వుడ్ పేర్కొన్నాడు.
చదవండి: India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్‌స్టార్: పంత్‌పై ప్రశంసల జల్లు
Comments
Please login to add a commentAdd a comment