Paul Collingwood
-
ఓ చేతిలో బీర్.. మరో చేతితో స్టన్నింగ్ క్యాచ్! ఇంగ్లండ్ కోచ్ ఫిదా
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మూడో రోజు ఆట సందర్భంగా ఓ అభిమాని ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఓ చేతిలో బీర్.. మరో చేతితో క్యాచ్ పట్టి అందరని సదరు ఫ్యాన్ ఆకట్టున్నాడు. అతడి క్యాచ్‌కు ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ ఫిదా అయిపోయాడు.అసలేం జరిగిందంటే?ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 82 ఓవర్లో అసిత్ ఫెర్నాండో తొలి బంతిని మార్క్‌వుడ్‌కు షార్ట్ బాల్‌గా సందించాడు. ఆ బంతిని వుడ్ డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ సిక్స్‌గా మలిచాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఓ చేతిలో బీర్ పట్టుకుని మరి ఈ క్యాచ్‌ను అతడు అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి క్యాచ్‌ను చూసి పాల్ కాలింగ్‌వుడ్ ఆశ్చర్యపోయాడు. కాలింగ్‌వుడ్‌తో తన సహచర కోచింగ్ స్టాప్‌తో కలిసి నవ్వుతూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 358 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జామీ స్మిత్(111) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కాగా అంతకుముందు శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది. YES, SIR! 🫡Take incredible catch ✅Don't spill a drop ✅Impress the coaches ✅ pic.twitter.com/IamoUULjmb— England Cricket (@englandcricket) August 23, 2024 -
WC: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజాలతో..
ICC Cricket World Cup Qualifiers 2023 SCO Vs NED: వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్‌కు వచ్చే రెండు జట్లేవో తేలిపోయింది. మాజీ చాంపియన్ శ్రీలంక ఇంతకుముందే అర్హత సాధించగా, ఇప్పుడు నెదర్లాండ్స్ తమ చోటును ఖాయం చేసుకుంది. తప్పనిసరిగా నెగ్గాల్సిన గురువారం నాటి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 4 వికెట్లతో స్కాట్లాండ్పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ అసాధారణ రీతిలో బ్రెండన్ మెక్‌ములన్ (106; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. బాస్ డి లీడె (5/52) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావాలంటే 44 ఓవర్లలోనే లక్ష్యం సాధించాల్సిన స్థితిలో నెదర్లాండ్స్ బరిలోకి దిగింది. ఆ జట్టు 42.5 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు సాధించింది. బాస్ దంచికొట్టాడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బాస్ డి లీడె (92 బంతుల్లో 123; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... విక్రమ్‌జిత్ సింగ్ (40), సాఖిబ్ జుల్ఫికర్ (33 నాటౌట్) రాణించారు. 36 ఓవర్లు ముగిసేవరకు కూడా మ్యాచ్ స్కాట్లాండ్ నియంత్రణలోనే ఉంది. 8 ఓవర్లలో నెదర్లాండ్స్ 85 పరుగులు చేయాల్సి ఉంది. తర్వాతి 4 ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 4 ఓవర్లలో 45కు మారింది. ఈ సమయంలో డి లీడె ఒక్క సారిగా టి20 తరహా ఆటను చూపించాడు. వాట్ వేసిన ఓవర్లో 2 సిక్స్‌లు, మెక్‌ములెన్ వేసిన తర్వాతి ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో మొత్తం 42 పరుగులు వచ్చేశాయి. 84 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. డి లీడె రనౌటైనా, వాన్ బీక్ సింగిల్ తీయడంతో డచ్ శిబిరంలో సంబరాలు షురూ అయ్యాయి. తొలి డచ్ క్రికెటర్‌గా ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సెంచరీ హీరో బాస్ డి లీడె అరుదైన రికార్డు సాధించాడు. డచ్ క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన నిలిచాడు. వన్డేల్లో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు డి లీడె. గతంలో వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్), కాలింగ్‌వుడ్ (ఇంగ్లండ్), రోహన్ ముస్తఫా (యూఏఈ) మాత్రమే ఈ ఘనత సాధించారు. తొలి ప్లేయర్ వివియన్ రిచర్డ్స్ 1987లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వివ్ రిచర్డ్స్ 119 పరుగులు చేయడంతో పాటు 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్‌తో 2005 నాటి మ్యాచ్‌లో పాల్ కాలింగ్‌వుడ్ సెంచరీ సాధించడంతో పాటు ఆరు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ కెప్టెన్ రోహన్ ముస్తఫా 2017లో పపువా న్యూ గినియాతో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
పంత్ ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్.. అతడి ఇన్నింగ్స్‌కు హ్యాట్సాఫ్: ఇంగ్లండ్ కోచ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 111 బంతుల్లో 146 పరుగులు సాధించి పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వరల్డ్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన పంత్‌పై ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది ఒక గొప్ప రోజు. ఈ మ్యాచ్‌లో పంత్ ఆడిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. పంత్ ప్రపంచ స్థాయి ఆటగాడు. అటువంటి ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము న్యూజిలాండ్‌పై మూడు మ్యాచ్‌ల్లోనూ పై చేయి సాధించాము. కానీ ఇక్కడ తొలి రోజే టీమిండియా మాపై అదిపత్యం చెలాయించింది. టీమిండియా నుంచి గట్టి పోటీ ఉంటుంది అని మెకల్లమ్ ముందే చెప్పాడు. తొలి రోజు మా బౌలర్లు కూడా అద్బుతంగా రాణించారు. తొలుత 30-40 ఓవర్లలో భారత్‌ను బాగానే కట్టడం చేశాం. కానీ తర్వాత పిచ్ బ్యాటర్లకు అనుకూలించడంతో భారత్ మాపై చేయి సాధించింది" అని కాలింగ్‌వుడ్ పేర్కొన్నాడు. చదవండి: India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్‌స్టార్: పంత్‌పై ప్రశంసల జల్లు -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా పాల్ కాలింగ్‌వుడ్..
ECB Named Collingwood As Interim Head Coach: విండీస్‌తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ పాల్ కాలింగ్‌వుడ్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సోమవారం ప్రకటించింది. కాలింగ్‌వుడ్ నియామకం తాత్కాలిక ప్రాతిపదికన జరిగినట్లు ఈసీబీ పేర్కొంది. తాజాగా విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ కోసం ఇంచార్జ్ కోచ్‌గా వ్యవహరించిన కాలింగ్‌వుడ్.. సెలవు నిమిత్తం కరీబియన్ దీవుల్లోనే ఉన్నాడని, ఫిబ్రవరి 25న ఇంగ్లండ్ జట్టు అక్కడి చేరుకోగానే అతను బాధ్యతలు చేపడతాడని ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ వెల్లడించాడు. ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఓ వార్మప్ మ్యాచ్‌తో పాటు 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. మార్చ్ 1 నుంచి విండీస్ టూర్ ప్రారంభంకానుంది. కాగా, తాజాగా జరిగిన టీ20 సిరీస్‌లో కాలింగ్‌వుడ్ ఆధ్వర్యంలోని ఇంగ్లీష్ జట్టు విండీస్ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2021-22లో ఆసీస్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి(0-4) బాధ్యున్ని చేస్తూ ఇంగ్లండ్ హెడ్ కోచ్ సిల్వర్‌వుడ్‌కు ఈసీబీ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు ఖరారు..!