ఓ చేతిలో బీర్.. మ‌రో చేతితో స్ట‌న్నింగ్ క్యాచ్‌! ఇంగ్లండ్‌ కోచ్‌ ఫిదా | ENG Vs SL: England Coach In Splits As Fan Takes A Stunner While Holding A Beer In 1st Test, Video Goes Viral | Sakshi
Sakshi News home page

ENG Vs SL: ఓ చేతిలో బీర్.. మ‌రో చేతితో స్ట‌న్నింగ్ క్యాచ్‌! ఇంగ్లండ్‌ కోచ్‌ ఫిదా(వీడియో)

Published Fri, Aug 23 2024 8:39 PM | Last Updated on Sat, Aug 24 2024 1:08 PM

England Coach In Splits As Fan Takes A Stunner

మాంచెస్టర్ వేదిక‌గా ఇంగ్లండ్‌-శ్రీలంక మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. మూడో రోజు ఆట సంద‌ర్భంగా ఓ అభిమాని ఒంటి చేత్తో అద్భుత‌మైన క్యాచ్‌ను అందుకున్నాడు. 

ఓ చేతిలో బీర్.. మ‌రో చేతితో క్యాచ్ ప‌ట్టి అంద‌ర‌ని స‌ద‌రు ఫ్యాన్ ఆక‌ట్టున్నాడు. అత‌డి క్యాచ్‌కు ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ ఫిదా అయిపోయాడు.

అస‌లేం జ‌రిగిందంటే?
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 82 ఓవ‌ర్‌లో అసిత్ ఫెర్నాండో తొలి బంతిని మార్క్‌వుడ్‌కు షార్ట్ బాల్‌గా సందించాడు. ఆ బంతిని వుడ్ డీప్ మిడ్‌వికెట్ దిశ‌గా భారీ సిక్స్‌గా మ‌లిచాడు. ఈ క్ర‌మంలో స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్య‌క్తి సింగిల్ హ్యాండ్‌తో స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. 

ఓ చేతిలో బీర్ ప‌ట్టుకుని మ‌రి ఈ క్యాచ్‌ను అత‌డు అందుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డి క్యాచ్‌ను చూసి పాల్ కాలింగ్‌వుడ్ ఆశ్చ‌ర్య‌పోయాడు. కాలింగ్‌వుడ్‌తో త‌న స‌హ‌చ‌ర కోచింగ్ స్టాప్‌తో క‌లిసి న‌వ్వుతూ క‌న్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 358 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జామీ స్మిత్(111) అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. కాగా అంత‌కుముందు శ్రీలంక త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 236 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement