Jasprit Bumrah Breaks Brian Laras World Record In Tests - Sakshi
Sakshi News home page

ENG vs IND: ఒకే ఓవర్‌లో 29 పరుగులు.. బుమ్రా ప్రపంచ రికార్డు..!

Published Sat, Jul 2 2022 6:14 PM | Last Updated on Sat, Jul 2 2022 7:43 PM

Jasprit Bumrah Breaks Brian Laras World Record In Tests - Sakshi

టెస్టు క్రికెట్‌లో టీమిండియా ఆటగాడు, స్టాండింగ్‌ కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో 84 ఓవర్‌ వేసిన స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఏకంగా బుమ్రా 29 పరుగులు రాబట్టాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను బుమ్రా తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఓవర్‌లో బ్రాడ్‌ ఆరు ఎక్స్‌ట్రాలతో కలిపి 35 పరుగులు సమర్పించుకున్నాడు.

అంతకుమందు 2003లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్‌ ఆర్.పీటర్సన్ బౌలింగ్‌లో వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా 28 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు వరకు అదే ప్రపంచ రికార్డు కాగా.. ఇప్పుడు బుమ్రా 29 పరుగులు సాధించి లారా రికార్డును బద్దలు కొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నిం‍గ్స్‌లో రిషబ్‌ పంత్‌(146), జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ అండర్సన్‌ 5 వికెట్లు, పొట్స్‌ 2 వికెట్లు,బ్రాడ్‌,రూట్‌,స్టోక్స్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండిENG vs IND: టెస్టుల్లో జడేజా అరుదైన ఫీట్‌.. నాలుగో భారత ఆటగాడిగా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement