జస్‌ప్రీత్ బుమ్రా (PC: Jio Cinema X)
#MIvGT- JASPRIT BUMRAH Super Spell Video: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఈ పేస్ గుర్రం నైపుణ్యాలకు అభిమానులతో పాటు దిగ్గజ బౌలర్లు సైతం ఫిదా అయ్యారు.
0,0,0,4,0,వికెట్,1,0,1,0,0,0,వికెట్,1,వికెట్,0,0,1,1లెగ్‌బై,1,2,1,1,1 - నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు(3/14). గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో బుమ్రా అద్భుత స్పెల్‌ను చాటిచెప్పే గణాంకాలు.
Just Bumrah Things 🤷♂️@Jaspritbumrah93 on target in his first over 👏#GT reach 47/1 after 6 overs
— IndianPremierLeague (@IPL) March 24, 2024
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱
Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/Zt6vIEa0me
ఈ నేపథ్యంలో బుమ్రా ఆట తీరును ప్రశంసిస్తూ ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా సాహాను బౌల్డ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘తన ట్రేడ్‌మార్క్ స్కిల్ ఇది. పేస్‌తో బ్యాటర్‌ను ముప్పుతిప్పలు పెట్టగల సత్తా అతడి సొంతం.
అత్యద్భుతమైన నైపుణ్యాలు, ప్రతిభ అతడికి ఉన్నాయి. అందుకే వ్యూహాలను పక్కాగా అమలు చేసి ప్రతిసారి విజయవంతమవుతాడు’’ అని బ్రాడ్.. బుమ్రాను కొనియాడాడు.
1️⃣ brings 2️⃣
— IndianPremierLeague (@IPL) March 24, 2024
Three wickets in the match for @Jaspritbumrah93 👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱
Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT#TATIPL | #GTvMI | @mipaltan pic.twitter.com/XXH33C7Yq6
కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(19) అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన బుమ్రా.. అనంతరం సాయి సుదర్శన్(45), డేవిడ్ మిల్లర్(12) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై.. గుజరాత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.
ఆఖరి వరకు పోరాడి ఆరు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలిసారి బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు.. గుజరాత్ సారథిగా శుబ్‌మన్ గిల్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్నాడు.
చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ..
Comments
Please login to add a commentAdd a comment