
టెస్టు క్రికెట్‌లో టీమిండియాపై ఇంగ్లండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. టెస్టుల్లో భారత్‌పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డులక్కెంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది. తద్వారా ఈ అరుదైన ఘనతను ఇంగ్లండ్ తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు 1977లో పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 339 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా చేధించింది.
ఇప్పటి వరకు అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ఆసీస్ రికార్డును ఇంగ్లండ్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెయిర్ స్టో(114), రూట్(142) పరుగులతో రాణించారు. కాగా ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో ఇంగ్లండ్ సమం చేసింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు..
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3
ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చదవండి: IND Vs ENG 5th Test: భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం
Comments
Please login to add a commentAdd a comment