record chasing
-
కౌంటీల్లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల టార్గెట్‌ను ఊదేశారు
కౌంటీ క్రికెట్ క్లబ్ సర్రే జట్టు చరిత్ర సృష్టించింది. కౌంటీ చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్‌ను(501 పరుగలు)చేధించిన సర్రే జట్టు ఔరా అనిపించింది. కౌంటీల్లో 1925 తర్వాత ఒక జట్టు 500కు పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఇది రెండోసారి. ఇంతకముందు ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా నాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిలెసెక్స్ 502 పరుగుల టార్గెట్‌ను చేధించింది. అప్పట్లో పాస్టీ హెండ్రెన్ 206 పరగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మళ్లీ 98 ఏళ్ల తర్వాత 500 పరుగుల టార్గెట్‌ను అందుకున్న జట్టుగా సర్రే చరిత్రకెక్కింది. విషయంలోకి వెళితే.. కెంట్ విధించిన 501 పరుగుల భారీ టార్గెట్‌ను సర్రే జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐదోరోజు ఆట మొదలయ్యే సమయానికి సర్రే విజయానికి 238 పరుగులు అవసరం కాగా.. కెంట్కు ఏడు వికెట్లు కావాలి. జేమీ స్మిత్ 77 బంత్లులో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో డామ్ సిబ్లే, బెన్ ఫోక్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బెన్ ఫోక్స్(211 బంతుల్లో 124 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ కాగా.. రెండురోజులు ఎంతో ఓపికతో ఆడిన డోమ్ సిబ్లే(511 నిమిషాల పాటు) 415 బంతుల్లో 140 పరుగులు నాటౌట్ అసమాన ఇన్నింగ్స్ ఆడి సర్రేకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. చివర్లో జోర్డాన్ క్లాక్ 26 నాటౌట్ అతనికి సహకరించాడు. ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్‌ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్‌ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. What an effort by Dom Sibley 👏 Sibs finishes 140 not out after batting for 146.1 overs 🤩 So good to have you home 🏡 🤎 | #SurreyCricket https://t.co/iJKxxiQJOt pic.twitter.com/5Wn4Fa7okE — Surrey Cricket (@surreycricket) June 14, 2023 An incredible day 📷 🤎 | #SurreyCricket pic.twitter.com/jYWh9ho31l — Surrey Cricket (@surreycricket) June 14, 2023 చదవండి: రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరు?.. గూగుల్ AI ఊహించని పేర్లు -
చేధిస్తే చరిత్రే; టెస్టుల్లో అత్యధిక లక్ష్య చేధన ఎంతో తెలుసా?
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ తుది అంకానికి చేరుకుంది. నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టెస్టు క్రికెట్లో ఇంత భారీ టార్గెట్‌ను చేధించిన సందర్బాలు లేవు. ఒకవేళ టీమిండియా భారీ టార్గెట్‌ను అందుకుంటే మాత్రం కొత్త చరిత్రను తిరగరాసినట్లవుతుంది. టెస్టుల్లో అత్యధిక చేధన ఎంతో తెలుసా? ఇక టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్‌ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్‌ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇది మినహా ఇప్పటివరకు టీమిండియా 400 పరుగుల టార్గెట్‌ను మళ్లీ చేధించిన దాఖలాలు లేవు. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా విధించిన 444 పరుగుల టార్గెట్‌ను చేధిస్తే.. అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించిన జట్టుగా టీమిండియా రికార్డులకెక్కనుంది. India will create history if they chase down 444. No team chased down more 418 in Test cricket! pic.twitter.com/Tkyd3khSpz — Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
టీమిండియాపై ఇంగ్లండ్ అరుదైన ఘనత.. 45 ఏళ్ల రికార్డు బద్దలు..!
టెస్టు క్రికెట్లో టీమిండియాపై ఇంగ్లండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. టెస్టుల్లో భారత్‌పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డులక్కెంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది. తద్వారా ఈ అరుదైన ఘనతను ఇంగ్లండ్ తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు 1977లో పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 339 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా చేధించింది. ఇప్పటి వరకు అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ఆసీస్ రికార్డును ఇంగ్లండ్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెయిర్ స్టో(114), రూట్(142) పరుగులతో రాణించారు. కాగా ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో ఇంగ్లండ్ సమం చేసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3 ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs ENG 5th Test: భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం -
మరో రికార్డును బిట్‌కాయిన్ నెలకొల్పనుందా...!
Bitcoin Gets Closer To 60000 Dollors: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అధిక ద్రవ్యోల్భణ పరిస్థితులు...క్రిప్టోకరెన్సీపై చైనా తీసుకున్న నిర్ణయాలు పలు క్రిప్టోకరెన్సీలు ఒక్కసారిగా పతనమైన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఎల్ సాల్వాడర్ బిట్‌కాయిన్ మైనింగ్‌పై తీసుకున్న నిర్ణయాలు తిరిగి బిట్‌కాయిన్ పుంజుకునేందుకు దోహదం చేశాయి. చివరి వారంలో బిట్‌కాయిన్ ఏకంగా 30 శాతం మేర పురోగతిని సాధించింది. దీంతో ఐదెన్నెల్ల గరిష్టానికి బిట్‌కాయిన్ విలువ చేరుకుంది. 60 వేల డాలర్లకు చేరువలో...! బిట్‌కాయిన్ విలువ మరో సరికొత్త రికార్డులకు దగ్గరలోనే ఉంది. బిట్‌కాయిన్ విలువ 60 వేల డాలర్లకు చేరనుంది. మే తర్వాత మొదటిసారి బిట్‌కాయిన్ 57 వేల డాలర్లు(రూ. 42 లక్షలు) దాటింది. బినాన్స్, కాయిన్మర్కెట్ క్యాప్ వంటి ఎక్సేచేంజ్లో 57, 490 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇండియన్ ఎక్సేచేంజ్ కాయిన్స్ స్విచ్ కుబేర్‌లో బిట్ కాయిన్ విలువ 59 వేల డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో క్రిప్టోకరెన్సీ ఆల్‌టైమ్ హై 65 వేల డాలర్లను తాకింది. బిట్‌కాయిన్ ర్యాలీ ఇదే విధంగా కొనసాగితే మరికొన్ని రోజుల్లో కొత్త రికార్డును తాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈథర్ వంటి క్రిప్టోకరెన్సీ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఈథిరియం విలువ 3,740 వద్ద ట్రేడవుతోంది. సోమవారం రోజున సుమారు 1.29 శాతం మేర లాభపడింది. అయితే ఈథర్‌లో స్థిరమైన ర్యాలీ కన్పించడంలేదు. మిగిలిన ఇతర అల్ట్‌కాయిన్స్ కార్డానో, టెథర్, రిపుల్, పోల్కాడోట్ అన్నీ సగటున 2-3 శాతం మేర తగ్గుతూ కన్పించాయి. చదవండి: చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్..! -
‘438’.. సీన్ రిపీట్ అవుతుందా?
‘438’ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నంబర్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ మరిచిపోని నంబర్ ‘438’. ఎందుకంటే టీ20 ఫార్మట్ అంతగా ఎస్టాబ్లిష్ కాకముందే వన్డే చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రికార్డు స్కోర్ నమోదు చేసింది దక్షిణాఫ్రికా జట్టు. కేప్‌టౌన్ వేదికగా ఆసీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రొటీస్ జట్టు అందరినీ షాక్‌కు గురిచేస్తూ 438 పరుగులు సాధించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదెప్పుడో 2006లో జరిగింది కదా మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆ చర్చ అనుకుంటున్నారా? అయితే అదే మ్యాజిక్ ఫిగర్ దక్షిణాఫ్రికాను మరోసారి ఊరిస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ‘438’ మరోసారి తెరపైకి వచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా ఆతిథ్య సఫారీ లక్ష్యం 438 పరుగులు. పర్యాటక ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను 391/8 వద్ద డిక్లెర్డ్ చేసింది. దీంతో 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని డుప్లెసిస్ సేన ముందు ఇంగ్లండ్ 438 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఎల్గర్(34), హమ్జా(15) అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం క్రీజులో మలాన్(63 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్ కేశవ్ మహారాజ్(2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సఫారీ జట్టు గెలవాలంటే ఆట చివరి రోజు 312 పరుగులు సాధించాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. అయితే గెలుపు కోసం పోరాడటంతో పాటు ఓడిపోకుండా జాగ్రత్తగా ఆడాలని ప్రొటీస్ జట్టు భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో తప్పక గెలిచి నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో లెవల్ చేయాలని రూట్ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫికా ‘438’ సీన్ మరోసారి రిపీట్ చేస్తుందని ఆ దేశ అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆనాటి మ్యాచ్‌కు సంబంధించి మధురస్మృతులను గుర్తుచేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆనాటి మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక ఆ మ్యాచ్‌లో అప్పటి సారథి రికీ పాంటింగ్ (164) భారీ సెంచరీ సాధించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది. అనంతరం హెర్షల్ గిబ్స్(175), స్మిత్(90)తో పాటు బౌచర్(50 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 438 పరుగులు సాధించి విజయాన్ని అందుకుని ఛేజింగ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. -
ట్వంటీ 20 లో రికార్డ్ ఛేజింగ్
సాక్షి, స్పోర్ట్స్: ట్వంటీ20 చరిత్రలో రికార్డ్ ఛేజింగ్ ను ఆస్ట్రేలియా సాధ్యం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన పరుగుల పోరులో ఆసీస్ జట్టునే విజయం వరించింది. కివీస్ విసిరిన 244 పరగుల లక్ష్యాన్ని మరో ఏడే బంతులుండగానే అలవోకగా ఛేదించి ఆసీస్ జట్టు చరిత్ర సృష్టించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేయగా న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ (54 బంతుల్లో 106, 6ఫోర్లు, 9 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్ మున్రో (33 బంతుల్లో 76: 6ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో కివీస్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసి ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (24 బంతుల్లో 59: 4ఫోర్లు, 5 సిక్సర్లు), షార్ట్ (44 బంతుల్లో 76: 8ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం అందించారు. 121 పరుగుల వద్ద వార్నర్ ను కివీస్ బౌలర్ సోదీ బౌల్డ్ చేశాడు. ఆపై క్రిస్ లిన్ (18), మాక్స్వెల్ (14 బంతుల్లో 31: 3ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి షార్ట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో అరోన్ ఫించ్ (14 బంతుల్లో 36: 3ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో 18.5 ఓవర్లలో మరో 7 బంతులుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ట్వంటీ20 చరిత్రలో రికార్డు ఛేజింగ్ ఆసీస్ (245/5) పేరిట నమోదైంది. గతంలో ఈ ఛేజింగ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాపై 231 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో విండీస్ ఛేదించింది. కాగా నేడు కివీస్‌తో జరిగిన టీ20లో ఆసీస్ జట్టు 243 పరగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. 2015లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 231 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసి మరో నాలుగు బంతులు మిగిలుండగానే విండీస్ విజయం సాధించింది. -
ఫుల్‌గా తాగి.. 175 బాదిన బ్యాట్స్‌మన్
వన్డే క్రికెట్ చరిత్రలో 12/3/2006 తేదీకి ఓ ప్రత్యేకమైన స్థానముంది. సరిగ్గా ఇదే తేదీన దక్షిణాఫ్రికా జట్టు 434 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. వన్డే చరిత్రలో 400కుపైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అదే తొలిసారి.. ఈ అరుదైన ఘనతను సఫారీలు సొంతం చేసుకోవడం వెనుక చిచ్చరపిడుగు హెర్షల్లీ గిబ్స్ పాత్ర ఉంది. జోహాన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాలో జగిరిన ఈ వన్డేలో గిబ్స్ చెలరేగిపోయాడు. ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా 175 పరుగులు చేయడంతో అసాధ్యమనుకున్న 400కుపైగా లక్ష్యాన్ని సఫారీలు సొంతం చేసుకున్నారు. అయితే, గిబ్స్ సాధించిన అరుదైన ఈ ఫీట్ వెనుక ఉన్న ఓ రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వన్డే మ్యాచ్‌కు ముందురోజు అర్ధరాత్రి దాకా పీకలవరకు తాగి.. ఫుల్ హ్యాంగోవర్ స్థితిలో గిబ్స్ బ్యాటింగ్‌కు దిగాడు. ఆ హ్యాంగోవర్‌తోనే కంగారు బౌలర్లను కకావికలం చేశాడు. ఈ విషయాన్ని తన ఆత్మకథలో గిబ్స్ వెల్లడించాడు. మ్యాచ్‌కు ముందురోజు స్నేహితుడితో కలిసి రాత్రి ఒంటిగంటవరకు ఫుల్‌గా మద్యాన్ని సేవించానని, ఆ తెల్లారి హ్యాంగోవర్‌తోనే బ్యాటింగ్‌కు దిగానని గిబ్స్ పేర్కొన్నాడు. సహజంగానే చెలరేగి ఆడే గిబ్స్కు ఆ హ్యాంగోవర్ ఇంకాస్తా ఊపునిచ్చిందేమో. ఏకంగా 21 ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఆ మ్యాచ్‌లో గిబ్స్ విధ్వంసం సృష్టించాడు. అతని ఘనతతో దక్షిణాఫ్రికా 434పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికీ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యఛేదన రికార్డుగా ఇది మిగిలిపోయింది. -
'అది అత్యుత్తమ ప్రదర్శన కాదు'
ముంబై: దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ లో 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జో రూట్. రూట్ కేవలం 44 బంతుల్లో 83 (6 ఫోర్లు; 4 సిక్సర్లు) బాది జట్టుకు విజయాన్ని అందించినా సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. తమ జట్టు భారీ టార్గెట్ ఛేదించి మరీ విజయాన్ని అందుకున్నప్పటికీ అది ఇంగ్లండ్ అత్యుత్తమ ప్రదర్శన కాదని రూట్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితం మాత్రం తమ జట్టులో విశ్వాసాన్ని పెంచిందని జో రూట్ తెలిపాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక ఛేజింగ్ అయినప్పటికీ తమ అత్యుత్తమ ఆట బయటకు రావాల్సి ఉందని రూట్ పేర్కొటూ టోర్నమెంట్ కు మరింత జోష్ తీసుకొచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నాడు. గ్రూప్ నుంచి తర్వాతి దశకు వెళ్లేందుకు తమ ఆటగాళ్లకు మరింత మంచి అవకాశం లభించిందని, మంచి ఆరంభం లభిస్తే ఎలాంటి మ్యాచ్ లో నైనా విజయాలు సాధించవచ్చని చెప్పాడు. అద్భుత ఆరంభం లభించడంతో మధ్య ఓవర్లలో సులువుగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశం దొరికిందని, స్పిన్నర్లు గత కొంతకాలం నుంచి మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారని చెప్పుకొచ్చాడు.