ఎడ్డ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్ రెండు, ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా.. మరో మ్యాచ్ డ్రా ముగిసింది. ఇక 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటరల్లో జానీ బెయిర్‌స్టో(114), జో రూట్ (142) సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ బెయిర్‌స్టో సెంచరీలు సాధించాడు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా తెలిపోయారు. కెప్టెన్ బుమ్రా తప్ప మిగితా బౌలర్లు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో పంత్(146), జడేజా అద్భుతమైన సెంచరీలు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో(106) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు, బుమ్రా మూడు, షమీ రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 132 పరుగల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 245 పరుగులకే ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పుజారా(66),పంత్(57) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. బ్రాడ్, పాట్స్ తలా రెండు, అండర్సన్,జాక్ లీచ్ చెరో వికెట్ సాధించారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు..
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3
ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం
This team. This way of playing. Simply irresistible ❤️
— England Cricket (@englandcricket) July 5, 2022
Scorecard/Clips: https://t.co/jKoipF4U01
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/Phl1BNkGol
Comments
Please login to add a commentAdd a comment