ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. అదే ఉత్సాహంలో ఇంగ్లండ్‌తో తలపడేందుకు సన్నద్ధమవుతోంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో పర్యాటక జట్టును దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇక ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సంబంధించి తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ... జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మరికాసేపట్లో చెన్నైలో ప్రారంభం కానున్న టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌లో మీ ఫేవరెట్ XI భారత ఆటగాళ్లెవరో మాతో పంచుకోండి. తుది జట్టులో ఎవరు ఆడితే ప్రయోజనకరంగా ఉంటుందో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయం చెప్పండి.(చదవండి: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: పూర్తి షెడ్యూల్ ఇదే!)
ఓపెనర్లు:
(ఇద్దరిని ఎంచుకోండి)
1.రోహిత్ శర్మ
2.మయాంక్ అగర్వాల్
3.శుభ్‌మన్ గిల్
మిడిలార్డర్/లోయర్ ఆర్డర్
(నలుగురిని ఎంచుకోండి)
1.అజింక్య రహానే
2.విరాట్ కోహ్లి
3.కేఎల్ రాహుల్
4.హార్దిక్ పాండ్యా
5.ఛతేశ్వర్ పుజారా
వికెట్ కీపర్
(ఒక్కరిని ఎంచుకోండి)
1.రిషభ్ పంత్
2.వృద్ధిమాన్ సాహా
బౌలర్లు
(నలుగురిని ఎంచుకోండి)
1.కుల్దీప్ యాదవ్
2.శార్దూల్ ఠాకూర్
3.రవిచంద్రన్ అశ్విన్
4.ఇషాంత్ శర్మ
5.జస్‌ప్రీత్ బుమ్రా
6.మహ్మద్ సిరాజ్
7.వాషింగ్టన్ సుందర్
8.అక్షర్ పటేల్
తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ఖరారు చేసిన జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.
Comments
Please login to add a commentAdd a comment