
టీమిండియాతో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జట్టునే ఈ ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. మూడు మ్యాచ్ ఇక న్యూజిలాండ్‌తో జరిగిన అఖరి టెస్టులో బెన్ ఫోక్స్ స్థానంలో కొవిడ్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన సామ్ బిల్లింగ్స్‌కు కూడా భారత్‌తో టెస్టుకు చోటు దక్కింది.
అయితే టీమిండియాతో జరిగే ఈ కీలక మ్యాచ్‌కు బెన్ ఫోక్స్ దూరమయ్యే అవకాశం ఉంది. కరోనా బారిన పడిన ఫోక్స్.. ఐదు రోజుల ఐషోలేషన్‌లో ఉన్నాడు. ఇక ఇరు జట్లు మధ్య ఈ నిర్ణయాత్మక టెస్టు బర్మింగ్‌హామ్ వేదికగా జూలై1న ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మకూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరోనా బారిన పడిన రోహిత్ ప్రస్తుతం ఐషోలేషన్‌లో ఉన్నాడు.
భారత్‌తో జరిగే 5వ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్‌టన్, జామీ ఓవర్‌టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, జో రూట్
చదవండి: Ind Vs Eng 5th Test: రోహిత్‌కు కరోనా! భారత టెస్టు జట్టులోకి మయాంక్ అగర్వాల్!
Comments
Please login to add a commentAdd a comment