BenStokes
-
ప్రపంచంలో టాప్ 5 బెస్ట్ ప్లేయర్స్ వీరే.. కోహ్లి, రోహిత్‌కు నో ఛాన్స్!
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ ఓటమిపాలైనప్పటికీ.. ఆసీస్‌కు మాత్రం చెమటలు పట్టించింది. ఓ వైపు టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో టెస్టు క్రికెట్ కనమరుగై అయిపోతుందని అంతా భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంగ్లండ్, ఆసీస్ మాత్రం రెడ్ బాల్ క్రికెట్‌కు సరికొత్త అర్ధాన్ని చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్లు ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో మరోసారి మొదలైంది. తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ ప్రపంచంలోని టాప్ ఫైవ్ టెస్ట్ క్రికెటర్లను ఎంచుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భజ్జీకి ఓ ప్రశ్న ఎదురైంది. " ప్రస్తుతం ప్రపంచటెస్టు క్రికెట్లో ఐదుగురు బెస్ట్ ప్లేయర్స్ ఎవరు? స్కిల్స్ మాత్రమే కాకుండా గేమ్ ఛేంజర్స్, మ్యాచ్ విన్నర్లు, కీలక సమయాల్లో బాగా ఆడినవారిని పరిగణలోకి తీసుకుని చెప్పండి" అని ఓ ట్విటర్ యూజర్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా భజ్జీ.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు నాథన్ లయాన్, స్టీవ్ స్మిత్, టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్, మరో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను ఎంచుకున్నాడు. కాగా భజ్జీ ఎంచుకున్న టాప్ ఫైవ్ ప్లేయర్స్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ పాటు నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటుదక్కపోవడం గమానార్హం. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. ఇషాన్ కిషన్ అరంగేట్రం! ఆంధ్ర ఆటగాడికి నో ఛాన్స్ -
ఓడిపోయాం అయితే ఏంటి టెస్ట్ క్రికెట్‌కు ఏది అవసరమో అదే చేసాం
-
ఈ మాత్రం దానికి రూ.16.25 కోట్లు దండగ.. డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేయి
-
టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..!
టీమిండియాతో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జట్టునే ఈ ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. మూడు మ్యాచ్ ఇక న్యూజిలాండ్‌తో జరిగిన అఖరి టెస్టులో బెన్ ఫోక్స్ స్థానంలో కొవిడ్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన సామ్ బిల్లింగ్స్‌కు కూడా భారత్‌తో టెస్టుకు చోటు దక్కింది. అయితే టీమిండియాతో జరిగే ఈ కీలక మ్యాచ్‌కు బెన్ ఫోక్స్ దూరమయ్యే అవకాశం ఉంది. కరోనా బారిన పడిన ఫోక్స్.. ఐదు రోజుల ఐషోలేషన్‌లో ఉన్నాడు. ఇక ఇరు జట్లు మధ్య ఈ నిర్ణయాత్మక టెస్టు బర్మింగ్‌హామ్ వేదికగా జూలై1న ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మకూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరోనా బారిన పడిన రోహిత్ ప్రస్తుతం ఐషోలేషన్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగే 5వ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, జామీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, జో రూట్ చదవండి: Ind Vs Eng 5th Test: రోహిత్‌కు కరోనా! భారత టెస్టు జట్టులోకి మయాంక్ అగర్వాల్! -
ఆ ఇంగ్లండ్ ఆల్రౌండర్లా.. టీమిండియాకు నేను ఆడాలి అనుకుంటున్నా..
Venkatesh Iyer Says I want to become like Ben Stokes: ఐపీఎల్-2021 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున ఆదరగొట్టిన వెంకటేష్ అయ్యర్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే. జైపూర్ వేదికగా నవంబర్17న న్యూజిలాండ్-భారత్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడిన అయ్యర్.. పలు అసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ని ఆదర్శంగా తీసుకుంటానని, తుది జట్టులో అవకాశం దొరికితే అతడిలా ఆడాలి అని కోరుకుంటున్నట్లు అయ్యర్ తెలిపాడు. "బెన్ స్టోక్స్ ఇంగ్లండ్‌కు లేదా అతడు ఆడే ఏ జట్టుకైన ఏ విధంగా ఆడుతాడో నేను చూశాను. అతడే నాకు ఆదర్శం. అతడు అన్ని ఫార్మాట్ల్లో మ్యాచ్ విన్నర్. బంతి, బ్యాట్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లో అతడు ఆద్బుతంగా రాణిస్తాడు.. ఇంగ్లండ్ జట్టుకు దొరికిన పెద్ద ఆస్తి స్టోక్స్. అతడి ఆటను చూసినప్పుడల్లా నేను కూడా టీమిండియాకు అలానే ఆడాలి అనుకుంటాను. అన్ని జట్లు బెన్ స్టోక్స్ లాంటి ఆటగాడినే కోరుకుంటాయి అని అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021 సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 370 పరుగులతో పాటు, మూడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 World Cup 2021: టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ షాక్! ఒక్కరంటే ఒక్కరికీ కూడా నో ఛాన్స్ -
రాజస్తాన్‌కు మరో షాక్: ఐపీఎల్ నుంచి అతడు అవుట్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఆటగాడు జట్టును వీడాడు. కఠినమైన ‘బయో బబుల్’ వాతావరణంలో ఇమడలేక ఇంగ్లండ్ క్రికెటర్, ఆర్ఆర్ జట్టు సభ్యుడు లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ -2021 టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. స్వదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆర్ఆర్ ట్విటర్ వేదికగా మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘లియామ్ లివింగ్‌స్టోన్ గత రాత్రి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఏడాది కాలంగా బయోబబుల్‌లో ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. అందుకే అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. తనకు ఎలాంటి మద్దతు అవసరమైనా ఎల్లప్పుడూ మేం సిద్ధంగా ఉంటాం’’ అని పేర్కొంది. కాగా ఈ ఏడాది మినీ వేలంలో రాజస్తాన్ జట్టు లివింగ్‌స్టోన్‌ను అతని కనీస ధర రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో రాజస్తాన్ మూడు మ్యాచ్‌లు ఆడినా తుది జట్టులో లివింగ్‌స్టోన్‌కు చోటు దక్కలేదు. ఇక ఇప్పటికే చేతి వేలి గాయం కారణంగా రాజస్తాన్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అంతేగాక, మరో ఆటగాడు జోఫ్రా ఆర్చర్ సైతం ఇంతవరకు జట్టుతో చేరనేలేదు. ఈ సీజన్ మొదలుకావడానికి ముందే అతడి చేతికి సర్జరీ జరిగింది. దీంతో అతడు ఇప్పటివరకు టోర్నీకి దూరంగానే ఉన్నాడు. చదవండి: ‘వారిద్దరూ ఔటైతే ఇక మిగతా జట్టంతా ఐసీయూనే’ Liam Livingstone has flown back home late last night, due to bubble fatigue accumulated over the past year. We understand and respect his decision, and will continue supporting him in any way we can.#RoyalsFamily pic.twitter.com/stYywf3tBW — Rajasthan Royals (@rajasthanroyals) April 20, 2021 -
బెన్‌స్టోక్స్ రికార్డు బ్యాటింగ్
మాంచెస్టర్: వెస్టిండీస్‌తో రెండో టెస్టును ఎలాగైనా నెగ్గి సిరీస్ సమం చేయాలనుకున్న ఇంగ్లండ్ దానిని చేసి చూపించింది.113 పరుగులతో గెలిచిన రూట్ సేన సిరీస్‌ను 1–1తో సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ చివరి రోజు సోమవారం దూకుడైన బ్యాటింగ్‌తో 11 ఓవర్లకే డిక్లేర్ చేసి ప్రత్యర్థికి 85 ఓవర్లు ఆడే అవకాశం ఇచ్చి ఇంగ్లండ్ సవాల్ విసరగా... 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ తలవంచింది. దీనిలో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.(ఇంగ్లండ్ సాధించింది) ఈ మ్యాచ్ విజయంలో బెన్‌స్టోక్స్ నిజంగా అద్భుతమైన పాత్ర పోషించాడనే చెప్పుకోవాలి. 2వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 255 బాల్స్‌కు 100 రన్స్ చేసి నెమ్మిదిగా సెంచరీ నమోదు చేసుకున్నాడు. కానీ అదే బెన్‌స్టోక్స్ కష్టకాలంలో జట్టును గెలిపించాలనే ఉద్దేశంతో రెండో ఇన్నింగ్స్‌లో 36 బంతుల్లో 50 పరుగులు చేసి సత్తాచాటాడు. ఫలితంగా టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఓపెనర్‌గా బ్యాటింగ్ రికార్డు సాధించాడు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ 57 బంతుల్లో 78 స్కోర్ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులోనాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. విండీస్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ ఓపెనర్‌గా దిగడం గమనార్హం. మొత్తానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1 సమం చేసిన ఇంగ్లండ్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం మాంచెస్టర్ ఓల్డ్ ట్రపోర్డ్ మైదానంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్ డ్రాగా ముగిస్తే సిరీస్ సమం అవుతుంది. చదవండి: సూపర్ స్టోక్స్ -
రూ.14 కోట్లకు న్యాయం చేశాడు: స్మిత్
పుణే: బెన్ స్టోక్స్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని, అతని ప్రైజ్ టాగ్ కు తగిన న్యాయం చేశాడని రైజింగ్ పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయ పడ్డాడు. ఐపీఎల్-10 వేలంలో అత్యధికంగా రూ. 14.5 కోట్లు పలికిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను రైజింగ్ పుణే దక్కించుకున్న విషయం తెలిసిందే. సోమవారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెన్ స్టోక్స్ శతకం బాది ఒంటి చెత్తో మ్యాచ్ గెలిపించాడు. 162 పరుగుల లక్ష్య చేదనలో పుణే టాపర్డర్ చేతులెత్తయడంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. చివర్లో రెచ్చిపోయి ఆడిన స్టోక్స్ జట్టుకు విజయానందించి పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంచాడు. మ్యాచ్ అనంతరం స్టోక్స్ పదర్శన పై స్సందించిన పుణే కెప్టెన్ స్మిత్ ' మేము చక్కని ఆరంభాన్ని అందించకున్నా ఎంఎస్, స్టోక్స్ రాణించారు. ఈ గ్రౌండ్ లో సిక్స్ లను సులభంగా కొట్టవచ్చు దీన్ని స్టోక్స్ సమర్ధవంతంగా ఉపయోగించుకున్నాడు. స్టోక్స్ దాటిగా ఆడటమే మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్. గుజరాత్ ను సాధారణ లక్ష్యం (161) కట్టడి చేయడంలో బౌలర్లు కృషి ఎంతో ఉంది. మా స్పిన్ బౌలింగ్ విభాగం బలంగా లేకున్నా పేసర్లు రాణించారని, తొలి ఆరు ఓవర్లో పరుగులను కట్టడి చేశామని' స్మిత్ తెలిపాడు. మేము సరైన సమయంలో పుంజుకున్నామని భావిస్తున్నట్లు స్మిత్ పేర్కొన్నాడు. ఇంకా నాలుగు మ్యాచ్ లు ఉన్నాయని, వీటిలో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
ష్... మాటల్లేవ్!
మొహాలీ టెస్టులో వరుసగా మూడో రోజు కూడా కోహ్లి, స్టోక్స్ మధ్య ఘర్షణ కొనసాగింది. తొలి రోజు ఇద్దరూ మాటలతో కత్తులు దూస్తే... ఆ తర్వాత ఇద్దరూ సైగలతోనే తమ ‘భావాన్ని’ ప్రదర్శించారు! టెస్టు మొదటి రోజు స్టోక్స్ అవుటై వెళుతూ కోహ్లిని ఏదో అనడంతో అతను తిరిగి జవాబివ్వడం, ఆ తర్వాత స్టోక్స్‌ని తప్పు పట్టి ఐసీసీ హెచ్చరించడం తెలిసిందే. రెండో రోజు స్టోక్స్ బౌలింగ్‌లోనే కోహ్లి అవుటయ్యాడు. జట్టు సంబరాలు చేసుకుంటున్న సమయంలో ‘నేను మాత్రం ఏమీ మాట్లాడను’ అన్నట్లుగా స్టోక్స్ తన నోటిపై చేరుు పెట్టి చూపించాడు. సోమవారం కోహ్లి మళ్లీ అదే తరహాలో బదులిచ్చాడు. అశ్విన్ వేసిన చివరి ఓవర్లో బంతి స్టోక్స్ ప్యాడ్‌కు తగలడంతో అశ్విన్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించారు. అరుుతే కోహ్లి దీనిపై రివ్యూ కోరాడు. ఫలితం భారత్‌కు అనుకూలంగా రావడంతో స్టోక్స్ నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ సమయంలో కోహ్లి తన పెదాలను వేలితో మూసి అతడిని సాగనంపడం విశేషం! 2002లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్, నాటి కెప్టెన్ గంగూలీ మధ్య వివాదాన్ని ఇది గుర్తుకు తెచ్చింది. నాడు ముంబైలో వన్డే గెలిచాక ఫ్లింటాఫ్ షర్ట్ విప్పి సంబరాలు చేసుకోగా, ఐదు నెలల తర్వాత లార్డ్స్‌లో విజయానంతరం గంగూలీ అదే చేసి చూపించాడు.