Harbhajan Singh Named Top Five Test Cricketers In The World At Present, No Place For Kohli - Sakshi
Sakshi News home page

Harbhajan Singh: ప్రపంచంలో టాప్ 5 బెస్ట్‌ ప్లేయర్స్‌ వీరే.. కోహ్లి, రోహిత్‌కు నో ఛాన్స్‌!

Published Tue, Jul 4 2023 2:44 PM | Last Updated on Tue, Jul 4 2023 4:23 PM

Harbhajan Singhs Top Five Test Cricketers In The World At Present - Sakshi

ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ ఓటమిపాలైనప్పటికీ.. ఆసీస్‌కు మాత్రం చెమటలు పట్టించింది. ఓ వైపు టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో టెస్టు క్రికెట్‌ కనమరుగై అయిపోతుందని అంతా భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంగ్లండ్‌, ఆసీస్‌ మాత్రం రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు సరికొత్త అర్ధాన్ని చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్లు ఎవరు అనే చర్చ సోషల్‌ మీడియాలో మరోసారి మొదలైంది.

తాజాగా భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ ప్రపంచంలోని టాప్ ఫైవ్‌ టెస్ట్ క్రికెటర్లను ఎంచుకున్నాడు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భజ్జీకి ఓ ప్రశ్న ఎదురైంది. " ప్రస్తుతం ప్రపంచటెస్టు క్రికెట్‌లో ఐదుగురు బెస్ట్‌ ప్లేయర్స్‌ ఎవరు?  స్కిల్స్ మాత్రమే కాకుండా గేమ్ ఛేంజర్స్, మ్యాచ్ విన్నర్లు, కీలక సమయాల్లో బాగా ఆడినవారిని పరిగణలోకి తీసుకుని చెప్పండి" అని ఓ ట్విటర్‌ యూజర్‌ ప్రశ్నించాడు.

అందుకు బదులుగా భజ్జీ.. ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు నాథన్‌ లయాన్‌, స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా యువ సంచలనం రిషబ్‌ పంత్‌, మరో భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను ఎంచుకున్నాడు. కాగా భజ్జీ ఎంచుకున్న టాప్‌ ఫైవ్‌ ప్లేయర్స్‌లో భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ పాటు  నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటుదక్కపోవడం గమానార్హం.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. ఇషాన్‌ కిషన్‌ అరంగేట్రం! ఆంధ్ర ఆటగాడికి నో ఛాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement