Venkatesh Iyer Says I want to become like Ben Stokes: ఐపీఎల్-2021 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున ఆదరగొట్టిన వెంకటేష్ అయ్యర్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే. జైపూర్ వేదికగా నవంబర్17న న్యూజిలాండ్-భారత్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడిన అయ్యర్.. పలు అసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ని ఆదర్శంగా తీసుకుంటానని, తుది జట్టులో అవకాశం దొరికితే అతడిలా ఆడాలి అని కోరుకుంటున్నట్లు అయ్యర్ తెలిపాడు.
"బెన్ స్టోక్స్ ఇంగ్లండ్‌కు లేదా అతడు ఆడే ఏ జట్టుకైన ఏ విధంగా ఆడుతాడో నేను చూశాను. అతడే నాకు ఆదర్శం. అతడు అన్ని ఫార్మాట్‌ల్లో మ్యాచ్ విన్నర్. బంతి, బ్యాట్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లో అతడు ఆద్బుతంగా రాణిస్తాడు.. ఇంగ్లండ్ జట్టుకు దొరికిన పెద్ద ఆస్తి స్టోక్స్. అతడి ఆటను చూసినప్పుడల్లా నేను కూడా టీమిండియాకు అలానే ఆడాలి అనుకుంటాను. అన్ని జట్లు బెన్ స్టోక్స్ లాంటి ఆటగాడినే కోరుకుంటాయి అని అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021 సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 370 పరుగులతో పాటు, మూడు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: T20 World Cup 2021: టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ షాక్! ఒక్కరంటే ఒక్కరికీ కూడా నో ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment