చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌లో చూసిన అత్యంత దారుణమైన పిచ్‌ల్లో చెన్నైపిచ్ ముందు వరుసలో నిలుస్తుందని వ్యాఖ్యానించాడు. ఆఖరి రోజు పిచ్ మరింత మందకొడిగా మారిపోయి నిర్జీవంగా ఉండిదన్నాడు. చివరి రోజు ఆటలో లంచ్‌కు ముందు డ్రింక్స్ బ్రేక్‌లోపే తమ జట్టు విజయం సాధిస్తుందని ఆశించానని, పిచ్ నిర్జీవంగా మారడంతో మ్యాచ్ ఫలితం మరింత ఆలస్యమైందని పేర్కొన్నాడు.
ఐదో రోజు పిచ్ స్వరూపం ఎలా మారినా తమ బౌలర్ జిమ్మి ఆండర్సన్ మాత్రం అద్భుతమైన రివర్స్ స్వింగ్‌ను రాబట్టి మ్యాచ్‌ను త్వరగా ముగించాడంటూ అండర్సన్‌పై ప్రశంశల వర్షం కురిపించాడు. అండర్సన్ తన చివరి స్పెల్‌ను 5–3–6–3తో ముగించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 227 పరుగుల తేడాతో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలై నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 0-1 తేడాతో వెనకపడింది. కాగా, ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌కు కూడా చెన్నై మైదానమే వేదిక కానుంది. అయితే ఇంగ్లండ్ జట్టు ఫాలో అవుతన్న రొటేషన్ పద్దతి కారణంగా ఈ మ్యాచ్‌లో ఆండర్సన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment