Pitch
-
ఆసీస్‌తో భారత్ తొలి టెస్టు.. పిచ్ క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా- ఆస్ట్రేలియా తొలి టెస్టు నేపథ్యంలో వెస్టర్న్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(WACA) చీఫ్ క్యూరేటర్ ఇసాక్ మెక్‌డొనాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పెర్త్‌లో అకాల వర్షాల వల్ల.. పిచ్ తయారీపై ప్రభావం పడిందన్నాడు. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించినా పిచ్‌పై పెద్దగా పగుళ్లు ఉండబోవని ఆశిస్తున్నట్లు తెలిపాడు.ఈ నేపథ్యంలో.. పెర్త్ టెస్టులో సీమర్లకే వికెట్ అనుకూలంగా ఉంటుందని మెక్‌డొనాల్డ్ సంకేతాలు ఇచ్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా పెర్త్ స్టేడియం తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.పిచ్ క్యూరేటర్ కీలక వ్యాఖ్యలుఈ నేపథ్యంలో పిచ్ క్యూరేటర్ ఇసాక్ మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ఈసారి ఇది పెర్త్ సంప్రదాయక టెస్టు పిచ్‌లా ఉండకపోవచ్చు. వర్షం వల్ల కవర్లు కప్పి ఉంచిన పరిస్థితుల్లో పిచ్ తయారు చేయడం కుదరలేదు. అయితే, తర్వాత అంతా సర్దుకుంది.పరిస్థితి ఇంతకంటే దిగజారుతుందని అనుకోను. వికెట్ పచ్చిగానే ఉంటే బౌన్స్‌లోనూ వైవిధ్యం చూడవచ్చు. కానీ.. వాతావరణం మారి పగుళ్లు ఏర్పడితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇప్పటికి పేస్, బౌన్స్ బాగానే ఉంది’’ అని పేర్కొన్నాడు. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత ఏం చేయాలని ప్రశ్నించగా.. ‘‘నాకు చెల్లించే మొత్తం.. ఈ విషయంపై కామెంట్ చేసేందుకు సరిపోదు’’ అని కొంటెగా సమాధానమిచ్చాడు.జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలోకాగా శుక్రవారం నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ చేతివేలి గాయం కారణంగా పెర్త్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరుకుంటుంది. కాగా నవంబరు 22 నుంచి జనవరి ఏడు వరకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనతో బిజీగా గడుపనుంది. పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీ ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు వేదికలు.చదవండి: ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్ -
భారత్-బంగ్లా రెండో టెస్టు.. వాతావరణం ఎలా ఉందంటే?
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమించిన ఇరు జట్లు గెలుపుపై థీమాగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే.. మరోవైపు భారత గడ్డపై తొలి టెస్టు విజయం సాధించాలని బంగ్లా పట్టుదలతో ఉంది. కాగా దాదాపు మూడేళ్ల కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడనుంది. చివరగా 2021లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడింది. ఆ టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది. ఈ క్రమంలో కాన్పూర్ పిచ్, వాతావరణం ఎలా వుందో ఓ లుక్కేద్దాం.పిచ్, వాతావరణంచెన్నై పిచ్‌తో పోల్చుకుంటే కాన్పూర్ పిచ్ మందకొడిగా ఉండనుంది. నల్లమట్టితో రూపొందించిన పిచ్‌పై బంతి ఆగి వస్తుంది. స్పిన్నర్లు ఈ వికెట్‌పై చెలరేగే అవకాశముంది. ఇక ఉక్కపోత అధికంగా ఉండనుంది. మ్యాచ్‌కు తొలి రోజు, మూడో రోజు వర్షం ముప్పు పొంచి ఉండగా... వెలుతురు లేమి కారణంగా ఆటకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అయితే గురువారం రాత్రి కాన్పూర్‌లో ఓ మోస్తారు వర్షం కురిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మ్యాచ్ జరిగే వేదిక వద్ద వర్షం లేకపోయినప్పటకి... ఆట మధ్యలో అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. అయితే ఆఖరి రెండు రోజుల ఆటకు ఎటువంటి వర్షం ముప్పు లేదు.తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్/అక్షర్, బుమ్రా, సిరాజ్.బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్ ), షాద్మన్, జాకీర్, మోమినుల్, ముషి్ఫకర్, షకీబ్, లిటన్ దాస్, మెహిది హసన్, తైజుల్, హసన్ మహమూద్, తస్కీన్ అహ్మద్. -
ఆ రెండు పిచ్‌లు అసంతృప్తికరం..!
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య వెస్టిండీస్‌లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన టరోబా పిచ్ సంతృప్తికరంగా లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. మెగా టోర్నీ ముగిసిన రెండు నెలల తర్వాత పిచ్‌లపై ఐసీసీ మంగళవారం నివేదిక విడుదల చేసింది. టరోబా పిచ్‌తో పాటు.. అమెరికాలో నిర్వహించిన ప్రపంచకప్ తొలి రెండు మ్యాచ్‌లకు వేదికగా ఉన్న న్యూయార్క్ పిచ్‌లు కూడా బాగాలేవని ఐసీసీ వెల్లడించింది. తాత్కాలికంగా నిర్మించిన స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక 77 పరుగులకు ఆలౌట్ కాగా... భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 96 పరుగులకు పరిమితమైంది. అస్థిర బౌన్స్‌తో ఆ పిచ్‌లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టాయని అప్పుడే వ్యాఖ్యతలు పేర్కొనగా... తాజాగా ఆ రెండింటిని ఐసీసీ ‘అసంతృప్తికరం’ జాబితాలో చేర్చింది.ఐర్లాండ్, భారత్ మ్యాచ్‌లో అయితే అనూహ్య బౌన్స్ కారణంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయాల బారిన పడ్డారు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లకు కూడా గాయాలయ్యాయి. దీంతో టి20 ప్రపంచకప్ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన డ్రాప్–ఇన్ పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన పిచ్‌కు ఐసీసీ మంచి రేటింగ్ ఇచ్చింది. సాధారణంగా పిచ్‌ల ప్రమాణాలను బట్టి ఐసీసీ ‘చాలా బాగుంది’, ‘బాగుంది’, ‘సంతృప్తికరం’, ‘అసంతృప్తికరం’, ‘అన్‌ఫిట్’ రేటింగ్స్ ఇస్తుంది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టి20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వగా.. తుదిపోరులో దక్షిణాఫ్రికాపై నెగ్గి భారత్ చాంపియన్‌గా నిలిచింది. -
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్‌కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్లచే ప్రత్యేక కార్యక్రమం.. మ్యాచ్‌కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సీఎస్కే నూతన కెప్టెన్‌గా రుతురాజ్.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్‌కు బాధ్యతలు అప్పజెప్పాడు. వాతావరణం ఎలా ఉందంటే.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. పిచ్ ఎవరికి అనుకూలం.. చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్‌కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్‌పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఆర్సీబీపై సీఎస్కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత
క్రికెట్ ఫీల్డ్‌లోని ఒక్కొక్క రంగంలో నెమ్మదిగా మహిళా కేతనం ఎగురుతోంది. గతంలో మొదటి మహిళా క్రికెట్ అంపైర్ వృందా రతి, మొదటి ఐసీసీ మహిళా మ్యాచ్ రిఫరీగా జి.ఎస్.లక్ష్మి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దేశంలోనే మొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా జసింత కల్యాణ్ ఘనత సాధించింది. బెంగళూరులో జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్ క్యూరేటర్‌గా జసింత తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఆమె పరిచయం. క్రికెట్ అంటే సచిన్, ద్రవిడ్, గంగూలి అనేవారు ఒకప్పుడు. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన అంటున్నారు ఇప్పుడు. క్రికెట్ కామెంటేటర్స్ అంటే హర్ష భోగ్లే, సునీల్ గవాస్కర్ అనేవారు మొన్న. ఫిమేల్ క్రికెట్ యాంకర్స్‌గా మందిరా బేడీ, సంజనా గణేశన్ పేరు గడించారు ఇవాళ. మహిళా అంపైర్లు ఇదివరకే రంగంలోకి వచ్చారు. వారి వరుసలో చేరింది జసింత కల్యాణ్. ఈమె భారతదేశంలో తొలి మహిళా పిచ్ క్యూరేటర్. 1980ల నుంచి మనదేశంలో పిచ్ క్యూరేటర్లు 1980 వరకూ లేరు. స్టేడియంలో గడ్డి పెంచే మాలీలే పిచ్‌ను కూడా తయారు చేసేవారు, తెలిసినంతలో చూసుకునేవారు. కాని వాన పడితే పిచ్‌ను తడవడానికి వదిలేయడం, స్టంప్స్ వదిలేసి పోవడం జరిగేది. దానివల్ల మ్యాచ్ కొనసాగే సమయంలో పిచ్ అనూహ్యంగా మారేది. అలా కాకుండా స్టేడియంలోని మట్టిని బట్టి, రుతువులను బట్టి, ఆట సమయానికి పిచ్‌ను శాస్త్రీయంగా తయారు చేసేందుకు ‘పిచ్ క్యూరేటర్లు’ రంగం మీదకు వచ్చారు. వీరు పిచ్‌ను తీర్చిదిద్దుతారు. రకరకాల వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడి పిచ్‌ను ఎప్పుడూ ఆటకు వీలుగా ఉంచుతారు. అయితే ఈ నలభై ఏళ్ల నుంచి కూడా పురుషులే పిచ్ క్యూరేటర్లుగా ఉన్నారు. ఒక స్టేడియంలోని పిచ్‌లను స్త్రీలకు అప్పజెప్పడం ఎప్పుడూ లేదు. మొదటిసారి అలా బాధ్యత తీసుకున్న మహిళ జసింత కల్యాణ్. బెంగళూరులో జసింత బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న డబ్ల్యూపీఎల్ కోసం పిచ్‌ను తయారు చేసే బాధ్యతను అందుకున్నారు జసింత కల్యాణ్. బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరొబెలె అనే ఊరిలో జన్మించిన జసింత తండ్రి వరి రైతు. చిన్నప్పుడు ఆర్థిక కష్టాలు పడిన జసింత బెంగళూరు చేరుకుని ‘కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్’లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్‌గా ప్రమోట్ అయ్యింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆమె ఆఫీసు ఉన్నా మ్యాచ్‌లు చూసేది కాదు. సిక్సర్లు, ఫోర్లు వినిపిస్తే తప్ప. అయితే ఆమెకు స్టేడియంలోని పచ్చగడ్డి అంటే ఇష్టం. అది గమనించిన అసోసియేషన్ సెక్రటరీ బ్రిజేష్ 2014లో స్టేడియంలో పని చేసే మాలీలపై అజమాయిషీని అప్పజెప్పాడు. ఆ తర్వాత ఆ స్టేడియంకు చెందిన పిచ్ క్యూరేటర్ ప్రశాంత్ రావు ఆమెకు పిచ్‌లు తయారు చేయడంలో మెళకువలు నేర్పాడు. దాంతో ఆమె పూర్తిగా అనుభవం గడించింది. ఆ అనుభవం నేడు ఆమెను మన దేశ తొలి మహిళా పిచ్ క్యూరేటర్‌గా నిలిపింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్‌లను ఆమె అజమాయిషీ చేస్తోంది. క్యూరేటర్‌గా జసింత నియామకం గురించి తెలిశాక క్రికెట్ రంగం నుంచి, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుంటే బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతూ పోస్ట్ చేశారు. తన పనితీరుకు మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తారు. -
అలాంటి పిచ్‌లు అవసరమా అన్న గంగూలీ.. ద్రవిడ్ కౌంటర్!
Ind vs Eng- Dravid Comments On Pitch: ఇటీవల కాలంలో టెస్టు మ్యాచ్‌లు ఐదురోజుల పాటు పూర్తిగా జరిగిన సందర్భాలు అరుదు. ఒక్కోసారి ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్‌లు ముగిసిపోవడం వల్ల పిచ్‌ల తయారీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా- ఇంగ్లండ్ తాజా సిరీస్‌పై క్రికెట్ దిగ్గజాల దృష్టి పడింది. భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన గత సిరీస్‌లో పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సహా ఇతర మాజీ క్రికెటర్లు వ్యంగ్యస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుకు మాత్రమే ఉపయోగపడేలా వికెట్ రూపొందించారంటూ విమర్శించారు. ఈ క్రమంలో తాజా సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లు నాలుగు రోజుల పాటు సాగాయి. బుమ్రా అద్భుత ప్రదర్శన హైదరాబాద్ టెస్టులో విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆరంభిస్తే... విశాఖపట్నంలో టీమిండియా గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండు మ్యాచ్‌లు కూడా రసవత్తరంగానే సాగడం విశేషం. ముఖ్యంగా టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీసిన తీరు ముచ్చటగొలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. భారత్‌లో స్పిన్‌తో పాటు పేస్‌కూ అనుకూలించే పిచ్‌లు రూపొందించాలని విజ్ఞప్తి చేశాడు. కేవలం టర్న్ అయ్యే పిచ్‌లు మనకు అవసరమా అని ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. ఈ క్రమంలో.. తాజాగా ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం స్పందించాడు. When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality… — Sourav Ganguly (@SGanguly99) February 3, 2024 విశాఖ మ్యాచ్‌లో భారత్ గెలుపు నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తామెప్పుడూ పూర్తి స్పిన్ పిచ్ తయారు చేయాలని కోరలేదని స్పష్టం చేశాడు. పిచ్‌ల రూపకల్పన క్యూరేటర్ల పని అని.. అందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశాడు. టర్న్ అయ్యే పిచ్లే కావాలని మేము కోరలేదు ‘‘పిచ్‌లను క్యూరేటర్ తయారు చేస్తారు. పూర్తిగా టర్నింగ్ పిచ్‌లు మాత్రమే కావాలని మేము అడగము. ఇండియాలో సహజంగానే వికెట్లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. అయితే, అవి ఎంత వరకు టర్న్ అవుతాయి? ఎంత తక్కువ టర్న్ అవుతాయి? అన్న విషయాలు మనకు తెలియవు. నేనేమీ పిచ్ నిపుణుడిని కాదు. ఇండియాలో పిచ్‌లు నాలుగు- ఐదు రోజుల ఆట కోసమే రూపొందిస్తారు. మళ్లీ చెప్తున్నా ఇక్కడి పిచ్‌లు టర్న్ అవుతాయి. అంతేగానీ.. టర్న్ అవుతూనే ఉండవు. ఒక్కోసారి మూడో రోజు.. ఒక్కోసారి నాలుగో రోజు.. ఒక్కో సారి రెండోరోజే టర్న్ అవుతాయి. పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై ఎవరికీ పూర్తి అవగాహన ఉండదు. ఏ పిచ్‌పై అయినా మా ఆట తీరు ఎలా ఉంటుందనేదే ముఖ్యం. తదుపరి మేము రాజ్‌కోట్‌కు వెళ్తున్నాం. అక్కడి పిచ్ ఎలా ఉంటుందో మాకు ఐడియా లేదు. ఎలాంటి వికెట్‌పై అయినా మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే మాకు ప్రథమ ప్రాధాన్యం’’ అని రాహుల్ ద్రవిడ్ కుండబద్దలు కొట్టాడు. గంగూలీకి కౌంటర్‌గానేనా? ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజన్లు.. గంగూలీ లాంటి వాళ్లకు ద్రవిడ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలోనే తన సహచర ఆటగాడు ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించాం.. కోచ్‌పై రితిక ఫైర్ -
కేవలం ఇలాంటి పిచ్‌లు మనకు అవసరమా: గంగూలీ
India vs England, 2nd Test: భారత్‌లో పిచ్‌లు కేవలం స్పిన్‌కు మాత్రమే కాకుండా.. పేస్‌కు కూడా అనుకూలించేలా తయారు చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తదితరుల బౌలింగ్ చూసినపుడల్లా తనకు ఇలాంటి ఆలోచన వస్తుందని పేర్కొన్నాడు. పిచ్‌లు బాగుంటే ఆట మరింత రసకందాయకంగా ఉంటుందని.. ఐదు రోజులపాటు సాగే టెస్టును కూడా గెలిచే సత్తా టీమిండియా సొంతమని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా ఉపఖండంలో పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, విదేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే పిచ్‌లు ఉంటాయక్కడ. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా టెస్టు మ్యాచ్‌లు రెండు.. మూడు రోజుల్లోనే.. ఒక్కోసారి ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిపోతున్న తరుణంలో.. పిచ్‌ల రూపకల్పనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టర్నింగ్ ట్రాకులు మాత్రమే ఎందుకు? ఈ విషయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘బుమ్రా, షమీ, సిరాజ్, ముకేశ్ బౌలింగ్ చేయడం చూసినపుడు.. ఇండియాలో ఇంకా టర్నింగ్ ట్రాక్‌ల తయారీకే మనం ఎందుకు పరిమితం కావాలి అనిపిస్తుంది. మంచి వికెట్ తయారు చేస్తే ప్రతి ఆట మరింత రసవత్తరంగా ఉంటుంది కదా! అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్(స్పిన్నర్లు)లతో కలిసి మన పేసర్లు కూడా ఇక్కడి పిచ్‌లపై 20 వికెట్లు తీయగలరు. నిజానికి సొంతగడ్డపై.. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ల మీద గత ఆరేడేళ్లుగా మన బ్యాటింగ్‌లో నాణ్యత లోపించడం చూస్తూనే ఉన్నాం. నాణ్యమైన వికెట్లు తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఐదు రోజుల మ్యాచ్‌ను గెలవగల సత్తా ఇంకా టీమిండియాకు ఉంది’’ అని గంగూలీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇంగ్లండ్‌పై ఆరేసిన బుమ్రా కాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో రోహిత్ సేన ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా శుక్రవారం రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో గంగూలీ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకోవడం గమనార్హం. చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality… — Sourav Ganguly (@SGanguly99) February 3, 2024 -
కేప్‌టౌన్ పిచ్‌పై ‘అసంతృప్తి’
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరిగిన కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదు సెషన్లలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో వాడిన పిచ్ సంతృప్తికరంగా లేదని అభిప్రాయ పడింది. ఈ టెస్టుకు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ తన నివేదికను ఐసీసీకి అందించారు. దీని ప్రకారం న్యూలాండ్స్ పిచ్‌కు ఒక డీ మెరిట్ రేటింగ్ ఇచ్చారు. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతుండగా పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్‌లో ఉన్న విరాట్ కోహ్లిని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ నిర్వహణలో భద్రతా వైఫల్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. #ICCCricketWorldCup | Security breach during the India versus Australia ICC World Cup 2023 Final match, in Ahmedabad after a spectator entered the field (Pics: ANI Photos) pic.twitter.com/AfilmF75sB — ANI (@ANI) November 19, 2023 మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి పాలస్తీనాను ప్రతిబింబించే వేషధారణను కలిగి ఉన్నాడు. ఎర్రని షార్ట్ ధరించాడు. తెల్లని టీ షర్ట్ ముందు భాగంలో పాలస్తీనాపై బాంబు దాడులు నిలిపివేయండి అని పేర్కొని ఉంది. టీషర్ట్ వెనుక భాగంలో ఫ్రీ పాలస్తీనా అని రాసి ఉంది. పాలస్తీనా జెండాను ప్రతిబింబించేలా మాస్క్‌ను ధరించాడు. మ్యాచ్ జరుగుతుండగా.. ఎక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్ వరకు చేరుకుని విరాట్ కోహ్లిని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో రంగంలోకి దిగిన సిబ్బంది అతన్ని పట్టుకుని వెనక్కి తీసుకెళ్లారు. క్రికెట్ వరల్డ్‌కప్‌లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయింది. 37 ఓవర్లకు 182 పరుగులు సాధించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సాయం -
ఆస్ట్రేలియా-భారత్ తొలి వన్డే.. రోహిత్ మూడో డబుల్ సెంచరీ ఇక్కడే! బ్యాటర్లకు పండగే
ఆసియాకప్-2023 విజయం తర్వాత టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. స్వదేశంలో వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మొహాలీ వేదికగా శుక్రవారం జరగనుంది. ఇక ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. మొహాలీలో ఆస్ట్రేలియాపై భారత్ ఒక్క వన్డే మ్యాచ్‌లో కూడా గెలవలేదు. ఇప్పుడు ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. అన్నింటిలోను ఓటమి పాలైంది. ఈ క్రమంలో నేడు జరగబోయే తొలి వన్డేల్లో ఎలాగైనా విజయం సాధించాలని రాహుల్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక తొలి వన్డే జరగబోయే మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్ రిపోర్ట్‌ను ఓ సారి పరిశీలిద్దాం. పిచ్ రిపోర్టు.. మొహాలీలోని పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. వికెట్‌ను కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే విధంగా తాయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేదికపై ఆడిన చివరి ఐదు మ్యాచ్‌లలో .. నాలుగు సార్లు మొదట బౌలింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. కేవలం ఒక్కసారి మాత్రమే తొలుత బ్యాటింగ్ చేసిన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు భారత్ పేరిటే ఉంది. 2017 శ్రీలంకతో జరిగిన వన్డేలో టీమిండియా ఏకంగా 392 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లోనే టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ(208) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇక ఇక్కడ నాలుగేళ్లుగా వన్డే జరగలేదు. కానీ ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రం జరిగాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ బ్యాటర్లే పైచేయి సాధించారు. ఇక ఈ మ్యాచ్‌కు ఎటువంటి వర్షసూచన లేదు. చదవండి: IND vs AUS: వన్డేల్లో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా! -
'ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ సరైన వ్యక్తి’
ఢిల్లీ: 2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. రేపు ముంబయి వేదికగా 27 పార్టీలు భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. 'ఇండియా' కూటమి తరుపున అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ సరైన వ్యక్తి అంటూ ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక ఖక్కర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ దేశానికి ప్రయోజనం చేకూర్చే మోడల్‌ను తీసుకురాగలరని అన్నారు. తమ అభ్యర్థిగా కేజ్రీవాల్‌ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆప్ ఢిల్లీ కన్వినర్ గోపాల్ రాయ్ కూడా ఈ అంశంపై స్పందించారు. కూటమిలో తాము కూడా భాగం అయినందున తమ అభ్యర్థిని ప్రధానిని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి పార్టీ తమ అభ్యర్థే పీఎం కావాలని ఆశించడంలో న్యాయం ఉంటుందని అన్నారు. ఇండియా కూటమి భేటీ.. ఆగష్టు 31న ఇండియా కూటమిలోని దాదాపు 27 పార్టీలు ముంబయిలో భేటీ కానున్నాయి. ఈ సమావేశంలోనే అశోక చక్రంలేని ఇండియా జెండాను కూటమి జెండాగా ప్రకటించాలనే ప్రతిపాదన ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే కూటమిలో పార్టీల మధ్య విభేదాలను పక్కకు పెట్టే విధంగా విధివిధానాల రూపకల్పన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రోజులు చర్చలు జరగనున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే దిశగా కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఒక్కటయ్యారు. ఇప్పటికే పాట్నాలో మొదటిసారి సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇటీవల బెంగళూరు వేదికగా రెండోసారి సమావేశం ముగిసింది. ప్రస్తుతం ముంబయిలో ప్రధాన చర్చలు జరగనున్నాయి. ఇదీ చదవండి: అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు.. -
ప్రభుత్వాధికారులతో మూడీస్ భేటీ.. భారత్ రేటింగ్ అప్‌గ్రేడ్‌పై ఆశలు!
న్యూఢిల్లీ: త్వరలో భారత సార్వభౌమ రేటింగ్‌ను సమీక్షించనున్న నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలాంశాలను ప్రభుత్వ అధికారులు వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతుండటం, విదేశీ మారక నిల్వలు 600 బిలియన్ డాలర్లకు చేరుతుండటం, సంస్కరణల అమలు తీరుతెన్నులు తదితర అంశాల గురించి తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక గురించి మూడీస్ ప్రతినిధులు చర్చించారు. మొత్తం మీద మూడీస్ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారని, రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందని సమావేశం అనంతరం ఒక అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన శాఖలన్నింటి నుంచి, అలాగే నీతి ఆయోగ్ నుంచి అధికారులు ఇందులో పాల్గొన్నారు. మూడీస్ ప్రస్తుతం భారత్‌కు.. పెట్టుబడులకు అత్యంత కనిష్ట స్థాయి అయిన బీఏఏ3 సార్వభౌమ రేటింగ్ కొనసాగిస్తోంది. దీన్ని అప్‌గ్రేడ్ చేస్తే ఇన్వెస్టర్లకు భారత్‌లో రిస్కులు తక్కువగా ఉంటాయన్న సంకేతం వెడుతుంది. తద్వారా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను సమకూర్చుకునే అవకాశం లభిస్తుంది. -
పిచ్‌తో మైండ్‌గేమ్.. కలవరపడుతున్న 'కంగారూలు'
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మ్యాచ్ జరిగిన తీరు కంటే పిచ్‌లపైనే ఎక్కువగా ఆసక్తి ఏర్పడింది. తొలి రెండు మ్యాచ్‌లను టీమిండియా రెండున్నర రోజుల్లో ముగిస్తే.. మూడో టెస్టులో అది రివర్స్ అయింది. ఇండోర్ టెస్టును కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా అదే రెండున్నర రోజుల్లో మ్యాచ్‌ను ముగించింది. అయితే ఇండోర్ పిచ్‌కు పూర్ రేటింగ్ ఇచ్చిన ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. దీంతో నాలుగో టెస్టు జరగనున్న అహ్మదాబాద్ పిచ్‌పై ఆసక్తి ఏర్పడింది. నరేంద్రమోదీ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందా లేక బ్యాటింగ్, బౌలింగ్‌కు సమాంతరంగా ఉంటుందా అనేది వేచి చూడాలి. తొలి మూడు టెస్టులకు సంబంధించి పిచ్ ఫోటోలు ఎలా వైరల్ అయ్యాయో తాజాగా అహ్మదాబాద్ పిచ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈసారి పిచ్ ఫోటోలు చూసినవారికి కాస్త కన్ఫూజన్ ఏర్పడింది. సోషల్ మీడియాలో విడుదలైన ఫోటోల్లో రెండు పిచ్‌లు కనిపించాయి. ఆ రెండు పిచ్‌లపై కవర్స్ కప్పి ఉంచారు. దీంతో మ్యాచ్‌లో ఏ పిచ్ ఉపయోగిస్తారనేది క్లారిటీ లేదు. ఈ విషయం గమనించిన ఆస్ట్రేలియా మీడియా అహ్మదాబాద్ పిచ్‌లపై కన్ఫూజన్‌కు గురైంది. ''మ్యాచ్‌ను గెలవడానికి టీమిండియా ఏమైనా చేస్తుందని.. మ్యాచ్ ప్రారంభమయ్యే ఆఖరి నిమిషం వరకు ఏ పిచ్‌పై ఆడాలనేది రివీల్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వారి ప్రణాళికలు మా గేమ్‌ప్లాన్‌ను దెబ్బతీసేలా ఉన్నాయి.'' అంటూ కథనం ప్రచురించింది. ఇది తెలుసుకున్న టీమిండియా అభిమానులు.. ''పాపం ఆసీస్ మీడియాలో కలవరం మొదలైనట్లుంది.. కచ్చితంగా నాలుగో టెస్టులో టీమిండియాదే విజయం'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మార్చి 9 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా ఆఖరి టెస్టు మొదలుకానంది. ఈ మ్యాచ్ గెలవడం ఆస్ట్రేలియా కంటే టీమిండియాకు ఎంతో ముఖ్యం. డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే భారత్ ఈ మ్యాచ్ తప్పకుండా గెలిచి తీరాల్సిందే. ఒకవేళ టీమిండియా ఓడినా లేక మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అది జరగకుండా ఉండాలంటే టీమిండియా నాలుగో టెస్టును నెగ్గితే సరిపోతుంది. Seems like a call over which pitch will be used for the fourth Test has not yet been made. They are covering two strips at the moment #INDvAUS pic.twitter.com/DgX6YF9JXA — Louis Cameron (@LouisDBCameron) March 7, 2023 చదవండి: IPL 2023: లక్నో కొత్త జెర్సీ.. మరీ ఇంత చెత్తగా ఉందేంటి? దీని కంటే.. -
'ఇండోర్‌కే మూడిస్తే.. మరి గబ్బాకు ఎన్నివ్వాలి?'
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టుకు వేదికైన ఇండోర్ పిచ్ నాసిరకంగా ఉందని పేర్కొన్న ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు విధించిన విషయం తెలిసిందే. రెండురోజుల్లోనే 30 వికెట్లు కూలడం.. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోవడం విమర్శలకు దారి తీసింది. అయితే ఐసీసీ డీమెరిట్ పాయింట్లు విధించడంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఇండోర్ పిచ్‌కు ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడం నాకు నచ్చలేదు. అయితే ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. గతేడాది నవంబర్‌లో బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ రెండురోజుల్లోనే ముగిసింది. మరి ఈ పిచ్‌కు ఐసీసీ ఎన్ని డీమెరిట్ పాయింట్లు కేటాయించింది.? అప్పుడు మ్యాచ్ రిఫరీ ఎవరు?'' అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. గతేడాది నవంబర్‌లో గబ్బాలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్ విజయం సాధించింది.ఆ తర్వాతి టెస్టుల్లోనూ గెలుపొందిన ఆసీస్ సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బౌలర్లకు ఎక్కువగా సహకరించిన గబ్బా పిచ్‌కు ఐసీసీ అప్పట్లో ఒక్క డీమెరిట్ పాయింట్‌తో తక్కువ యావరేజ్‌తో రేటింగ్ ఇచ్చింది. ఇదే విషయాన్ని లేవనెత్తిన గావస్కర్ ఐసీసీ వైఖరిని తప్పుబట్టాడు. ఇక మూడో టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 2012 నవంబర్ తర్వాత సొంత గడ్డపై భారత్‌కు ఇది టెస్టుల్లో తొలి ఓటమి కావడం విశేషం. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రీలియా తొలి సెషన్లోనే విజయం సాధించింది. మార్నస్ లబుషేన్ (28), ఓపెనర్ ట్రెవిస్ హెడ్ (49) ధనాధన్ ఆడి మ్యాచ్ ముగించారు. 11 వికెట్లు తీసిన నాథన్ లియాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో, నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ బోణీ కొట్టింది. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో మార్చి 9న నాలుగో టెస్టు జరగనుంది. చదవండి: 'ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం' -
BGT 2023: పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం
India vs Australia, 3rd Test: ‘‘భారత పిచ్‌లపై ఇరవై వికెట్లు తీయడమంటే అంత సులువేమీ కాదు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి స్టార్ పేసర్లు లేకుండా అస్సలు సాధ్యపడదు. అనుభవం తక్కువైనప్పటికీ మహ్మద్ సిరాజ్ ప్రభావం చూపగలడు. కానీ అనుకున్న ఫలితాలు రాబట్టాలంటే ఇప్పుడున్న బౌలింగ్ విభాగంతో సాధ్యం కాదు. ఈ సిరీస్‌కు సంబంధించి మన బౌలింగ్ విభాగం మరీ అంత పటిష్టంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే, పిచ్ సహకారం ఉంటే టీమిండియా 20 వికెట్లు తొందరగానే పడగొట్టగలదు. ఇలాంటి పిచ్‌లు తయారు చేయడం వెనుక అసలు కారణం ఇదేనేమో!’’ అని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. ఒకవేళ బుమ్రా జట్టుతో ఉంటే గనుక కాస్త మెరుగైన పిచ్ తయారు చేసేవాళ్లని అభిప్రాయపడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో బుమ్రా వంటి స్టార్ల గైర్హాజరీలో ఇలాంటి పిచ్‌లు తయారు చేయడం కంటే టీమిండియాకు మరో అప్షన్ లేదని పేర్కొన్నాడు. ‘‘ఒకవేళ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంటే.. పిచ్ వేరేలా ఉండేదేమో! నిజానికి సొంతగడ్డపై స్పిన్నర్లే టీమిండియాకు బలం. అందుకే వాళ్లు ఇలా చేసి ఉంటారు. ఫ్లాట్ పిచ్‌లపై బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించడం ఖాయం. కానీ ఈ పిచ్‌లు బ్యాటర్ల సహనానికి పరీక్షగా నిలిచాయి’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు. ఏదేమైనా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో నాగ్‌పూర్, ఢిల్లీ పిచ్‌ల కంటే ఇండోర్ పిచ్ పరమచెత్తగా ఉందని గావస్కర్ కుండబద్దలుకొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అత్యంత నాసికరంగా పిచ్ ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీమిండియా తొలి రెండు టెస్టుల్లో గెలవగా... మూడో మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇండోర్‌లో తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్ కావడంతో బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు కష్టాలు తప్పలేదు. ఆసీస్ స్పిన్నర్లు విజృంభించగా.. భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యూహాలు పక్కాగా అమలు చేసి.. గెలుపునందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇండోర్ పిచ్ అత్యంత నాసికరంగా ఉందని ఐసీసీ రేటింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు -
'ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం'
ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆది నుంచి స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై 30 వికెట్లు కేవలం రెండురోజుల్లోనే కూలాయి. ఇందులో 26 వికెట్లు ఇరుజట్ల స్పిన్నర్లు తీయగా.. మిగతా నాలుగు వికెట్లు మాత్రమే పేసర్ల ఖాతాలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇండోర్ పిచ్‌పై సీరియస్ అయింది. ఆస్ట్రేలియా, టీమిండియా మూడో టెస్టుకు ఉపయోగించిన ఇండోర్ పిచ్‌ను అత్యంత చెత్తదని ఐసీసీ పేర్కొంది. పిచ్‌ను మరి నాసిరకంగా తయారు చేశారని.. అందుకే హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. టెస్టుకు ఉపయోగించిన పిచ్‌పై ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రక్రియ తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ''పిచ్ చాలా డ్రైగా ఉంది. కనీసం బ్యాట్, బంతికి బ్యాలెన్స్ లేకుండా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ప్రారంభమయినప్పటికి క్రమంగా బౌన్స్ వస్తుందన్నారు. కానీ ఆ ప్రక్రియ మ్యాచ్‌లో ఎక్కడా జరగలేదు. ఎంతసేపు పిచ్ స్పిన్నర్లకు అనుకూలించిందే తప్ప సీమర్లకు కాస్త కూడా మేలు చేయలేదు. బంతి కనీసం బౌన్స్ కూడా కాలేదు. క్యురేటర్ పిచ్‌ను మరీ నాసిరకంగా తయారు చేశారు'' అంటూ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ ఇండోర్ పిచ్‌కు మూడు డీ-మెరిట్ పాయింట్లు కోత విధించింది. నివేదికను బీసీసీఐకి ఫార్వర్డ్ చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల లోపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసుకోవచ్చు. '' ఐదు అంతకంటే ఎక్కువ డీ-మెరిట్ పాయింట్లు వస్తే స్టేడియంపై నిషేధం పడుతుంది. కానీ నివేదిక ప్రకారం హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధించాం. మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేధం పడే అవకాశం ఉందని'' ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: టీమిండియాకు సంకట స్థితి.. నాలుగో టెస్టు గెలిస్తేనే తప్పులే ఎక్కువగా.. ఎదురుదెబ్బ తగలాల్సిందే! -
IND VS AUS 3rd Test: ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణమా..?
Matthew Hayden: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, ఊహకందని విధంగా మెలికలు తిరుగుతూ, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న హోల్కర్ మైదానం పిచ్‌పై ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ జరుగుతుండగానే లైవ్‌లో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణంగా టర్న్ అవుతుందని ధ్వజమెత్తాడు. ఈ పిచ్ జనరేట్ చేస్తున్న టర్న్ చూస్తే భయమేస్తుందని అన్న హేడెన్.. స్పిన్నింగ్ కండీషన్స్‌ను తూర్పారబెట్టాడు. టెస్ట్ క్రికెట్లో తొలి రోజు ఆరో ఓవర్లోనే స్పిన్ బౌలర్ తన ప్రతాపం చూపితే.. మ్యాచ్ ఎన్ని గంటల పాటు సాగుతుందని ప్రశ్నించాడు. ఇలాంటి పిచ్‌లకు తన మద్దతు ఎప్పుడూ ఉండదని అసహనం వ్యక్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్‌లకు పిచ్‌లను తొలి రెండు రోజులు బ్యాటర్లకు అనుకూలించేలా తయారు చేయాలని సూచించాడు. తొలి రోజు భారత బ్యాటింగ్ సందర్భంగా కామెంటరీ బాక్స్‌లో ఉన్న హేడెన్ ఈ వ్యాఖ్యలు చేయగా.. పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి రెండే రెండు ముక్కల్లో "హోమ్ కండీషన్స్" అంటూ హేడెన్ కామెంట్స్‌ను బదులిచ్చాడు. కొద్ది సేపు ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయని శాస్త్రి.. ఆతర్వాత మైక్ పట్టుకుని, ఇది హోమ్ కండీషన్స్ కంటే చాలా అధికంగా ఉందని, మున్ముందు మ్యాచ్ మరింత టఫ్‌గా మారుతుందని జోస్యం చెప్పాడు. అయితే ఒక్క మంచి భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, 4 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్‌ల్లో టీమిండియా రెండింటిలోనూ విజయాలు సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఎలాగైనా గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉండిన రోహిత్ సేనకు తొలి రోజు పిచ్ వ్యవహరించిన తీరు మింగుడుపడని విషయంగా మారింది. -
Ind Vs NZ: ఇదేం పిచ్.. షాక్‌కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు: హార్దిక్
India vs New Zealand, 2nd T20I- Hardik Pandya: ‘‘మేము మ్యాచ్ గెలుస్తామని నమ్మకం ఉంది. అయితే, ముగింపు కాస్త ఆలస్యమైందంతే! పొట్టి క్రికెట్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ప్రతి విషయానికి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఒత్తిడిని అధిగమిస్తూ పరిస్థితికి తగ్గట్లు స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈరోజు మ్యాచ్‌లో మేము అదే చేశాం’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఏమాత్రం తేడా వచ్చినా న్యూజిలాండ్‌తో లక్నోలో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే, 99 పరుగులకే కివీస్‌ను కట్టడి చేసినప్పటికీ గెలుపు కోసం భారత్ ఆఖరి బంతి వరకు పోరాడక తప్పలేదు. PC: BCCI పటిష్ట టీమిండియా బ్యాటింగ్ లైనప్‌నకు 100 పరుగులు సులువైన లక్ష్యంలాగే అనిపించినా... కివీస్ అసాధారణ పోరాటం అభిమానులను భయపెట్టింది. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్(26), సారథి హార్దిక్ పాండ్యా(15)తో కలిసి ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి గెలిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. PC: BCCI టీ20 కోసం తయారు చేసింది కాదు ఈ నేపథ్యంలో లక్నో పిచ్‌పై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘నిజం చెప్పాలంటే ఈ వికెట్ మమ్మల్ని విస్మయానికి గురిచేసింది. ఇక్కడ ఇప్పటి వరకు మేము రెండు మ్యాచ్‌లు ఆడాము. వికెట్ మరీ అంత ఇబ్బందిపెట్టేదిగా అనిపించలేదు. కానీ.. ఈ పిచ్ అయితే టీ20లకు సరిపోయేది కాదు. పొట్టి క్రికెట్ కోసం తయారుచేసింది కాదు. కనీసం 120 పరుగుల స్కోరు కూడా నమోదు కాలేదు. మ్యాచ్‌కు ముందే క్యూరేటర్లు సరైన పిచ్‌లను రూపొందించేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది’’ అంటూ పాండ్యా విమర్శనాస్త్రాలు సంధించాడు. ఏదేమైనా మ్యాచ్ ఫలితం పట్ల సంతోషంగా ఉన్నానని.. పిచ్ మాత్రం షాక్‌కు గురిచేసిందని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే... టీమిండియా- న్యూజిలాండ్ మధ్య సిరీస్ విజేతను తేల్చే మూడో టీ20 ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరుగనుంది. చదవండి: T20 WC: 2005 వరల్డ్‌కప్ టైమ్‌లో పుట్టినోళ్లు! ఒక్కొక్కరిది ఒక్కో కథ.. కుల్దీప్ కోచ్ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి.. ENG vs SA 2nd ODI: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సొంతం .@surya_14kumar hits the winning runs as #TeamIndia secure a 6-wicket win in Lucknow & level the #INDvNZ T20I series 1️⃣-1️⃣ Scorecard ▶️ https://t.co/p7C0QbPSJs#INDvNZ | @mastercardindia pic.twitter.com/onXTBVc2Wu — BCCI (@BCCI) January 29, 2023 -
బయో ఇంధన కూటమికి డిమాండ్ చేస్తాం: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సోలార్ కూటమి విజయం సాధించిన మాదిరే.. అంతర్జాతీయంగా బయో ఇంధన కూటమి కోసం ప్రయత్నిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇందుకు జీ20 నాయకత్వాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. కేపీఎంజీ ఎన్రిచ్ 2022 సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు. బయో ఇంధనాలను వినియోగిస్తున్న బ్రెజిల్ నుంచి అమెరికా తదితర దేశాలతో కూడిన కూటమి.. బయో ఇంధనాలకు సంబంధించి ప్రమాణాలను రూపొందించడం, ఇంజన్లు, టెక్నాలజీ సహకారం దిశగా కృషి చేస్తుందన్నారు. భారత్ ఇప్పటికే పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ లక్ష్యాన్ని 2030కు బదులు 2024–25 నాటికే సాధించాలని నిర్ణయించినట్టు తెలిపారు. జీ20లో భాగంగా ఉన్న అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా, చైనా తదిత దేశాలు బయో ఇంధనాలను తయారు చేస్తుండడం గమనార్హం. (అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..!) -
Ind Vs Aus: ఉప్పల్‌లో నాడు కోహ్లి అద్భుత ఇన్నింగ్స్! 50 బంతుల్లోనే ఏకంగా..
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్‌కు హైదారాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. 2005 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేడియంలో మొత్తం 12 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఆరు వన్డేలు, ఐదు టెస్టులు, ఒక టీ20 మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ వేదికపై ఆదివారం(సెప్టెంబరు 25) మరో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు, పిచ్ స్వభావం, లైవ్ స్ట్రీమింగ్ తదితర విషయాలు తెలుసుకుందాం! మొదటి మ్యాచ్ ఎవరితో అంటే! ►2005లో నవంబర్ 16న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఈ వేదికపై జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. ►2010 నవంబర్ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ►2017లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌కు షెడ్యూల్ ఖారారైనా ఆ మ్యాచ్ రద్దైంది. ►ఈ క్రమంలో 2019 డిసెంబర్ 6న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఏకైక టీ–20 మ్యాచ్ జరిగింది. ►ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. ►ఇక ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 55 వేలు ఎవరిది పైచేయి..? ఉప్పల్ వేదికగా జరిగిన 5 టెస్టు మ్యాచ్‌లలో టీమిండియా నాలుగింటిలో గెలిచింది. మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. అదే విధంగా.. ఆరు వన్డేల్లో భారత్ మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది. ఏకైక టీ20లో... నాడు చెలరేగిన కోహ్లి! ఏకంగా.. వెస్టిండీస్‌తో జరిగిన టీ–20 మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు సాధించింది. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ఇక కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), నాటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్ స్టేడియంలో టీ20 ఫార్మాట్(ఇంటర్నేషనల్)లో నమోదైన స్కోర్లు: ►అత్యధిక స్కోరు: 209/4- భారత్ ►అత్యల్ప స్కోరు: 207/5- వెస్టిండీస్ ►అత్యధిక పరుగులు సాధించింది(అత్యధిక వ్యక్తిగత స్కోరు): 94- నాటౌట్- విరాట్ కోహ్లి ►అత్యధిక సిక్సర్లు: కోహ్లి- 6 ►అత్యధిక వికెట్లు: యజువేంద్ర చహల్(భారత్), ఖరీ పియర్(వెస్టిండీస్)- చెరో రెండు వికెట్లు ►బౌలింగ్ అత్యుత్తమ గణాంకాలు: యుజువేంద్ర చహల్(4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు) ►అత్యధిక భాగస్వామ్యం: కోహ్లి- కేఎల్ రాహుల్(100 పరుగులు) పిచ్ స్వభావం పాతబడే కొద్ది నెమ్మదిస్తుంది. స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. గతంలో ఇక్కడ టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపిన సందర్భాలు ఉన్నాయి. మ్యాచ్ సమయం, లైవ్ స్ట్రీమింగ్ ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్- ఆసీస్ మ్యాచ్ ఆరంభం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం. మ్యాజిక్ రిపీట్ చేయాలి! ఇక ఉప్పల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయాలని కింగ్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో ఆసీస్ విజయం సాధించగా.. నాగ్‌పూర్‌లో రోహిత్ సేన గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. హైదరాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. చదవండి: హైదరాబాద్‌లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్; స్టేడియానికి ఇలా వెళితే బెటర్! Ind Vs Aus 2nd T20: పాక్ రికార్డును సమం చేసిన రోహిత్ సేన! ఇక విరాట్ వికెట్ విషయంలో.. -
మైదానంలోనే ప్రేయసికి ప్రపోజ్ చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు
న్యూయార్క్: అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు హసాని డాట్సన్ స్టిఫెన్‌సన్ తన ప్రేయసికి గ్రౌండ్‌లోనే లవ్ ప్రపోజ్ చేశాడు. మేజర్ లీగ్ సాకర్ టోర్నీలో భాగంగా ఆదివారం మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్ జోస్ ఎర్త్‌క్వేక్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. మ్యాచ్ డ్రాగా ముగియగానే స్టీఫెన్సన్ తన గర్ల్‌ఫ్రెండ్ పెట్రా వుకోవిక్ దగ్గరికి వెళ్లి మొకాలిపై కూర్చొని ‘విల్ యు మ్యారీ మీ’ అంటూ ఉంగరంతో ప్రపోజ్ చేశారు. బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన సర్ప్రైజ్తో షాక్‌కు గురైన అతని లవర్ వెంటనే అతని ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. అనంతరం ఉంగరాన్ని ప్రేయసి చేతికి తొడగి, ఈ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుండిపోయేలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో మైదానంలోని ప్రేక్షకులు గట్టిగా కేకలు వేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా స్టీఫెన్సన్ ప్రపోజ్ చేసిన ఫోటోలను తన ప్రేయసి పెట్రా వుకోవిక్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నీలాంటి వ్యక్తి ప్రేమ దొరినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. నా జీవితంలో ఈ అందమైన క్షణాలను మధుర జ్ఙాపకంగా ఉంచడంలో సహయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ పేర్కొంది. View this post on Instagram A post shared by Petra Vučković (@croatianchick31) View this post on Instagram A post shared by Hassani Dotson Stephenson (@hassanidotson) -
ఈ పిచ్‌లోనూ అంతే.. టెస్ట్ మ్యాచ్ ఇక..
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్టులోనూ స్పిన్‌కు బాగా అనుకూలించే పిచ్‌నే టీమిండియా కోరుకుంటోంది. గత రెండు టెస్టుల తరహాలోనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు ఇది సరైన వ్యూహమని భావిస్తోంది. భారత జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చాయి. నాలుగో టెస్టులో కూడా స్పిన్ పిచ్ ఎదురవుతుందని, అంతా సన్నద్ధంగా ఉండాలని రహానే పిలుపునిచ్చాడు. ‘నాకు తెలిసి రెండో, మూడో టెస్టుల్లో ఎలాంటి పిచ్‌పై ఆడామో ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి పిచ్ సిద్ధమవుతోంది. కచ్చితంగా అది స్పిన్‌కు అనుకూలిస్తుంది. గత మ్యాచ్‌లో గులాబీ బంతి కొంత భిన్నంగా స్పందించింది కాబట్టి బ్యాటింగ్‌లో కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. స్పిన్ పిచ్‌లపై నేరుగా లైన్లోనే ఆడాల్సి ఉంటుంది. బంతి బాగా స్పిన్ అయితే మాత్రం సమస్యే లేదు. ఒక్కో బ్యాట్స్‌మన్ శైలి ఒక్కోలా ఉంటుంది. ఫ్రంట్ ఫుట్ లేదా బ్యాక్ ఫుట్ ఎలా ఆడినా కాళ్ల కదలికలు చాలా ముఖ్యం. టర్న్ ఎక్కువగా ఉంటే మీ డిఫెన్స్‌ను నమ్ముకోవాలి. స్పిన్నింగ్ పిచ్‌పై ఆడటం సవాలే కావచ్చు కానీ దానినీ అధిగమించవచ్చు’ అని రహానే విశ్లేషించాడు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా ఇంగ్లండ్ జట్టును తాము తక్కువగా అంచనా వేయడం లేదని అతను స్పష్టం చేశాడు. మరోవైపు స్పిన్ పిచ్‌లపై ఇంగ్లండ్ మీడియా నుంచి వస్తున్న విమర్శలకు కూడా రహానే సమాధానమిచ్చాడు. ‘ఏమైనా మాట్లాడుకునే హక్కు జనాలకు ఉంది. మేం విదేశాల్లో ఆడినప్పుడు సీమింగ్ పిచ్‌ల గురించి ఎవరూ మాట్లాడరు. ఒక్కోసారి పచ్చికతో పిచ్ అనూహ్యంగా స్పందించినప్పుడు కూడా మేం ఫిర్యాదు చేయలేదు. అసలు దాని గురించి ఎప్పుడూ మాట్లాడనే లేదు’ అని రహానే వ్యాఖ్యానించాడు. -
వాళ్లు ఆలోచించరు.. మాకు అవసరమా: రోహిత్
అహ్మదాబాద్: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పిచ్‌లను టీమిండియా తమకు అనూకూలంగా మార్చుకుందంటూ వస్తున్న విమర్శలను టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఖండించాడు. రోహిత్ వీడియోనూ బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ' పిచ్ అనేది ఇరు జట్లకు సమానంగానే ఉంటుంది. ఇప్పుడు కాదు కొన్ని సంవత్సాలు నుంచే టీమిండియాలో అన్ని పిచ్‌లను ఒకేరకంగా తయారు చేస్తున్నారు. భారత్‌లో ఇంతకముందు జరిగిన టెస్టు సిరీస్‌లు కూడా ఇవే పిచ్‌లపై జరిగాయి. అప్పుడు రాని చర్చలు ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి.. దీనిపై ఇంత డిబేట్ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. పిచ్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అయినా ఏ జట్టైనా తమ సొంత గ్రౌండ్లు తమకే అనుకూలంగా ఉండాలని భావిస్తాయి. ఇదే పరిస్థితి మాకు బయట ఎదురవుతుంది. మేం ఇటీవలే ఆసీస్ పర్యటనకు వెళ్లి వచ్చాం. మరి ఆసీస్ జట్టు వారి సొంతగడ్డపై ఉన్న మైదానాలకు అనుకూలంగా తయారుచేసుకోలేదా.. మేం వారితో పోరాడి సిరీస్ గెలవలేదా? మేం బయటికి వెళ్లి ఆడినప్పుడు వారు మా గురించి పట్టించుకోరు.. ఇప్పుడు అంతే.. వేరే జట్టు మన దేశానికి వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకుంటాం. హోం అడ్వాంటేజ్ అనే పదం వినిపించకూడదంటే ఇకపై అవన్నీ తీసేసి ఆడితే బాగుంటుంది. దీనిపై ఐసీసీతో చర్చించండి.. ఆ రూల్ వచ్చేలా చేయండి. ఇంతటితో దీనికి విరామిస్తే బాగుంటుంది. అయినా పిచ్‌పై అనవసర చర్చను పక్కనపెట్టి మ్యాచ్‌లు, ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది.' అని చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో పాటు బౌలింగ్‌లోనూ 9వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలిపించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. కాగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీన జరగనుంది. చదవండి: అశ్విన్ అవసరం తీరిపోయింది.. కమ్‌బ్యాక్ కష్టమే 🗣️🗣️ Every team has the right to home advantage, reckons @ImRo45. @Paytm #INDvENG #TeamIndia pic.twitter.com/ZbF7ufj01M — BCCI (@BCCI) February 21, 2021 -
'టీమిండియా హోం అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంది'
అహ్మదాబాద్: మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా హోం అడ్వాంటేజ్‌ను చక్కగా ఉపయోగించుకుందని పేర్కొన్నాడు. మూడోటెస్టు కోసం సన్నద్దమవుతున్న బ్రాడ్ డెయిలీ మొయిల్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. 'రెండో టెస్టులో మా జట్టు ఓటమికి నేను పిచ్‌ను తప్పుబట్టలేను. నా దృష్టిలో టీమిండియా హోం అడ్వాంటేజ్‌ను చక్కగా ఉపయోగించుకుంది. రెండో టెస్టులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి మా మీద ఒత్తిడి పెంచేసింది. నైపుణ్య విషయంలో వారు మమల్ని అధిగమించారు. పిచ్ పరిస్థితిని అర్థం చేసుకొని టీమిండియా ఆడితే.. మేం మాత్రం అంచనా వేయలేక చతికిలపడ్డాం. అంతేకానీ పిచ్‌పై ఎలాంటి విమర్శలు లేవు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై అశ్విన్‌తో పాటు మా బౌలర్లు చెలరేగారు. 2018లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులోనూ తాము ఇలాగే హోమ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకునఆనం. స్వింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై టీమిండియా రెండు ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంతో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించాం. మేమే కాదు.. ఆసీస్, దక్షిణాఫ్రికా ఇలా ఏ జట్టు తీసుకున్నా వారి సొంతగడ్డపై ఇలాగే చేస్తారు. ఒకవేళ అహ్మదాబాద్ టెస్టుకు తుది జట్టులో ఉంటే మాత్రం పింక్‌బాల్ టెస్టులో స్వింగ్ రాబట్టే అవకాశం ఉంది. అయితే రెండో టెస్టులో లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే బౌలింగ్ శైలి వేయడం వెనుక ఒక కారణం ఉంది. మేం మ్యాచ్‌లో నిలవడానికి లెగ్ కట్టర్స్ అవసరమవ్వొచ్చన్న ఆలోచనతోనే కుంబ్లే బౌలింగ్‌ను అనుకరించాను తప్ప వేరే ఉద్దేశం లేదు.'అని చెప్పుకొచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి డే నైట్ తరహాలో జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ను గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. కాగా రొటేషన్ పాలసీ ప్రకారం మూడో టెస్టుకు తుది జట్టులో బ్రాడ్ చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఇంగ్లండ్ తరపున బ్రాడ్ 165 టెస్టుల్లో 517 వికెట్లు, 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టీ20ల్లో 65 వికెట్లు తీశాడు. చదవండి: విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్ సూర్య -
మొటెరా పిచ్ ఎవరికి లాభం చేకూర్చనుంది!
అహ్మదాబాద్: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మొటెరా స్టేడియం వేదికగా డే-నైట్ టెస్టు మ్యాచ్(పింక్ బాల్ టెస్టు) జరగనున్న సంగతి తెలిసిందే. ఆధునాతన సౌకర్యాలతో లక్షా 10వేల సీటింగ్ కెపాసిటీతో నూతనంగా నిర్మించిన మొటెరా స్టేడియం ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ మైదానంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 నుంచి డే నైట్ టెస్టుకు అన్ని హంగులతో సిద్ధమవుతుంది. ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారినవేళ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అర్హతకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొటెరా పిచ్ ఎలా ఉండబోతుందనే విషయంపై తెగ చర్చ నడుస్తుంది. మొదటి రెండు టెస్టులు జరిగిన చెన్నై పిచ్‌కు, అహ్మదాబాద్ పిచ్‌కు చాలా తేడా ఉండనుంది. అందులోనూ మూడో టెస్టు డై నైట్ తరహాలో జరగనుండడంతో పిచ్ రిపోర్ట్‌పై మరింత ప్రాముఖ్యత సంతరించుకొంది. సాధారణంగా టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడే పిచ్‌లు స్పిన్నర్లకు అనువుగా ఉండేలా క్యూరేటర్లు తయారు చేస్తుంటారు. అయితే కొన్నేళ్లుగా వీటిలో మార్పు కనిపిస్తూ వచ్చింది. స్పిన్నర్లతో పాటు పేసర్లకు కూడా స్వర్గధామంగా నిలుస్తూ వచ్చాయి. తాజాగా మొతేరాలో పిచ్ నల్లమట్టి, ఎర్రమట్టి కాంబినేషన్‌తో కూడి ఉంది. ప్రధాన గ్రౌండ్లో 11పిచ్‌లు ఉన్న నేపథ్యంలో ఈసారి పిచ్‌ను స్పిన్నర్లుకు అనూకూలంగా ఉండేలా ఎర్రమట్టితో రూపొందించనున్నట్లు సమాచారం. మొదటి మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా, చివరి రెండు రోజులు మాత్రం బౌలర్లకు అనుకూలించేలా పిచ్‌ను తీర్చిదిద్దారు. అయితే గతంలో జరిగిన పింక్ బాల్ టెస్టులు చూసుకుంటే స్పిన్నర్ల కంటే సీమర్లు రాణించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. 2019 నవంబర్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్ టెస్టులోనూ ఇదే నిరూపితమైంది.ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్ కలిపి అన్ని వికెట్లు టీమిండియా పేసర్లే తీయడం విశేషం. ముఖ్యంగా ఇషాంత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా ఇప్పుడు ఎక్కువగా స్పిన్నర్లను నమ్ముకోవడంతో తుది జట్టులో ఇద్దరు పేసర్లకు మాత్రమే అవకాశం ఉంది. అయితే క్యురేటర్లు మాత్రం పిచ్‌ను స్పిన్‌కు అనుకూలించే విధంగా రూపొందించినట్లు తెలిపారు. దీంతో పాటు మ్యాచ్ డే నైట్ కావడం.. రాత్రిళ్లు మంచుతో బౌలర్‌కు గ్రిప్పింగ్ చేజారడం జరుగుతుంటుంది. బంతి రంగు కూడా పిచ్‌పై కీలకపాత్ర పోషించనుంది. అందుకే పిచ్‌పై పచ్చిక ఎక్కువ లేకుండా చూసుకుంటూ కాస్త కఠినతరంగా రూపొందించనున్నారు. ఇక 2012లో మొటెరా మైదానంలో చివరి మ్యాచ్ జరిగింది. కాగా ఇటీవలే ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు కూడా ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: మూడో టెస్ట్‌తో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం -
చెన్నై పిచ్ అత్యంత దారుణమైంది: జోఫ్రా ఆర్చర్
చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లో చూసిన అత్యంత దారుణమైన పిచ్‌ల్లో చెన్నైపిచ్ ముందు వరుసలో నిలుస్తుందని వ్యాఖ్యానించాడు. ఆఖరి రోజు పిచ్ మరింత మందకొడిగా మారిపోయి నిర్జీవంగా ఉండిదన్నాడు. చివరి రోజు ఆటలో లంచ్‌కు ముందు డ్రింక్స్ బ్రేక్‌లోపే తమ జట్టు విజయం సాధిస్తుందని ఆశించానని, పిచ్ నిర్జీవంగా మారడంతో మ్యాచ్ ఫలితం మరింత ఆలస్యమైందని పేర్కొన్నాడు. ఐదో రోజు పిచ్ స్వరూపం ఎలా మారినా తమ బౌలర్ జిమ్మి ఆండర్సన్ మాత్రం అద్భుతమైన రివర్స్ స్వింగ్‌ను రాబట్టి మ్యాచ్‌ను త్వరగా ముగించాడంటూ అండర్సన్‌పై ప్రశంశల వర్షం కురిపించాడు. అండర్సన్ తన చివరి స్పెల్‌ను 5–3–6–3తో ముగించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 227 పరుగుల తేడాతో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలై నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 0-1 తేడాతో వెనకపడింది. కాగా, ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌కు కూడా చెన్నై మైదానమే వేదిక కానుంది. అయితే ఇంగ్లండ్ జట్టు ఫాలో అవుతన్న రొటేషన్ పద్దతి కారణంగా ఈ మ్యాచ్‌లో ఆండర్సన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. -
రూ.500 కోట్లు దాటిన ‘పెప్స్’ వ్యాపారం
సాక్షి బెంగళూరు: వ్యాపారంలో ఎంతమందికి చేరువయ్యామన్నదే ప్రధానమని పెప్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కె.మాధవన్ చెప్పారు. సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... శరీరానికి నిద్ర ప్రధానం కాబట్టి ఎలాంటి పరుపు కొనాలనే దానిపై ప్రస్తుతం ఎందరినో సంప్రదించాల్సి వస్తోందని చెప్పారు. గత 14 ఏళ్లలో దేశ వ్యాప్తంగా లక్షల మంది పెప్స్ పరుపులు కొన్నారని తెలియజేశారు. రూ.4 కోట్లతో వ్యాపారం ప్రారంభించగా.. 14 ఏళ్లలో రూ.500 కోట్లకు చేరామని చెప్పారాయన. ‘‘కొత్త పరుపు కొనడంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పరుపు ఎత్తు కీలకం. నేలమట్టం నుంచి 24 అంగుళాల ఎత్తులో ఉండటం శ్రేయస్కరం’’ అని వివరించారు. పరుపులు పాతబడిన వెంటనే మార్చుకోవాలని.. పదేళ్లకు మించి వినియోగించరాదని సూచించారు. భారతదేశంలో కోల్‌కతా, కోయంబత్తూరు, ఢిల్లీ, పుణేలో ఉత్పత్తి కేంద్రాలున్నాయని తెలియజేశారు. గ్రామ స్థాయి వరకు చేరవేయడమే లక్ష్యం పెప్స్ పరుపులను పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు చేరవేయడమే లక్ష్యమని పెప్స్ ఇండస్ట్రీస్ జేఎండీ జి.శంకర్‌రామ్ చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పెప్స్ శాఖలు ప్రాచుర్యం పొందాయని, ఏపీలో కోస్తా ప్రాంతంలో వ్యాపారం బాగుందని చెప్పారు. రాయలసీమలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం విదేశీ మెటీరియల్‌పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నా.. పెప్స్ పరుపులకు మాత్రం ఆదరణ తగ్గలేదని చెప్పారాయన. -
తక్కువ వడ్డీ దారిలో ఆర్బీఐ: ఫిచ్
న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో తక్కువ వడ్డీరేటు వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించిన తొలి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ పేర్కొంది. దేశీయంగా తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణ ధోరణులు, అమెరికా సెంట్రల్‌బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంచే అవకాశాలు కనబడని తీరు, దీనితో అంతర్జాతీయంగా సరళతరంగా ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితులు... ఆర్బీఐ రేటు తగ్గింపునకు దోహదపడుతున్న అంశాలుగా ఫిచ్ వివరించింది. ఆర్బీఐ ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 4వ తేదీన రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. అంతకుముందు రెండు నెలల క్రితం జరిగిన ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. గత ఏడాది ఆర్బీఐ రెండు సార్లు అరశాతం రేటు పెంచింది. తాజా నిర్ణయంతో పెరిగిన మేర రివర్స్ అయినట్లయ్యింది. ఈ నేపథ్యంలో ఫిచ్ తన తాజా ఆసియా పసిఫిక్ సావరిన్ క్రెడిట్ ఓవర్వ్యూ రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులోని ముఖ్యాంశాలు... ► మరింత రేటు తగ్గింపునకు అవకాశాలను ఆర్బీఐ అన్వేషించే అవకాశం ఉంది. అయితే 2019లో రేటు తగ్గింపు ఇంతకుమించి ఉండకపోవచ్చు. ► వస్తున్న ఆదాయాలు తగ్గడం– వ్యయాలు పెరగడం వంటి అంశాలు భారత్ ద్రవ్యలోటు పరిస్థితులకు సవాళ్లు విసిరే అవకాశం ఉంది. కొన్ని నగదు ప్రత్యక్ష బదలాయింపులు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు. ► 2025 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రభుత్వ రుణాన్ని 60 శాతానికి పరిమితం చేయాలన్నది భారత్ ప్రణాళిక. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, భారత్ ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. ► కేంద్ర రుణ భారం తీవ్రంగా ఉంది. ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి. వ్యవస్థాగత అంశాల్లో లోపాలు ఉన్నాయి. అయితే సమీప కాలంలో దేశం పటిష్ట వృద్ధి బాటన కొనసాగే అవకాశం ఉంది. విదేశీ మరకపు నిల్వలు (400 బిలియన్ డాలర్ల ఎగువన) పటిష్టంగా ఉన్నాయి. విదేశీ సవాళ్లను తట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనితో సవాళ్లు–ఆశావహ పరిస్థితులు మధ్య సమతౌల్యత కనిపిస్తోంది. దీనితో ఫిచ్ రేటింగ్స్ (‘బీబీబీ–’ దిగువస్థాయి పెట్టుబడుల గ్రేడ్) యథాతథంగా కొనసాగుతుంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండవచ్చు. 2020–21లో 7.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
పచ్చిక పిలుస్తోంది!
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు వేదిక అయిన అడిలైడ్ ఓవల్ మైదానంలో గత మూడు సీజన్లలో మూడు డే అండ్ నైట్ టెస్టులు జరిగాయి. ఏ మ్యాచ్ కూడా పూర్తిగా ఐదు రోజుల పాటు సాగలేదు. ఆ మ్యాచ్‌లలో గులాబీ బంతి మన్నిక కోసం పిచ్‌పై కాస్త ఎక్కువ పచ్చికను ఉంచారు. ఫలితంగా ఆరంభంలో పిచ్ పేస్‌కు బాగా అనుకూలించింది. ఈసారి డే అండ్ నైట్ టెస్టు కాకపోయినా... తాము అదే తరహాలో పిచ్‌ను సిద్ధం చేస్తున్నామని క్యురేటర్ డామియెన్ హాఫ్ చెప్పాడు. ‘మేం డే టెస్టు కోసం భిన్నంగా ఏమీ చేయడం లేదు. అదే తరహాలో పిచ్‌ను రూపొందిస్తాం. పిచ్‌పై కొంత పచ్చిక ఉంటేనే అటు బ్యాట్‌కు, బంతికి మధ్య సమంగా పోరు సాగుతుందనేది మా నమ్మకం. ప్రస్తుతానికి మాత్రం మేం అదే పనిలో ఉన్నాం’ అని అతను అన్నాడు. టెస్టు సాగినకొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినా... మొదటి రోజు మాత్రం పేసర్లకు బాగా అనుకూలించే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన పేస్ బౌలర్లు ఉన్న నేపథ్యంలో సిరీస్‌కు ఆసక్తికర ఆరంభం లభించవచ్చు. అరవడం కంటే కరవడం ముఖ్యం! బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత మైదానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల వ్యవహారశైలి మారిపోయిందని, వారంతా బుద్ధిగా వ్యవహరిస్తారని తరచూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే మాటల్లో తీవ్రత లేకపోయినా... తమ దూకుడు మాత్రం తగ్గదని ఆసీస్ బ్యాట్స్‌మన్ ట్రవిస్ హెడ్ అన్నాడు. తమ బౌలర్లు ఆ పని చేయగలరని అతను అభిప్రాయపడ్డాడు. ‘అవసరం లేకపోయినా మాట్లాడే మాటలకు విలువే ఉండదు. మా బౌలర్లు స్టార్క్ 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి, కమిన్స్, హాజల్‌వుడ్ బౌన్స్‌తో చెలరేగి మైదానంలో దూకుడును ప్రదర్శిస్తారు. బ్యాటింగ్‌లో, ఫీల్డింగ్‌లో కూడా ఇలాగే చేస్తాం. టీవీల్లో ఇది కనిపించకపోవచ్చు. నా దృష్టిలో అరిచే కుక్కకంటే కరిచే కుక్క ఎక్కువ ప్రభావం చూపిస్తుంది’ అని హెడ్ అన్నాడు. కెరీర్లో 2 టెస్టులే ఆడిన హెడ్‌కు అడిలైడ్ సొంత మైదానం. ఆసీస్ కూర్పు ప్రకారం చూస్తే అతడికి తుది జట్టులో చోటు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న హ్యారీ నీల్సన్ నుంచి తాను కొన్ని సూచనలు తీసుకుంటానని అతను చెప్పాడు. కోహ్లిని ఇబ్బంది పెట్టగలం: పైన్ భారత కెప్టెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం తమ పేసర్లను ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. తమ బౌలర్లు భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం కూడా లేదని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘మా బౌలర్లు తమ స్థాయిలో సత్తా చాటితే విరాట్ కోహ్లిని అడ్డుకోగలరు. అయితే మరీ ఎక్కువగా భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తే మా ఆట దెబ్బ తింటుంది. మేం బాగా బౌలింగ్ చేస్తుంటే కోహ్లితో మాటల యుద్ధం అనే ప్రశ్నే తలెత్తదు. ఒక్కో ఆటగాడు తమకు అలవాటైన రీతిలో ఆడితే చాలు. అవసరమైతే కోహ్లితో ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరించాల్సి వచ్చినా తప్పు లేదు. అయితే హద్దులు దాటకుండా ఉంటే చాలు’ అంటూ పైన్ తమ జట్టు ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. -
స్కాం అనంతరం పీఎన్బీకి మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రభుత్వ రంగ రెండో అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు మరో షాక్ ఎదురైంది. రూ.11,400 కోట్ల కుంభకోణ నేపథ్యంలో పీఎన్బీ రేటింగ్‌ను నెగిటివ్‌లోకి మారుస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్, రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తున్నట్టు మరో ఏజెన్సీ మూడీస్ ప్రకటించాయి. బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం పీఎన్బీలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల డైమాండ్ కింగ్ నీరవ్‌మోదీ ఈ మోసానికి పాల్పడ్డారు. అంతర్గతంగా, బహిర్గతంగా బ్యాంకు రిస్క్ కంట్రోల్స్‌పై ఈ మోసం పలు అనుమానాలకు తావిస్తుందని, గత కొన్నేళ్లుగా ఈ కుంభకోణం జరుగుతున్నప్పటికీ, ఎవరూ గుర్తించకపోవడం నిర్వహణ పర్యవేక్షణ నాణ్యతా లోపాన్ని ఎత్తిచూపుతుందని ఫిచ్ తెలిపింది. పీఎన్బీకి ప్రతికూల పరిశీలనలో 'బీబీ' వైబిలిటీ రేటింగ్‌ను ఇస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. వైబిలిటీ రేటింగ్ ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్ క్రెడిట్ విలువను అంచనావేస్తుందని, ఇది సంస్థ విఫలమైనట్టు సూచిస్తుందని ఫిచ్ తెలిపింది. రేటింగ్ డౌన్‌గ్రేడ్‌లో ఉంచుతున్నట్టు తెలిపిన మూడీస్ కూడా... మోసపూరిత లావాదేవీలు చూపుతున్న ఆర్థిక ప్రభావం, బ్యాంకు క్యాపిటలైజేషన్ ప్రొఫైల్ మెరుగుపరచడానికి మేనేజ్మెంట్ తీసుకుంటున్న చర్యలు, బ్యాంకుపై రెగ్యులేటరీ తీసుకునే చర్యలు వంటి వాటిపై ఫోకస్ చేసినట్టు పేర్కొంది. ఈ మోసపూరిత లావాదేవీల ఫలితంగా బ్యాంకు లాభాలు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లాయని ఏజెన్సీ తెలిపింది. అయితే అసలైన ప్రభావం సమయం, అవసరాలకు అనుగుణంగా వుంటుందని ఏజెన్సీ చెప్పింది. బ్యాంకు బేస్‌లైన్ క్రెడిట్ అసెస్మెంట్(బీసీఏ), అడ్జస్టెడ్ బీసీఏ బీఏ3గా, కౌంటర్పార్టీ రిస్క్ అసెస్మెంట్ రేటింగ్ బీఏఏ3(సీఆర్)/పీ-3(సీఆర్)ను డౌన్‌గ్రేడ్ రివ్యూలో ఉంచుతున్నట్టు మూడీస్ తెలిపింది. -
స్ట్రెయిట్ డ్రైవ్... కవర్ డ్రైవ్... కార్ డ్రైవ్...
న్యూఢిల్లీ: క్రికెట్ మైదానంలో కుక్కలు పరుగెత్తి రావడం వల్లనో, తేనెటీగలు, ఇతర కీటకాల దాడి వల్లనో మ్యాచ్‌లు ఆగిపోవడం ఎన్నో సార్లు చూశాం! కానీ శుక్రవారం మాత్రం గతంలో ఎన్నడూ జరగని ఘటన ఇక్కడి పాలమ్ ఎయిర్‌ఫోర్స్ క్రికెట్ గ్రౌండ్లో చోటు చేసుకుంది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆగంతకుడు మారుతి వేగన్ఆర్ కారుతో మైదానంలోకి దూసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా నేరుగా పిచ్పైకే వెళ్లిపోయాడు. భద్రతా సిబ్బంది వచ్చి ఆపేలోపే రెండు సార్లు పిచ్‌పైనే అడ్డదిడ్డంగా కారును నడిపించాడు. మ్యాచ్ మూడో రోజు ఆట మరో 20 నిమిషాల్లో ముగుస్తుందనగా జరిగిన ఈ ఘటనతో ఇరు జట్ల సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్, రిషభ్ పంత్ తదితరులు ఆడుతున్నారు. ఎయిర్‌ఫోర్స్ గ్రౌండ్లోకి వచ్చే ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేని సమయంలో ఆ వ్యక్తి లోపలికి వచ్చినట్లు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే మెయిన్ గేటు మూసివేసిన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు. మతిస్థిమితం లేకనే... తాజా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా విచారణకు ఆదేశించారు. ‘అదృష్టవశాత్తూ ఏమీ జరగలేదు. లోపలికి వచ్చిన వ్యక్తి ఉద్దేశాలు వేరుగా ఉంటే అంతర్జాతీయ క్రికెటర్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేవి. మైదానానికి బాధ్యత వహించాల్సిన సర్వీసెస్ బోర్డుతో దీనిపై మాట్లాడతాం’ అని ఖన్నా చెప్పారు. మరోవైపు పోలీసులు తమ విచారణలో 30 ఏళ్ల గిరీశ్ అనే ఆ వ్యక్తిని మానసిక రోగిగా తేల్చారు. ‘ఆ సమయంలో అతడిని చూస్తుంటేనే అదో రకంగా అనిపించింది. లుంగీ వేసుకొని అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేశాడు. బయటికి తీసుకొచ్చి చావబాదుతున్నా కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయలేదు. అతని మానసిక స్థితి సరిగా లేదని అప్పుడే అర్థమయ్యింది’ అని మ్యాచ్‌కు ప్రత్యక్ష సాక్షి అయిన ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. -
కావాలంటే పిచ్ మార్చగలను!
పుణే: భారత క్రికెట్లో ‘ఫిక్సింగ్’ వివాదం ఇప్పుడు ఆటగాళ్లను దాటి పిచ్ క్యురేటర్ల దాకా చేరింది! స్థాయికి తగినట్లుగా బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండా మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసిన ఉదంతాలు గతంలో ఉండగా... మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే విధంగా ‘పిచ్’లో మార్పులు చేసి కూడా ఫిక్సింగ్ చేయవచ్చని కొత్తగా తేలింది! పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం పిచ్ క్యురేటర్ పాండురంగ సాల్గావ్కర్ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాడు. జాతీయ వార్తా ఛానల్ ‘ఇండియా టుడే టీవీ’ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఇది బయటపడింది. చానల్ కథనం ప్రకారం... భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డేకు ముందు రోజు తమను తాము బుకీలుగా పరిచయం చేసుకొని రిపోర్టర్లు సాల్గావ్కర్తో ముచ్చటించారు. పుణే పిచ్‌పైనే నిలబడి క్యురేటర్ వారి ప్రశ్నలకు సందేహాస్పద రీతిలో సమాధానాలిచ్చారు. ‘మీరు కోరిన విధంగా పిచ్‌లో మార్పులు చేసేందుకు నేను సిద్ధం’ అని 68 ఏళ్ల సాల్గావ్కర్ చెబుతున్నట్లుగా అందులో రికార్డయింది. ‘ఇక్కడ ఉన్న ఎనిమిదో నంబర్ పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. కనీసం 337 పరుగులు చేయవచ్చు. ఆపై దానిని ఛేదించవచ్చు కూడా’ అని సాల్గావ్కర్ వీడియోలో చెప్పాడు. మరో వీడియో క్లిప్‌లో వేరే క్యురేటర్లు చూస్తున్నారు, జాగ్రత్త అని రిపోర్టర్లను హెచ్చరించినట్లుగా ఉంది. ఇతర క్లిప్‌లలో ఒక చోట పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలిస్తుందని, మరో చోట ‘ఫలానా’ ఆటగాడికి మరింత బాగా సరిపోతుంది కాబట్టి అతనిపై బెట్టింగ్ చేయవచ్చని క్యురేటర్ అభయం ఇస్తున్నట్లుగా ఉంది. బీసీసీఐ చర్యలు... ఐసీసీ విచారణ న్యూస్ ఛానల్లో ‘పిచ్ ఫిక్సింగ్’ వార్తలు రాగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెంటనే చర్యలు తీసుకుంది. ముందు పాండురంగ సాల్గావ్‌కర్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లుగానే ప్రకటించిన బోర్డు, ఆ తర్వాత కొద్ది సేపటికే పూర్తిగా అతడిని డిస్మిస్ చేసింది. బోర్డు పిచెస్ కమిటీ సభ్యుడైన రమేశ్ మామున్కర్కు ప్రత్యేకంగా పిచ్ బాధ్యతలు అప్పజెప్పడంతో హడావిడిగా మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేశారు. దీనికి ఐసీసీ ఆమోదముద్ర కూడా వేయడంతో మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. బీసీసీఐ ఇప్పటికే చర్యలు తీసుకున్నా...తాజా ఘటనకు సంబంధించి ఐసీసీ, ఎంసీఏ కూడా తమ వైపు నుంచి ప్రత్యేక విచారణ జరపాలని నిర్ణయించాయి. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌పై ఆసీస్ ఘన విజయం సాధించిన తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు కూడా పుణే పిచ్ నాసిరకంగా ఉందంటూ ఐసీసీ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. టాంపరింగ్ సాధ్యమా! టీవీ ఛానల్ కథనం ప్రకారం చూస్తే పిచ్‌ను తమకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చని అనిపిస్తున్నా... ఈ విషయంలో నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఇది ఏ మాత్రం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. ‘వాతావరణ పరిస్థితులు కలిసొస్తేనే క్యురేటర్ ఎంతో కొంత ప్రభావం చూపించగలరు. లేదంటే నెల రోజుల్లో కూడా కావాల్సినట్లుగా తయారు చేయడం ఎవరి వల్లా కాదు. సాల్గావ్కర్ ఊరికే అబద్ధాలు చెబుతున్నాడు’ అని ఒక బీసీసీఐ క్యురేటర్ కుండబద్దలు కొట్టాడు. ‘ఒక్క రోజులో బుకీలకు అనుకూలంగా అతను పిచ్‌ను ఎలా మారుస్తాడో నాకైతే అర్థం కావడం లేదు. అతను ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పాడో తెలీదు’ అని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా అభిప్రాయపడ్డారు. అయితే క్యురేటర్లకు సాధారణంగా తక్కువ జీతభత్యాలు ఉంటాయి కాబట్టి వారు బుకీల వలలో పడే అవకాశం ఉంటుందని కూడా మాజీ క్యురేటర్ వెంకట్ సుందరమ్ చెప్పారు. బీసీసీఐ క్యురేటర్లకు ప్రస్తుతం వారి అనుభవాన్ని బట్టి రూ. 35 వేల నుంచి రూ. 70 వేల వరకు జీతాలు ఉన్నాయి. మరోవైపు ఛానల్ తమ కథనంలో రిపోర్టర్లు బుకీలుగా పరిచయమయ్యారని చెప్పుకున్నా... వీడియోలో ఆ విషయం మాత్రం ఎక్కడా లేదు. భారత్‌కు ఆడకపోయినా... పాండురంగ సాల్గావ్కర్ 70వ దశకంలో భారత్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. శ్రీలంకతో ఒకసారి అనధికారిక టెస్టు సిరీస్‌లో పాల్గొన్నా... ఎప్పుడూ భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. సత్తా ఉన్న పేస్ బౌలర్ అయి ఉండీ దురదృష్టవశాత్తూ భారత్‌కు ఆడలేకపోయాడంటూ సునీల్ గావస్కర్ తన ఆటోబయోగ్రఫీలో కూడా సాల్గావ్కర్ గురించి ప్రత్యేకంగా రాశారు. 63 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో సాల్గావ్కర్ కేవలం 26.70 సగటుతో 214 వికెట్లు పడగొట్టడం విశేషం. పాండురంగ ప్రస్తుతం క్యురేటర్ హోదాలో ఎంసీఏ నుంచి రూ. 65 వేల జీతంతో పాటు బీసీసీఐ నుంచి పెన్షన్ కూడా పొందుతున్నారు. -
పిచ్ తప్పేమీ లేదు: మురళీ విజయ్
బెంగళూరు: తొలి టెస్టులో తమ జట్టు ఘోర పరాజయంలో పిచ్ పాత్ర ఏమీ లేదని భారత క్రికెటర్ మురళీ విజయ్ అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్ నాసిరకంగా ఉందంటూ ఐసీసీ ఇచ్చిన నివేదికతో అతను విభేదించాడు. ‘పుణే వికెట్ నాసిరకంగా ఏమీ లేదు. తొలి బంతి నుంచే అది బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసిరింది. క్రికెటర్లుగా మేం ఎప్పుడూ బ్యాటింగ్ పిచ్‌లపైనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పిచ్‌లపై కూడా ఆడాల్సి ఉంటుంది. మా సమర్థతను, సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షించే ఇలాంటి వికెట్లపై ఆడటం కూడా మంచిది. బెంగళూరులో ఎలాంటి పిచ్ ఎదురవుతుందో చూడాలి’ అని విజయ్ వ్యాఖ్యానించాడు. -
పిచ్, అవుట్‌ఫీల్డ్ ఓకే
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి ఇక్కడ జరగనున్న ఐదో టెస్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందీ లేదని తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ప్రకటించింది. ‘వర్దా’ తుపాను కారణంగా సోమవారం నగరం మొత్తం తీవ్రంగా దెబ్బతింది. అయితే చిదంబరం స్టేడియంలోని అవుట్‌ఫీల్డ్, పిచ్ మాత్రం పాడు కాలేదని టీఎన్‌సీఏ కార్యదర్శి కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ‘మైదానంలో సైట్ స్క్రీన్లు, బల్బ్‌లు, ఎయిర్‌కండిషనర్లు దాదాపు పూర్తిగా చెడిపోయాయి. కానీ వికెట్, గ్రౌండ్‌ను మాత్రం జాగ్రత్తగా సంరక్షించుకున్నాం’ అని ఆయన చెప్పారు. రెండు రోజుల్లోగా ఇతర సమస్యలు కూడా అధిగమించి, అన్ని ఏర్పాట్లతో మ్యాచ్ నిర్వహించగలమని విశ్వనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
హమ్మయ్య... గట్టెక్కాం
పిచ్‌పై విమర్శలు రాకుండా అరంగేట్ర టెస్టు నిర్వహణ చిన్న చిన్న లోపాలు ఉన్నా మ్యాచ్ విజయవంతం విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి తొలిసారి టెస్టు మ్యాచ్ నిర్వహిస్తున్నామనే సంబరం ఓ వైపు ఉన్నా... ఆంధ్ర క్రికెట్లో అందరిలోనూ పిచ్‌పై ఓ మూల చిన్న సందేహం, ఒక రకమైన భయం కూడా ఉన్నారుు. గత నెలలో న్యూజిలాండ్‌తో వన్డేలో పిచ్ స్పిన్ తిరిగిన విధానం చూసి... టెస్టు మ్యాచ్‌లోనూ అలా జరిగితే పరిస్థితి ఏంటనే ప్రశ్న మ్యాచ్ ఆరంభానికి ముందు తలెత్తింది. అరుుతే కోహ్లి కోరుకున్నట్లు స్పిన్‌కు అనుకూలంగా ఉండేలానే వికెట్‌ను రూపొందించారు. నిజానికి బంతి విపరీతంగా స్పిన్ అరుు్య మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసి ఉంటే ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)పై విమర్శలు వచ్చేవి. ఒకవేళ ఏదైనా తేడా జరిగి ఐసీసీ నుంచి హెచ్చరిక వచ్చి ఉంటే మరింత ప్రమాదం జరిగేది. అరంగేట్ర టెస్టులోనే ఇలాంటి వికెట్ చేస్తే ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు మూడు రోజుల్లో ముగిస్తే ఐసీసీ అధ్యక్షుడి సొంత సంఘం విదర్భ క్రికెట్ అసోసియేషన్‌కే ఐసీసీ నుంచి హెచ్చరిక వచ్చింది. మ్యాచ్ ఐదు రోజులు సాగడం... అనూహ్యంగా స్పిన్ కాకపోవడంతో ఏసీఏ ఊపిరి పీల్చుకుంది. గతంలో వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో అన్నింటికంటే బౌన్స పెద్ద సమస్యగా ఉండేది. ఇక్కడి మట్టి తీరు అదే కాబట్టి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఈసారి పిచ్‌పై నాలుగో రోజు కూడా మంచి బౌన్స వచ్చింది. ఈ విషయంలో స్థానిక క్యూరేటర్ నాగమల్లేశ్వరరావును అభినందించాల్సిందే. బీసీసీఐకి చెందిన వేరే ఏ క్యూరేటర్ మద్దతు లేకుండా ఆయన తన సొంత సిబ్బందితోనే ఈ పిచ్‌ను రూపొందించారు. అనుభవలేమి కనిపించినా... గతంలో విశాఖ స్టేడియంలో అనేక వన్డే, టి20, ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగారుు. టెస్టు మ్యాచ్ నిర్వహణ ఇక్కడి అధికారులకు కొత్త. అది ఆచరణలో కనిపించింది. టెస్టు హోదా ఉన్న స్టేడియంలో సౌకర్యాలు పూర్తి స్థారుులో లేకపోరుునా... మేనేజ్ చేయగలిగారు. మళ్లీ టెస్టు రావడానికి మరో ఏడాదో, రెండేళ్లో పడుతుంది. అరంగేట్ర టెస్టు మ్యాచ్ కాబట్టి అభిమానులు భారీగా వస్తే బాగుంటుందని ఏసీఏ ఆశపడింది. నోట్ల రద్దు ప్రభావం కావచ్చు, ఆసక్తి లేక కావచ్చు టిక్కెట్ల అమ్మకం పెద్దగా జరగలేదు. దీంతో స్కూల్ పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని ఉచితంగా అనుమతించారు. రోజుకు పదివేల మందికి ఉచితంగా భోజనం, నీరు అందించామని ఏసీఏ తెలిపింది. అరుుతే ఫ్రీ ఎంట్రీ విషయంలో స్పష్టత లేక స్టేడియంకు వచ్చిన వారు చాలా ఇబ్బందిపడ్డారు. కాలేజీ పిల్లలు గంటలు గంటలు గేట్ దగ్గర నిరీక్షించి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు. కాస్త ముందుగా ఓ ప్రణాళిక ప్రకారం ప్రవేశం గురించి చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు. ఏర్పాట్లలో చిన్న చిన్న లోపాలు ఉన్నా అవి అనుభవలేమి కారణంగా జరిగినవే. తర్వాతి మ్యాచ్ సమయానికి ఇవి సరిజేసుకుంటే బాగుంటుంది. -
పిచ్ మాంత్రికుడు మనోడే
♦ బెస్ట్ క్యూరేటర్‌గా చంద్రశేఖర్‌రావు ♦ అంతర్జాతీయ క్రికెట్లో మెతుకుసీమ ముద్ర అతను ఇక్రిశాట్లో ఉద్యోగి.. నేల స్వభావాన్ని గుర్తించి పంటల బ్రీడింగ్‌పై రీసెర్చ్ చేయడం తన విధి.. మరో వైపు క్రికెట్లో రాణిస్తుండటంతో ఇక్రిశాట్ జట్టుకు 11 సంవత్సరాలు కెప్టెన్‌గా వ్యవహరించారు. వృత్తిరీత్యా నేల స్వభావం తెలియడం.. క్రికెట్‌పై ఆసక్తి.. వెరసి పిచ్‌ల తయారీలో రాణించాడు. అంతేకాదు బీసీసీఐ సర్టిఫైడ్ క్యూరేటర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అతనే మెతుకుసీమ ముద్దుబిడ్డ వైఎల్ చంద్రశేఖర్‌రావు. జిన్నారానికి చెందిన ఇతను ప్రస్తుతం తల్లిదండ్రులతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. క్రికెట్లో గెలుపెవరిదైనా అభినందనలు మాత్రం ఇతనికే.. ఉత్తమ క్యూరేటర్ అవార్డులు సైతం ఇతని సొంతం. ప్రపంచ వ్యాప్తంగా సునిల్ గవాస్కర్, వివియన్ రిచర్డ్స్, సచిన్టెండూల్కర్ వంటి క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలను అందుకున్నాడు. జిల్లాలోని నల్లరేగడి మట్టినే పిచ్‌ల తయారీకి వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే అలాంటి పిచ్‌లనే జిల్లాలో సైతం తయారు చేస్తానంటున్నారు. - సిద్దిపేట జోన్ సిద్దిపేట జోన్: క్రికెట్.. ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఆసక్తి కల్గిస్తున్న ఈ క్రీడ లో గెలుపోటములు సహజం. అలాంటి క్రికెట్ ఆటకు పిచ్ కీలకం. జట్టు జయాపజయాలను నిర్ణయించేది, నిర్దేశించేది పిచ్ మాత్రమే. బౌలింగ్, బ్యాటింగ్‌లకు అనుగుణంగా ఉండేలా పిచ్‌లను తయారు చేయడానికి ప్రత్యేక నిపుణులుంటారు. అలాంటి పిచ్ తయారీలో దిట్టగా నిలిచి బీసీసీఐ సర్టిఫైడ్ క్యూరేటర్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వైఎల్ చంద్రశేఖర్ రావు పిచ్ మాంత్రికుడు అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. అలాంటి మాంత్రికుడు మెతుకుసీమ బిడ్డ కావడం జిల్లాకు గర్వకారణం. జిన్నారం మండలం గడ్డిపోతారం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, నాగమణిల కుమారుడు వైఎల్ చంద్రశేఖర్‌రావు. చిన్నతనంలోనే తనతల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మహబూబ్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. చదువు అనంతరం మెదక్ జిల్లా ఇక్రిశాట్లో వేరుశనగ బ్రీడింగ్ రిసెర్చ్ అసోసియేట్‌గా విధులను నిర్వర్తించారు. 1976లో పటాన్చెరువు ఇక్రిశాట్ జట్టుకు 11 సంవత్సరాలుగా కెప్టెన్‌గా కొనసాగారు. క్రికెట్‌పై ఆసక్తి కలిగిన చంద్రశేఖర్‌రావు 1994-95లో అండర్ 13 జట్టుగా కోచ్‌గా, మేనేజర్‌గా పనిచేశారు. తాను వృత్తిరీత్యా నేల స్వభావాన్ని తెలుసుకునే ఉద్యోగి కావడంతో పదవీ విరమణ అనంతరం పిచ్‌ల తయారీకి అనుకూలంగా ఉండే నేలలపై దృష్టిసారించారు. ఒక దశలో పిచ్‌లను తయారుచేసేందుకు 1986లోనే తన ఉద్యోగ విరమణ చేసి పూర్తికాలం క్రికెట్‌పైనే ఆసక్తిని కనబర్చారు. 9 సంవత్సరాలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్యూరేటర్‌గా పనిచేశారు. 5 సంవత్సరాల క్రితం బీసీసీఐ సర్టిఫైడ్ క్యూరేటర్‌గా పదోన్నతి పొందారు. పలు వన్డే, టెస్ట్ మ్యాచ్‌లకు పిచ్‌లను తయారు చేశారు. అదే విధంగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లోని 50 మ్యాచ్‌లకు పిచ్‌లను రూపొందించారు. 46 రంజీ ట్రోఫీలకు పిచ్‌లను తయారు చేయడం కాకుండా దులిప్ట్రోఫీ, రంజీ ఫైనల్‌లకు పిచ్‌లను తయారు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, శ్రీలంక, భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లకు పిచ్‌లను రూపొందించారు. న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌లు, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లకు పిచ్‌లు తయారు చేశారు. 2009, 2011.2012, 2014, 2015తో పాటు ప్రస్తుత ఐపీఎల్ మ్యాచ్‌లకు చంద్రశేఖర్‌రావు క్యూరేటర్‌గా పనిచేశారు. 2014లో ఉత్తమ క్యూరేటర్‌గా అవార్డును కూడా అందుకున్నారు. రెండు పర్యాయాలు ఉత్తమ క్యూరేటర్‌గా అవార్డులు, నగదు పురస్కారాలను అందుకున్నారు. బ్యాటింగ్, వికెట్లకు అనుగుణంగా పిచ్‌లను తయారు చేయడంలో చంద్రశేఖర్‌రావు నైపుణ్యం కలిగిన క్యూరేటర్. వీటితో పాటు 20-20, వన్డే, టెస్ట్ మ్యాచ్‌లకు ఇరు జట్లను దృష్టిలో పెట్టుకొని పిచ్‌ను తయారు చేయడం ఈయన ప్రత్యేకత. క్యూరేటర్‌గా ప్రముఖ క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్, వీవీఎన్ రిచర్డ్, సచిన్ టెండూల్కర్, ధోని, వీవీఎస్ లక్ష్మణ్‌లాంటి వారి అభినందనలు కూడా అందుకున్నారు. గోవా, నాందేడ్, చెన్నై లాంటి ప్రాంతాల్లో స్థానిక క్రీడకారుల కోసం పిచ్‌లను తయారు చేశారు. జిల్లా నేలలు ఎంతో ఉపయోగం పిచ్‌ల తయారీలో పేరుగాంచిన చంద్రశేఖర్‌రావుకు మెదక్ జిల్లా అంటే అమితమైన ప్రేమ. జిల్లాలోని నల్లరేగడి నెలలు క్రికెట్ పిచ్ తయారీకి ఎంతో ఉపయోగపడుతాయన్నారు. జిల్లాలోని నల్లరేగడి మట్టితో చెన్నైలో, గోవాలో, కొచ్చిలో పిచ్‌ల తయారీకి మెతుకుసీమ మట్టిని వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రోత్సహిస్తే జిల్లా వ్యాప్తంగా పిచ్‌లను తయారు చేస్తా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా వసతులు కల్పించాల్సిన ఆవసరముంది. తనను ప్రభుత్వం ప్రోత్సహిస్తే జిల్లాలోని అన్నిచోట్లా పిచ్‌ల తయారీకి కృషి చేస్తా. ప్రధానంగా టర్ఫ్ వికెట్ అనేది ఎంతో ముఖ్యంగా మారింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌లాంటి ప్రాంతాల్లో పిచ్‌లు తయారు చేయాలని తనకు ఆసక్తి ఉంది. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కోరికమేరకు సిద్దిపేటలో ఇటీవలే టర్ఫ్ వికెట్ పిచ్‌ను తయారు చేశాను. - చంద్రశేఖర్, పిచ్ క్యూరేటర్ -
నాగ్ పూర్ పిచ్ పై మ్యాచ్ రిఫరీ నివేదిక
దుబాయ్: ఇది నిజంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు ఇబ్బంది కల్గించే పరిణామమే. దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య మూడో టెస్టు సిరీస్ జరిగిన నాగ్ పూర్ పిచ్ చాలా పేలవంగా ఉందంటూ ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో తాజాగా రూపొందించిన నివేదికలో స్పష్టం చేశారు. పిచ్ మానిటరింగ్ లో భాగంగా జెఫ్ క్రో నాగ్ పూర్ పిచ్ ను పరిశీలించారు. ఐసీసీ ఆర్టికల్ 3 ప్రకారం నాగ్ పూర్ పిచ్ చాలా నిర్జీవంగా ఉందంటూ జెఫ్ క్రో తన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై రూపొందించిన నివేదకను ఐసీసీతో పాటు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కూడా అందజేశారు. ఈ నివేదికపై 14 రోజుల్లో బీసీసీఐ తమ సమాధానాన్ని తెలియజేయాల్సి ఉంది. కాగా, పిచ్ నివేదికపై బీసీసీఐ నుంచి సమాధానం వచ్చిన తరువాత ఆ మ్యాచ్ కు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని ఐసీసీ చీఫ్ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే నేతృత్వంలోని కొంతమంది సభ్యుల బృందం పరిశీలిస్తోంది. అనంతరం నాగ్ పూర్ పిచ్ పై చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
మళ్లీ ‘మూడి’నట్లే(నా)!
‘ఈ వికెట్ మీద బ్యాటింగ్ చేయడం అంటూ సాధ్యమైతే అది తొలి రోజు మాత్రమే’... నాగ్‌పూర్‌లో టాస్ గెలిచిన వెంటనే కోహ్లి అన్న మాట ఇది. టర్నింగ్ పిచ్‌ను తయారు చేశామని క్యురేటర్ ముందే చెప్పడంతో ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. తొలి రోజు ఆట కూడా ఊహించినట్లుగానే సాగింది. తొలి సెషన్లో భారత బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చూపించినా... స్పిన్నర్లు వచ్చాక పరుగుల వేగం మందగించింది. అయితే స్టెయిన్ గైర్హాజరీలో బౌలింగ్ బాధ్యతలు తీసుకున్న మోర్నీ మోర్కెల్ ఓ సాధారణ పిచ్‌పై సంచలన బౌలింగ్ చేశాడు. బంతుల్లో వైవిధ్యం చూపిస్తూ బ్యాట్స్‌మెన్‌ను అయోమయంలోకి నెట్టాడు. విజయ్, కోహ్లి, రహానేల రూపంలో మూడు కీలక వికెట్లతో భారత జోరుకు బ్రేక్ వేశాడు. రెండో సెషన్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్ సహజంగానే కొంత ఒత్తిడిలోకి వెళ్లింది. వ్యూహం మారింది! తాను కెప్టెన్ అయిన దగ్గరి నుంచి ఐదుగురు బౌలర్ల వ్యూహంతో ఆడుతున్న కోహ్లి ఈసారి మాత్రం నలుగురు బౌలర్లకే పరిమితమయ్యాడు. గత రెండు మ్యాచ్‌ల్లో అనుభవాలు, పిచ్ స్వభావం దృష్ట్యా రెండో పేసర్ అనవసరమని భారత్ భావించింది. దీంతో ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మకు అవకాశం దక్కినా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. 2010లో నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా టెస్టుల్లో రోహిత్ అరంగేట్రం జరగాల్సింది. అయితే ఆ మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు ఫుట్‌బాల్ ఆడుతూ గాయపడ్డాడు. ఆ తర్వాత మూడేళ్లు కష్టపడితేగానీ టెస్టు జట్టులోకి రాలేకపోయాడు. ఈసారి అదే మైదానంలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని రోహిత్ ఊహించి ఉండడు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తనకు గొప్ప అవకాశం. వన్డేల్లో షాట్లు ఆడటం అలవాటైన భారత బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో డిఫెన్స్ ప్రాముఖ్యతను గుర్తించలేకపోయారు. దానికి ఉదాహరణ ఈ మ్యాచ్‌లో మన బ్యాట్స్‌మెన్ ఆటతీరు. అయితే మొత్తం మీద 215 పరుగులు చేయడం కాస్త సానుకూలాంశమే. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా బాగా నిరాశపడింది తాహిర్ విషయంలోనే. సిరీస్ ఆరంభానికి ముందు తనే తమ తురుపు ముక్కగా భావించారు. కానీ స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌లపై కూడా తను ప్రభావం చూపలేకపోతున్నాడు. అందుకే మరో స్పిన్నర్ హార్మర్నే సఫారీలు నమ్ముకున్నారు. తన మీద ఉంచిన బాధ్యతను నెరవేరుస్తూ హార్మర్ నాలుగు వికెట్లతో రాణించాడు. బ్యాట్స్‌మెన్ తిప్పలు ఎప్పటిలాగే అశ్విన్ మరోసారి కొత్త బంతితో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. పిచ్ మీద నిలబడటానికే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డ్యాన్స్ చేయాల్సి వస్తోంది. తొమ్మిది ఓవర్ల పాటు సఫారీ బ్యాట్స్‌మెన్ బంతి బంతికీ గండమే అన్నట్లు ఆడారు. అశ్విన్ మరోసారి ఓ చక్కటి బంతితో ఓపెనర్ వేన్జిల్ను అవుట్ చేసి కోహ్లి కోరుకున్న ఆరంభాన్ని అందించాడు. ఇక ఈ సిరీస్‌లో స్టార్‌గా ఎదిగిన రవీంద్ర జడేజా కళ్లు చెదిరే బంతితో నైట్‌వాచ్‌మన్ తాహిర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. మొత్తం మీద భారత్ జట్టు తొలి రోజును సంతోషంగానే ముగించింది. అయితే దక్షిణాఫ్రికా కూడా పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్లలేదు. పడ్డ రెండు వికెట్లలో ఒకటి నైట్ వాచ్మన్దే. ఆమ్లా, డివిలియర్స్, డు ప్లెసిస్, డుమినిలలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా భారత్ స్కోరు దగ్గరకి రావచ్చు. అయితే పిచ్ స్వభావాన్ని, భారత స్పిన్నర్ల జోరును పరిగణలోకి తీసుకుంటే రెండో రోజు కనీసం రెండు సెషన్లైనా నిలబడతారా అనే సందేహం వస్తోంది. ఈ మ్యాచ్‌లో ఫలితం రావడం ఖాయం. అదేంటనేది రెండో రోజుకే స్పష్టత వస్తుంది. ప్రస్తుతం తీరు చూస్తే ఇది కూడా మూడోరోజే ముగిసేలా కనిపిస్తోంది..! - సాక్షి క్రీడావిభాగం -
ఇక్కడే కొట్టాలి!
మొహాలీలో మన ముచ్చట తీరినా... చిన్నస్వామిలో చినుకు అడ్డు పడింది. ఇక ఢిల్లీ దాకా వెళ్లక ముందే నాగ్‌పూర్‌లోనే సిరీస్ మన ఖాతాలో పడుతుందా... వికెట్ స్పిన్‌తో సిద్ధం, ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం... ఇక మిగిలింది విజయమే. ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న భారత్ మరో గెలుపు అందుకొని సిరీస్ సొంతం చేసుకుంటే ఓ పనైపోతుంది. టి20, వన్డేలకు ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుంది. ఒక వైపు తొమ్మిదేళ్లుగా విదేశాల్లో టెస్టు సిరీస్ ఓడిపోని రికార్డు చెరిగిపోయే ప్రమాదం... మరోవైపు బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యం, స్పిన్ బంతిని చూస్తే బెదిరిపోతున్న వైనం, గెలుపు సంగతేమో కానీ... కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడి మ్యాచ్‌ను కాపాడుకోగలిగితే చాలు... ఈ ఒత్తిడిలో జామ్తా మైదానంలో గత రికార్డు ఇస్తున్న భరోసాతో బరిలోకి దిగుతున్న సఫారీలు. మరి మూడో టెస్టు భారత్‌కు ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా... ఏకపక్ష విజయం దక్కుతుందా లేక దక్షిణాఫ్రికా పోరాటపటిమ ప్రదర్శిస్తుందా..? * సిరీస్‌పై భారత్ కన్ను * స్పిన్ పిచ్‌తో సిద్ధం * తీవ్ర ఒత్తిడిలో దక్షిణాఫ్రికా * నేటినుంచి మూడో టెస్టు నాగ్‌పూర్: సొంతగడ్డపై ఆడి కూడా దక్షిణాఫ్రికాతో గత రెండు టెస్టు సిరీస్‌లలో డ్రా తోనే సంతృప్తిపడిన భారత్ ఈ సారి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని భావిస్తోంది. తమ బలమైన స్పిన్నే మరోసారి నమ్ముకొని సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేటి (బుధవారం)నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలి టెస్టు నెగ్గిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. మిశ్రాకు చోటు! బెంగళూరులో నాలుగు రోజుల ఆట సాధ్యం కాకపోవడంతో ఇరు జట్లకూ మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. అయితే రెండో టెస్టు అనంతరం దక్కిన విరామంలో స్వస్థలాలకు వెళ్లి వచ్చిన భారత ఆటగాళ్లు కొత్త ఉత్సాహంతో సన్నద్ధమయ్యారు. మొహాలీ టెస్టులో బౌలర్ల అండతో టీమిండియా నెగ్గినా... విజయ్, పుజారా మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ముఖ్యంగా కోహ్లి, రహానే ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. రెండో టెస్టులో దీనిని సరిదిద్దుకునే అవకాశం రాలేదు. జట్టులో ఐదుగురే రెగ్యులర్ బ్యాట్స్‌మెన్ ఉండటంతో ఇద్దరు విఫలం కావడం స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. కీలకమైన ఆరో స్థానంలో ఆడుతున్న సాహా ఇంకా టెస్టు బ్యాట్స్‌మన్‌గా నిలదొక్కుకోలేదు. రెండో మ్యాచ్‌లో చక్కటి షాట్లు ఆడిన ధావన్ తిరిగి ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. బౌలింగ్‌లో మరోసారి స్పిన్నర్లదే ప్రధాన బాధ్యత కానుంది. మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 27 వికెట్లు మన స్పిన్నర్లే పడగొట్టడం వారి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. అశ్విన్, జడేజా ‘జుగల్బందీ’ సఫారీలను కట్టి పడేస్తోంది. గత టెస్టులో బిన్నీకి అవకాశం ఇచ్చినా... వికెట్ స్వభావాన్ని బట్టి చూస్తే లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మళ్లీ తుది జట్టులోకి రావచ్చు. నడిపించేది ఎవరు? భారత్‌లో పర్యటించిన విదేశీ జట్లలో అత్యుత్తమ రికార్డు ఉన్న టీమ్‌గా ఇక్కడ అడుగు పెట్టిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ టెస్టుల్లో ఘోరంగా విఫలమైంది. తొలి రెండు టెస్టులు జరిగిన వేదికల్లో స్పిన్‌కు మరీ భయపడే పరిస్థితి ఏమీ లేదని స్వయంగా ఆ జట్టు ఆటగాళ్లే ఒప్పుకుంటున్నా...మానసికంగా ముందే ఓటమికి సిద్ధమైనట్లుగా వారు ఆడారు. వర్షం కారణంగా విరామం తెచ్చిన మార్పు ఏదైనా ఉంటే అది ఈ మ్యాచ్‌లోనే వారు చూపించాలి. లేదంటే సిరీస్ చేజారిపోవడం ఖాయం. డివిలియర్స్ మినహా ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. టన్నుల కొద్దీ రికార్డులు తన పేరిట ఉన్న ఆమ్లా, స్పిన్‌ను సమర్థంగా ఆడగలడన్న డు ప్లెసిస్ (0, 1, 0 పరుగులు) ఘోర వైఫల్యం జట్టును దెబ్బతీస్తోంది. వీరిద్దరు రాణించడంతో పాటు డుమిని తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సఫారీలు కొంత కోలుకునే అవకాశం ఉంది. ఎల్గర్ కొద్దిగా పట్టుదల కనపర్చినా...అనుభవం లేని వాన్ జిల్, విలాస్ తేలిపోయారు. ఈ స్థితిలో భారత బౌలింగ్‌ను అడ్డుకోవాలంటే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ శక్తికి మించి శ్రమించాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో కూడా ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. స్టెయిన్ గాయంపై ఇంకా సందేహాలు ఉండటంతో అతను ఆడేది లేనిదీ చెప్పలేని స్థితి. ఈ దశలో మోర్నీ మోర్కెల్‌తో పాటు అనుభవం లేని రబడపై బాధ్యత పెరిగింది. పరిమిత ఓవర్ల తరహాలో తాహిర్ రాణిస్తేనే ఆ జట్టుకు కూడా పిచ్ అండగా మారుతుంది. ఒక పేసర్‌ను తగ్గించి జట్టు మరో స్పిన్నర్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. పిచ్, వాతావరణం భారత్ ఆశించినట్లే ఇక్కడ కూడా స్పిన్ పిచ్‌నే తయారు చేశారు. మొదటి రోజునుంచే బంతి తిరుగుతుందని క్యురేటర్ చెప్పడం విశేషం. గతంతో పోలిస్తే మైదానంలో ఈ సారి బౌన్స్ కూడా కాస్త ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని రోజులుగా నగరంలో 30 డిగ్రీలతో సాధారణం వాతావరణం ఉంది. కాబట్టి మ్యాచ్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చు. జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, మిశ్రా, ఇషాంత్, ఆరోన్. దక్షిణాఫ్రికా: ఆమ్లా (కెప్టెన్), ఎల్గర్, వాన్ జిల్, డు ప్లెసిస్, డివిలియర్స్, డుమిని, విలాస్, మోర్కెల్, తాహిర్, రబడ/అబాట్, హార్మర్/పీడ్ 2006లో శ్రీలంక చేతిలో 0-2తో పరాజయంపాలైన తర్వాత దక్షిణాఫ్రికా విదేశాల్లో ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో పాటు ఆస్ట్రేలియాను (రెండు సార్లు) కూడా సఫారీలు చిత్తు చేశారు. మొత్తం 14 సిరీస్‌లలో దక్షిణాఫ్రికా 10 గెలవడం విశేషం. * భారత్‌లో ఆడిన గత రెండు సిరీస్‌లను (2007-08, 2009-10) దక్షిణాఫ్రికా ‘డ్రా’గా ముగించగలిగింది. * నాగ్‌పూర్ జామ్తా స్టేడియంలో నాలుగు టెస్టులు ఆడిన భారత్ 2 గెలిచి 1 డ్రా చేసుకొని మరొకటి ఓడింది. ఆ ఒక్కటి దక్షిణాఫ్రికా (2010) చేతిలోనే కావడం విశేషం. * ఈ సీజన్లో జామ్తా మైదానంలో జరిగిన రెండు రంజీ మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు 44 వికెట్లు తీయడం విశేషం. ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం... -
అంత వీజీ కాదు!
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావాలి... మీరేం చేస్తారో మాకు తెలీదు. తొలి రోజు నుంచే బంతి తిరగాలి... మ్యాచ్‌లకు ముందు క్యూరేటర్లకు వచ్చే ఆదేశాలివి. నిజానికి అప్పటికప్పుడు పిచ్ స్వభావాన్ని మార్చడం సాధ్యం కాదు. ముఖ్యంగా టెస్టు మ్యాచ్‌లకు పిచ్‌లు రూపొందించడం చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. ఇటీవల పిచ్‌ల గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు టెస్టు మ్యాచ్‌లకు పిచ్‌లు ఎలా తయారు చేస్తారో చూద్దాం. సాక్షి క్రీడావిభాగం: టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడమనేది ఏ రాష్ట్ర సంఘానికైనా చాలా గర్వంగా ఉంటుంది. ఓ మంచి టెస్టు పిచ్‌ను రూపొందిస్తే క్యూరేటర్‌కు అంతకుమించిన సంతృప్తి మరోటి ఉండదు. ఐదు రోజుల ఫార్మాట్‌కు వికెట్‌ను తయారు చేయడం ఓ కల... అలాగే సవాలు కూడా. ప్రతి క్యూరేటర్ దీన్ని కోరుకుంటాడు. * సీజన్లో ఎక్కువ క్రికెట్ ఆడటం వల్ల పిచ్ తయారీలో కూ డా విస్తృతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో పిచ్ తయారీకి 20 రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు 10 రోజుల్లోనే మంచి వికెట్‌ను రూపొందిస్తున్నారు. * సాధారణంగా టెస్టు మ్యాచ్ కోసం మూడు సెంటర్ వికెట్లను ఎంపిక చేస్తారు. ఒక దానిపై ఎలాంటి గడ్డి లేకుండా ఉంటుంది. మ్యాచ్‌కు ఓ వారం ముందు వీటిపై పని మొదలవుతుంది. మ్యాచ్‌కు ఉపయోగించే పిచ్‌ను ఎంపిక చేసిన తర్వాత 10ఁ80 అడుగుల రోప్‌ను దాని చుట్టూ కడతారు. * తర్వాత వికెట్‌పై ఉండే గడ్డి ఎత్తును కొలుస్తారు. ఇది ఎనిమిది అంగుళాల కంటే ఎక్కువగా ఉండకూడదు. మ్యాచ్ సమయానికి దీన్ని తగ్గిస్తారు. పిచ్‌పై నీళ్లు చల్లడం సాధారణంగా కనిపించినా... నీటిని నేరుగా పోయరు. షవర్ పైపుతో పిచికారి చేస్తారు. పిచ్‌పై ప్రతి చిన్న ప్రదేశం తడిసేలా చేస్తూ అన్ని వైపులా సమాంతరంగా పడేలా చూస్తారు. * వికెట్ ఉపరితలం మరీ మృదువుగా ఉంటే భూమిలోకి నీరు చాలా తొందరగా ఇంకిపోతుం ది. దీన్ని తెలుసుకునేందుకు 3 నుంచి 4 మిల్లీ మీటర్ల మందంతో ఆరు అంగుళాల పొడవున్న స్క్రూ డ్రైవర్‌ను నిటారుగా పిచ్‌పై దించి దీన్ని అంచనా వేస్తారు. నీళ్లు నాలుగు అంగుళాల కంటే కిందకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు ఎక్కువగా లోపలికి ఇంకితే మంచి పిచ్‌ను రూపొందించలేరు. పిచ్ ఉపరితలంపై ఎక్కువ తడి ఉంటే బౌలర్లు సరైన బౌన్స్‌ను రాబట్టలేరు. అలాగే పిచ్ సాంద్రత నాలుగు రోజుల పాటు ఉండదు. * ఉదయం పూట పిచ్‌పై నీళ్లు చల్లడం అయ్యాక.. 250 నుంచి 350 కేజీల బరువున్న రోలర్‌తో తేలికగా ఒక మూల నుంచి మరో మూలకు 20 నిమిషాల పాటు రోలింగ్ చేస్తారు. షవర్ పద్ధతిని ఉపయోగించి క్రమం తప్పకుండా పిచ్‌పై నీళ్లను చల్లుతూ రోలింగ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఉపరితలంపై ఉండే మట్టి, ఇసుక అటూ ఇటూ పోకుండా ఉంటాయి. * పిచ్‌పై నీళ్లు పిచికారి చేసిన తర్వాత ఆరడానికి కాస్త సమయం ఇవ్వాలి. అప్పుడు ఉపరితలంపై ఏ మేరకు నీళ్లు ఉన్నాయో పరిశీలించి మళ్లీ తేలికగా రోలింగ్ చేయాలి. అవసరమైతే నీటిని పిచికారి చేయాలి. ప్రతి రోజూ మధ్యాహ్నం వరకు దీన్ని కొనసాగించాలి. ఆ తర్వాత పిచ్‌పై కవర్లు తీసేసి తేమ లేకుండా చూడాలి. * మధ్యాహ్నం ఎండకు వెంట్రుక మందంలో పిచ్‌పై పగుళ్లు వస్తాయి. తర్వాత టన్ను బరువున్న రోలర్‌ను రోలింగ్ చేయడం ద్వారా పిచ్ మరింత బాగా కుదురుకుంటుంది. * ఉదయం పూట రోలింగ్ చేయడం వల్ల పిచ్ రెండు అంగుళాలు కుదించుకున్నట్లు కనిపిస్తుంది. సాయంత్రం కూడా ఒకసారి రోలిం గ్ చేయాలి. ఇలా వరుసగా మూడు రోజులు చేయడం వల్ల పిచ్ బాగా శక్తిని పుంజుకుంటుంది. నాలుగో రోజు పిచ్‌పై వదిలేసిన 8 అంగుళాల గడ్డిని ఆరు అంగుళాలకు కత్తిరిస్తారు. మధ్యాహ్నం మరో రెండు అంగుళాల మేర తగ్గిస్తారు. ఇప్పుడు వికెట్‌పై సరైన ఎత్తులో గడ్డి ఉండటం వల్ల పిచ్‌పై ఫలితం వచ్చే అవకాశాలుంటాయి. * పిచ్‌పై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ గతంలో మైదానంలో మ్యాచ్‌లు జరగకపోతే... వికెట్ సంపీడ్యతను అంచనా వేసేందుకు కనీసం కొంతైనా క్రికెట్‌ను అడించాలి. ఇక ఉపయోగించుకునేందుకు పిచ్ సిద్ధంగా ఉన్నప్పుడు ఉపరితలం ఎక్కువగా పొడిబారకుండా, గడ్డి సమానంగా వ్యాపించి ఉండేలా మైదానం సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు. * పిచ్‌ను రూపొందించేటప్పుడు సూర్యకాంతి, ఉష్ణోగ్రత, మ్యాచ్ సమయాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే వాతావరణంలో మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని అంచనాలు వేసుకుంటారు. సాధారణంగా నవంబర్‌లో మ్యాచ్ ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. అదే మార్చిలో చాలా పొడిగా ఉంటుంది. శీతాకాలంలో రెండు రోజులు మాత్రమే పిచ్ పొడిగా ఉంటుంది. అదే ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రత వల్ల ఉపరితలంపై పెద్ద పెద్ద పగుళ్లు వస్తాయి. * ఏదైనా పిచ్ మనం కోరుకున్నట్లు ఉండాలంటే సంబంధిత క్యూరేటర్‌కు కనీసం 10 రోజుల ముందు సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. -
అశ్విన్‌తోనే ప్రమాదం: డు ప్లెసిస్
మొహాలీ: భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌తోనే తమకు ఎక్కువ ప్రమాదమని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డు ప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ‘టెస్టు మ్యాచ్‌లలో తొలి రోజు నుంచే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు ఎదురవుతాయని భావిస్తున్నాం. కాబట్టి అన్ని మ్యాచ్‌లలో ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పిచ్‌లపై అశ్విన్ ప్రమాదకారి. అతడిని నిలువరిస్తే మా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’ అని డు ప్లెసిస్ అన్నాడు. భారత్‌లో టెస్టు క్రికెట్ ఆడటం ఏ ప్రత్యర్థికైనా గొప్ప సవాల్ అని చెప్పాడు. ‘మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌లో టెస్టు క్రికెట్ ఆడటం కఠినం. అయితే సిరీస్‌లో ఇప్పటి వరకూ మేం బాగా ఆడాం. అదే ఆత్మవిశ్వాసంతో ఈ ఫార్మాట్లోనూ బరిలోకి దిగుతాం’ అని డు ప్లెసిస్ చెప్పాడు. -
‘పిచ్’ ముదిరింది!
భారత క్రికెట్ జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి, ముంబై క్యురేటర్ సుధీర్ నాయక్‌ల మధ్య గొడవ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దగ్గరకు చేరింది. అయితే ఇన్ని రోజులూ క్యురేటర్‌ను రవిశాస్త్రి దూషించాడంటూ వివాదం సాగుతుండగా... తాజాగా ఇది మరో మలుపు తిరిగింది. తాను సుధీర్‌ను తిట్టలేదని రవిశాస్త్రి చెబుతుండగా... మూడు వారాల ముందే స్పిన్ ట్రాక్ కావాలని చెప్పినా క్యురేటర్ పట్టించుకోలేదని, జట్టు మాటను బేఖాతరు చేశాడని తాజాగా భారత జట్టు మేనేజ్మెంట్ ఫిర్యాదు చేసింది. మొత్తానికి ఇది చిలికి చిలికి గాలివానలా మారి ముంబై క్రికెట్ సంఘం, బీసీసీఐ మధ్య వివాదంగా మారబోతోంది. * బీసీసీఐ దగ్గరకి సుధీర్ నాయక్-రవిశాస్త్రి గొడవ * క్యురేటర్‌కు మద్దతుగా ముంబై క్రికెట్ సంఘం * జట్టు మాట వినలేదంటూ బోర్డు ఆగ్రహం ముంబైలో జరిగిన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేసి పరుగుల వరద సృష్టించారు. కొత్త రికార్డులు నెలకొల్పి భారత్‌ను చిత్తు చేశారు. నిజానికి ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఉంటే మ్యాచ్ ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉండేది. ముందు బ్యాటింగ్ చేసిన జట్టు పరుగుల పండగ చేసుకునే విధంగా పిచ్ ఉంది. దక్షిణాఫ్రికాలాంటి బలమైన జట్టుకు ఫ్లాట్ పిచ్ ఎలా ఇచ్చారనేది ఇప్పటికీ మిస్టరీయే. నిజానికి ఆ జట్టు బలహీనత స్పిన్. అందుకే ధోని ఏకంగా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో సిరీస్ ఆడాడు. సాధారణంగా ఏ జట్టయినా సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు... తమ బలం, ప్రత్యర్థి బలహీనత ఆధారంగా పిచ్‌లను రూపొందిస్తుంది. భారత్ కూడా ఇదే పని చేయాలని భావించింది. సిరీస్ ఆరంభానికి ముందే ఐదు వన్డేల్లోనూ స్పిన్‌కు అనుకూలించే ట్రాక్‌లు ఉండాలని జట్టు కోరింది. బీసీసీఐ పిచ్‌ల కమిటీ హెడ్ దల్జీత్ సింగ్‌తో భారత మేనేజ్మెంట్ మాట్లాడింది. ఐదు వన్డేలు జరిగే అసోసియేషన్ల క్యురేటర్లందరికీ దల్జీత్ సింగ్ ఈ సమాచారం పంపించారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్లే తయారు చేయాలని చెప్పారు. తొలి నాలుగు వన్డేలు నిర్వహించిన కాన్పూర్, ఇండోర్, రాజ్‌కోట్, చెన్నైల సంఘాల క్యురేటర్లు ఈ ఆదేశాలను పాటించారు. కానీ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) క్యురేటర్లు మాత్రం దీనిని పట్టించుకోలేదు. పైగా బౌలర్లకు ఎలాంటి సహకారం లేని ఫ్లాట్ పిచ్‌ను రూపొందించారు. మ్యాచ్‌కు ముందు రోజు మైదానానికి వచ్చిన భారత క్రికెటర్లు ఈ పిచ్‌ను చూసి షాక్ తిన్నారు. రవిశాస్త్రి ఆదేశం మేరకు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్... పిచ్ క్యురేటర్ రమేశ్ మమున్కర్ను కలిశారు. పిచ్‌పై కొంత భాగం అధికంగా వాటరింగ్ చేయాలని తద్వారా కాస్తయినా స్పిన్నర్లకు సహకారం దొరుకుతుందని కోరారు. కానీ రమేశ్ ఈ మాట పెడచెవిన పెట్టారు. అయినా భారత జట్టులో ఓ మూలన ఆశ ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే సమస్య లేదని భావించారు. కానీ డివిలియర్స్ టాస్ గెలిచాడు. దక్షిణాఫ్రికా ఏకంగా 438 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు ముందే మ్యాచ్ ఓడిపోయామని గ్రహించింది. భారత బౌలర్లంతా చేష్టలుడిగి నిలుచుండిపోవడం చూసిన రవిశాస్త్రితో పాటు కోచ్‌లు తీవ్రంగా ఆగ్రహం చెందారు. నిజంగా తిట్టలేదా?: దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగియగానే జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి... చీఫ్ క్యురేటర్ సుధీర్ నాయక్‌తో ‘మంచి పిచ్ తయారు చేశావ్’ అని చప్పట్లు కొడుతూ వెటకారంగా అన్నారు. దీనికి తాను థ్యాంక్స్ చెప్పానని, అయితే శాస్త్రి తనపై బూతులకు దిగాడని సుధీర్ ఆరోపించారు. అయితే జట్టు డెరైక్టర్ మాత్రం తాను ఆ సమయంలో ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్నానని, తాను తిట్టలేదని అంటున్నారు. దీనిపై సుధీర్ తొలుత ముంబై క్రికెట్ సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ముంబై సంఘం సుధీర్‌కు మద్దతుగా నిలబడింది. దీంతో ఆయన బీసీసీఐకి కూడా రవిశాస్త్రి, అరుణ్‌లపై ఫిర్యాదు చేశారు. మాట ఎందుకు వినలేదు?: అయితే బీసీసీఐ పెద్దలు దీనిపై ఇప్పటికే రవిశాస్త్రితో మాట్లాడారు. అలాగే బీసీసీఐ పిచ్‌ల కమిటీ హెడ్ బల్జీత్ సింగ్‌నూ సంప్రదించారు. అన్ని సంఘాలకూ స్లో పిచ్‌లు తయారు చేయమని ఆదేశాలు పంపామని ఆయన కూడా చెప్పినట్లు సమాచారం. దీంతో బీసీసీఐ సుధీర్ నాయక్‌తో పాటు ముంబై క్రికెట్ సంఘాన్ని వివరణ అడగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబై సంఘం, బీసీసీఐ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. శ్రీనివాసన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పు-నిప్పులా ఉండేవి. బోర్డులోకి శశాంక్ మనోహర్ వచ్చిన తర్వాత పరిస్థితి సర్దుకుందనే అభిప్రాయం ఏర్పడింది. కానీ ఈ వివాదంతో మరోసారి పంచాయితీ మొదలైంది. -సాక్షి క్రీడావిభాగం -
సీఎం మార్పును వ్యతిరేకించిన కేఎల్ఆర్