కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమించిన ఇరు జట్లు గెలుపుపై థీమాగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే.. మరోవైపు భారత గడ్డపై తొలి టెస్టు విజయం సాధించాలని బంగ్లా పట్టుదలతో ఉంది.
కాగా దాదాపు మూడేళ్ల కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడనుంది. చివరగా 2021లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడింది. ఆ టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది. ఈ క్రమంలో కాన్పూర్ పిచ్, వాతావరణం ఎలా వుందో ఓ లుక్కేద్దాం.
పిచ్, వాతావరణం
చెన్నై పిచ్‌తో పోల్చుకుంటే కాన్పూర్ పిచ్ మందకొడిగా ఉండనుంది. నల్లమట్టితో రూపొందించిన పిచ్‌పై బంతి ఆగి వస్తుంది. స్పిన్నర్లు ఈ వికెట్‌పై చెలరేగే అవకాశముంది. ఇక ఉక్కపోత అధికంగా ఉండనుంది. మ్యాచ్‌కు తొలి రోజు, మూడో రోజు వర్షం ముప్పు పొంచి ఉండగా... వెలుతురు లేమి కారణంగా ఆటకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
అయితే గురువారం రాత్రి కాన్పూర్‌లో ఓ మోస్తారు వర్షం కురిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మ్యాచ్ జరిగే వేదిక వద్ద వర్షం లేకపోయినప్పటకి... ఆట మధ్యలో అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. అయితే ఆఖరి రెండు రోజుల ఆటకు ఎటువంటి వర్షం ముప్పు లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్/అక్షర్, బుమ్రా, సిరాజ్.
బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్ ), షాద్‌మన్, జాకీర్, మోమినుల్, ముషి్ఫకర్, షకీబ్, లిటన్ దాస్, మెహిది హసన్, తైజుల్, హసన్ మహమూద్, తస్కీన్ అహ్మద్.
Comments
Please login to add a commentAdd a comment