wether report
-
భారత్-బంగ్లా రెండో టెస్టు.. వాతావరణం ఎలా ఉందంటే?
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమించిన ఇరు జట్లు గెలుపుపై థీమాగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే.. మరోవైపు భారత గడ్డపై తొలి టెస్టు విజయం సాధించాలని బంగ్లా పట్టుదలతో ఉంది. కాగా దాదాపు మూడేళ్ల కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడనుంది. చివరగా 2021లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడింది. ఆ టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది. ఈ క్రమంలో కాన్పూర్ పిచ్, వాతావరణం ఎలా వుందో ఓ లుక్కేద్దాం.పిచ్, వాతావరణంచెన్నై పిచ్‌తో పోల్చుకుంటే కాన్పూర్ పిచ్ మందకొడిగా ఉండనుంది. నల్లమట్టితో రూపొందించిన పిచ్‌పై బంతి ఆగి వస్తుంది. స్పిన్నర్లు ఈ వికెట్‌పై చెలరేగే అవకాశముంది. ఇక ఉక్కపోత అధికంగా ఉండనుంది. మ్యాచ్‌కు తొలి రోజు, మూడో రోజు వర్షం ముప్పు పొంచి ఉండగా... వెలుతురు లేమి కారణంగా ఆటకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అయితే గురువారం రాత్రి కాన్పూర్‌లో ఓ మోస్తారు వర్షం కురిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మ్యాచ్ జరిగే వేదిక వద్ద వర్షం లేకపోయినప్పటకి... ఆట మధ్యలో అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. అయితే ఆఖరి రెండు రోజుల ఆటకు ఎటువంటి వర్షం ముప్పు లేదు.తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్/అక్షర్, బుమ్రా, సిరాజ్.బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్ ), షాద్మన్, జాకీర్, మోమినుల్, ముషి్ఫకర్, షకీబ్, లిటన్ దాస్, మెహిది హసన్, తైజుల్, హసన్ మహమూద్, తస్కీన్ అహ్మద్. -
తెలంగాణాలో పెరగనున్న ఉష్ణోగ్రతలు...
-
బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్
టీ20 ప్రపంచకప్-2022(సూపర్-12)లో భాగంగా కీలక మ్యాచ్‌లో ఆడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటే.. ఓడిన జట్టు సెమీస్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంటుంది. కాగా ఈ కీలక మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావారణ శాఖ మంగళవారం(నవంబర్ 1)న వెల్లడించింది. దీంతో వర్షం ఆటంకం ఉందనడంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా అభిమానులకు ఆడిలైడ్ నుంచి ఓ గుడ్ న్యూస్ అందింది. బుధవారం(నవంబర్ 2) ఉదయం నుంచి ఆడిలైడ్‌లో వర్షం పడేలేదు. అదే విధంగా నిన్నటి కంటే(మంగళవారం) ఈ రోజు వాతావరణం గణనీయంగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ బోరియా మజుందార్ ట్విటర్లో వెల్లడించారు. "గత కొన్ని గంటల నుంచి ఇక్కడ పూర్తిగా వర్షం పడడంలేదు. అదృష్టవశాత్తూ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షంఆటంకం కలిగించే ఛాన్స్ లేదు" అని మజుందార్ ట్విటర్లో పేర్కొన్నారు. 9am Adelaide. No rain for some hours now. Overcast yes but no rain. @RevSportz pic.twitter.com/W0zWcES5dB — Boria Majumdar (@BoriaMajumdar) November 1, 2022 తుది జట్లు (అంచనా) బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (c), అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్ భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ చదవండి: T20 World Cup 2022: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ -
బలహీనపడిన అల్పపీడనం..
సాక్షి, విశాఖపట్నం: తూర్పు రాజస్థాన్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ రాగల రెండు రోజుల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉత్తర బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ లో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 25 నుండి క్రమేణా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
బంగాఖాతంలో మరో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. వాయువ్య మధ్య ప్రదేశ్, పరిసరాల్లో ఏర్పపడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్తాన్ మీదగా పశ్చిమ దిశగా తీవ్ర అల్పపీడనం కదులుతుంది. రేపు (సోమవారం) ఉత్తర బంగాఖాతంలో మరో అల్పపీనడం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
కొనసాగుతున్న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది. అంబికాపుర్‌కు 90 కి.మీ దూరంలో కేంద్రికృతమైంది. నేటి అర్ధరాత్రి,రేపు ఉదయానికి బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు పడ్డాయి. తెలంగాణలో మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశముంది. తీరం వెంట ఈదురు గాలులు కొనసాగుతున్నాయి.మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. -
తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడంతో అన్ని ప్రధాన ఓడ రేవుల్లోనూ ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరానికి అనుకుని కొనసాగుతోంది. బాలాసోర్ కు ఆగ్నేయం గా 70 కి.మి, పశ్చిమ బెంగాల్ లోని డిఘా కు దక్షిణ ఆగ్నేయంగా 70 కి.మి దూరంలో కేంద్రీ కృతమైంది. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య బాలసోర్ కు సమీపంలో బుధవారం మధ్యాహ్నం తీరం దాటనుంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 50 నుండి 55 కి.మి వేగం తో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
మరింత బలపడిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నంః ఉత్తర బంగాళాఖాతంపై పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని ఆనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. తీరం వెంట గంటకు 50 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. -
కేరళను ముంచెత్తనున్న భారీ వర్షాలు!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఆగస్టులో సంభవించిన వరద విషాదం నుంచి ప్రజలు తేరుకోకమునుపే ఈ నెల 7న మరోసారి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత వాతావరణ విభాగం బులెటిన్ ప్రకారం..‘ఈనెల 6 కల్లా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. అది మరింతగా బలపడి తుఫానుగా మారి ఒమన్ తీరం వైపుగా సాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కేరళలోని చాలా ప్రాంతాల్లో అతిభారీ, తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయి. పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరీలోనూ వానలు కురుస్తాయి’. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. త్రిస్సూర్, పలక్కడ్ జిల్లాల్లోని జలాశయాల్లో అదనంగా చేరిన నీటిని కిందికి వదిలేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తమిళనాడులో చెన్నై, పుదుచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. కర్ణాటక ప్రభుత్వం దక్షిణ ప్రాంతంలోని 12 జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. -
ఉపరితల ద్రోణితో నేడు వర్షాలు
హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి 15 నాటికి దక్షిణ తెలంగాణకు రుతుపవనాలు రామగుండంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈనెల 15వ తేదీ నాటికి దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నైరుతి రుతు పవనాలు చేరుకుంటాయని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తర్వాత రాష్ట్రమంతటా విస్తరిస్తాయన్నారు. ఇక గత 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా గట్టులో 4 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా నవాబుపేటలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శనివా రం రామగుండంలో అత్యధికంగా 41.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 41.3, భద్రాచలం 39.4, ఖమ్మం 37.6, నిజామాబాద్ 37.4, నల్లగొండ 36.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులు, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. రుతుపవనాలు క్రియాశీ లంగా ఉండటం, ఛత్తీస్‌గఢ్ నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుండటం వల్ల వచ్చే 48 గం టల్లో కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలిపింది.