సాక్షి, విశాఖపట్నంః ఉత్తర బంగాళాఖాతంపై పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని ఆనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. తీరం వెంట గంటకు 50 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment