
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. వాయువ్య మధ్య ప్రదేశ్, పరిసరాల్లో ఏర్పపడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్తాన్ మీదగా పశ్చిమ దిశగా తీవ్ర అల్పపీడనం కదులుతుంది. రేపు (సోమవారం) ఉత్తర బంగాఖాతంలో మరో అల్పపీనడం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.