Depression in bay of bengal
-
చలి తగ్గుతోంది!
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో తగ్గిన ఉష్ణో గ్రతలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటు న్నాయి. తుపాను నేపథ్యంలో గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. నివర్ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేనప్పటికీ... వాతావరణంలో మాత్రం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధ, గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు చలిగాలులు వీయడంతో ప్రజలు వణికిపోయారు. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి చలి తీవ్రత తగ్గుతోంది. మరో రెండు రోజుల్లో చలి తగ్గి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారి నాగరత్న ‘సాక్షి’తో అన్నారు. సాధారణం కన్నా 8.6 డిగ్రీలు తక్కువగా... నివర్ తుపాను ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8.6 డిగ్రీ సెల్సియస్ తగ్గాయి. దీనికితోడు వేగంగా గాలులు వీయడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సమీపంలో ఉండాల్సి ఉండగా... హకీంపేట్‌లో 21.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, భద్రాచలం, దుండిగల్, హన్మకొండ స్టేషన్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోద య్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త అటుఇటుగా నమోదయ్యాయి. రాష్ట్రంలో అతి తక్కువగా మెదక్‌లో 14.8 డిగ్రీల సెల్సీయస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, దుండిగల్, హకీంపేట్, హైదరాబాద్‌లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగు తోందని వివరించింది. రాబోయే 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారి పశ్చిమ దిశగా పయనిస్తూ డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని సూచించింది. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం బలహీన పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం ఉదయం 8:30 గం. వరకు ఉష్ణోగ్రతలు ఇలా.. (డిగ్రీ సెల్సియెస్లలో) స్టేషన్ గరిష్టం కనిష్టం అదిలాబాద్ 25.3 18 భద్రాచలం 22.2 16.5 హకీంపేట్ 21.2 17 దుండిగల్ 22.3 16.7 హన్మకొండ 22 17.5 హైదరాబాద్ 22.4 17 ఖమ్మం 23.6 19.2 మహబూబ్‌నగర్ 21.9 18.7 మెదక్ 25 14.8 నల్లగొండ 26.5 18 నిజామాబాద్ 24.1 18.9 రామగుండం 23 18.6 -
బంగాఖాతంలో మరో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. వాయువ్య మధ్య ప్రదేశ్, పరిసరాల్లో ఏర్పపడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్తాన్ మీదగా పశ్చిమ దిశగా తీవ్ర అల్పపీడనం కదులుతుంది. రేపు (సోమవారం) ఉత్తర బంగాఖాతంలో మరో అల్పపీనడం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
తెలంగాణకు వర్ష సూచన..
సాక్షి, హైదరాబాద్: దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 4 రోజుల వరకు అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. తూర్పు బీహార్ నుండి దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు ఆగ్నేయ మధ్యప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. నేడు,ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (30 నుంచి 40 కి.మీ.) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 42 నుండి 44 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శ్రీలకంలోని ట్రింకోమలీకి 1140 కి.మీ తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 1490 కి.మీ ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 1760 కి.మీ దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం శనివారం రాత్రికి తుఫానుగా మారనుందని ఐఎండీ పేర్కొంది. అనంతరం 96 గంటల్లో శ్రీలంక తీరానికి వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రల మద్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. మే 1వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాన్ కారణంగా తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. తుపాను తీరం దాటే నాటికి తీవ్రత మరింత పెరిగి, పెను గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పాటు.. అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు రేపటిలోగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. తుపానుకు ఫణిగా నామకరణం ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘ఫణి’ పేరును ఖరారు చేయనున్నారు. దీనికి ముందు 2018 డిసెంబర్ మూడో వారంలో తుపాను ఏర్పడింది. ఆ తుపానుకు పెథాయ్ పేరును థాయ్‌లాండ్ సూచించింది. ఆ తర్వాత క్రమంలో బంగ్లాదేశ్ సూచించిన ‘ఫణి’ని ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే పేరు పెడతారు. ఆ లెక్కన ఇప్పుడు ఏర్పడబోయే తుపానుకు ‘ఫణి’గా శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. చదవండి: ‘ఫణి’ దూసుకొస్తోంది -
బలహీనపడిన అల్పపీడనం
విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. పూరీ నుంచి కోస్తాంధ్ర మీదగా దక్షిణ కోస్తా మీదగా ఈ అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర కోస్తాపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనికి తోడు కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. విశాఖ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు. కన్నూరుపాలెంలో 27 సెం.మీ., కశింకోటలో 19, అనకాపల్లిలో 18, ఎస్.రాయవరంలో 15, యలమంచిలో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 21, ఎస్.కోటలో 15, డెంకాడలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శ్రీకాకుళం జిల్లా నాగావళి నదికి వరద ముప్పు తప్పింది. అర్థరాత్రి లక్ష 3వేల క్యూసెక్కలకు ఉన్న నదీ ప్రవాహం...ఉదయానికి 80వేల క్యూసెక్కుల వరకూ తగ్గింది. -
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖ :బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదలటంతో కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాలను ఆనుకొని పశ్చిమ బంగాళాఖాతంలో ప్రస్తుతం తీరంవైపు అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది వాయుగుండంగా మారే వాతావరణ పరిస్థితులపై ఈరోజు ఒక అంచనాకు వస్తామని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అదే సమయంలో మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తామన్నారు. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలతోపాటు రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుమలలో గత రెండు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కర్నూలు జిల్లా శ్రీశైలంలో వర్షాల కారణంగా ఆలయం ముందు ఉన్న దుకాణాల వరకూ వర్షపు నీరు చేరింది. మరోవైపు వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజలు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.