T20 World Cup 2022, IND Vs BAN Adelaide Weather: Good News, No Rain Since Morning In Adelaide - Sakshi
Sakshi News home page

T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌.. టీమిండియా అభిమానులకు గుడ్‌ న్యూస్‌

Published Wed, Nov 2 2022 8:37 AM | Last Updated on Wed, Nov 2 2022 9:29 AM

IND vs BAN:  No RAIN since morning in ADELAIDE as Weather improves - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022(సూపర్‌-12)లో భాగంగా కీలక మ్యాచ్‌లో ఆడిలైడ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ సెమీస్‌ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటే.. ఓడిన జట్టు సెమీస్‌ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంటుంది. కాగా  ఈ కీలక మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావారణ శాఖ మంగళవారం(నవంబర్‌ 1)న వెల్లడించింది. దీంతో వర్షం ఆటంకం ఉందనడంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో టీమిండియా అభిమానులకు ఆడిలైడ్‌ నుంచి ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. బుధవారం(నవంబర్‌ 2) ఉదయం నుంచి ఆడిలైడ్‌లో వర్షం పడేలేదు. అదే విధంగా నిన్నటి కంటే(మంగళవారం) ఈ రోజు వాతావరణం గణనీయంగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్‌ బోరియా మజుందార్ ట్విటర్‌లో వెల్లడించారు. "గత కొన్ని గంటల నుంచి ఇక్కడ పూర్తిగా వర్షం పడడంలేదు. అదృష్టవశాత్తూ భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ వర్షం​ఆటంకం కలిగించే ఛాన్స్‌ లేదు" అని మజుందార్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

తుది జట్లు (అంచనా)
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (c), అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్‌ కీపర్‌), ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్
చదవండి: T20 World Cup 2022: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement