T20 World Cup 2022, India Vs England Semi Final 2: Check Virat Kohli Adelaide Record - Sakshi
Sakshi News home page

T20 WC 2022 Semi Final: అడిలైడ్‌ అంటే కోహ్లికి 'పూనకం' వస్తుంది.. ఇక ఇంగ్లండ్‌కు చుక్కలే..!

Published Wed, Nov 9 2022 9:43 AM | Last Updated on Wed, Nov 9 2022 10:27 AM

Kohli Has Terrific Record At Adelaide, Which Is The Venue For IND VS ENG Semis Clash - Sakshi

అడిలైడ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య రేపు (నవంబర్‌ 10) జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌-2022 రెండో సెమీఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నాయి. రేపటి సంగ్రామంలో గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ నువ్వా-నేనా అన్నట్లు సాగనుందని క్రికెట్‌ అభిమనాలు అంచనా వేస్తున్నారు.

ఇక, మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌ ఓవల్‌ విషయానికొస్తే.. ఈ పిచ్‌ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వేదికపై టీమిండియా తురుపుముక్క కింగ్‌ కోహ్లికి భీభత్సమైన రికార్డు ఉంది. ఇక్కడ మ్యాచ్‌ అంటేనే కింగ్‌ను పూనకం వస్తుంది. ఇక్కడ అతను ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 75.5 సగటున 907 పరుగులు సాధించాడు.

ఇందులో ఏకంగా 5 సెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా టీ20ల్లో కోహ్లికి ఈ వేదికపై ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ అతనాడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 155.55 సగటున 154 పరుగులు చేశాడు. 2016లో 90 నాటౌట్‌, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఈ వేదికపై టీమిండియాకు ఓ మ్యాచ్‌ ఆడిన (బంగ్లాతో) అనుభవం ఉండగా.. ఇంగ్లండ్‌కు మాత్రం ఆ అవకాశం దక్కలేదు.   
చదవండి: నాకు ఓటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు: విరాట్‌ కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement