సాక్షి, విశాఖపట్నం: వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడంతో అన్ని ప్రధాన ఓడ రేవుల్లోనూ ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరానికి అనుకుని కొనసాగుతోంది. బాలాసోర్ కు ఆగ్నేయం గా 70 కి.మి, పశ్చిమ బెంగాల్ లోని డిఘా కు దక్షిణ ఆగ్నేయంగా 70 కి.మి దూరంలో కేంద్రీ కృతమైంది. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య బాలసోర్ కు సమీపంలో బుధవారం మధ్యాహ్నం తీరం దాటనుంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 50 నుండి 55 కి.మి వేగం తో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment