
హమ్మయ్య... గట్టెక్కాం
పిచ్‌పై విమర్శలు రాకుండా అరంగేట్ర టెస్టు నిర్వహణ
చిన్న చిన్న లోపాలు ఉన్నా మ్యాచ్ విజయవంతం
విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి
తొలిసారి టెస్టు మ్యాచ్ నిర్వహిస్తున్నామనే సంబరం ఓ వైపు ఉన్నా... ఆంధ్ర క్రికెట్‌లో అందరిలోనూ పిచ్‌పై ఓ మూల చిన్న సందేహం, ఒక రకమైన భయం కూడా ఉన్నారుు. గత నెలలో న్యూజిలాండ్‌తో వన్డేలో పిచ్ స్పిన్ తిరిగిన విధానం చూసి... టెస్టు మ్యాచ్‌లోనూ అలా జరిగితే పరిస్థితి ఏంటనే ప్రశ్న మ్యాచ్ ఆరంభానికి ముందు తలెత్తింది. అరుుతే కోహ్లి కోరుకున్నట్లు స్పిన్‌కు అనుకూలంగా ఉండేలానే వికెట్‌ను రూపొందించారు. నిజానికి బంతి విపరీతంగా స్పిన్ అరుు్య మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసి ఉంటే ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)పై విమర్శలు వచ్చేవి. ఒకవేళ ఏదైనా తేడా జరిగి ఐసీసీ నుంచి హెచ్చరిక వచ్చి ఉంటే మరింత ప్రమాదం జరిగేది. అరంగేట్ర టెస్టులోనే ఇలాంటి వికెట్ చేస్తే ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు మూడు రోజుల్లో ముగిస్తే ఐసీసీ అధ్యక్షుడి సొంత సంఘం విదర్భ క్రికెట్ అసోసియేషన్‌కే ఐసీసీ నుంచి హెచ్చరిక వచ్చింది. మ్యాచ్ ఐదు రోజులు సాగడం... అనూహ్యంగా స్పిన్ కాకపోవడంతో ఏసీఏ ఊపిరి పీల్చుకుంది. గతంలో వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో అన్నింటికంటే బౌన్‌స పెద్ద సమస్యగా ఉండేది. ఇక్కడి మట్టి తీరు అదే కాబట్టి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఈసారి పిచ్‌పై నాలుగో రోజు కూడా మంచి బౌన్‌స వచ్చింది. ఈ విషయంలో స్థానిక క్యూరేటర్ నాగమల్లేశ్వరరావును అభినందించాల్సిందే. బీసీసీఐకి చెందిన వేరే ఏ క్యూరేటర్ మద్దతు లేకుండా ఆయన తన సొంత సిబ్బందితోనే ఈ పిచ్‌ను రూపొందించారు.
అనుభవలేమి కనిపించినా...
గతంలో విశాఖ స్టేడియంలో అనేక వన్డే, టి20, ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగారుు. టెస్టు మ్యాచ్ నిర్వహణ ఇక్కడి అధికారులకు కొత్త. అది ఆచరణలో కనిపించింది. టెస్టు హోదా ఉన్న స్టేడియంలో సౌకర్యాలు పూర్తి స్థారుులో లేకపోరుునా... మేనేజ్ చేయగలిగారు. మళ్లీ టెస్టు రావడానికి మరో ఏడాదో, రెండేళ్లో పడుతుంది. అరంగేట్ర టెస్టు మ్యాచ్ కాబట్టి అభిమానులు భారీగా వస్తే బాగుంటుందని ఏసీఏ ఆశపడింది. నోట్ల రద్దు ప్రభావం కావచ్చు, ఆసక్తి లేక కావచ్చు టిక్కెట్ల అమ్మకం పెద్దగా జరగలేదు. దీంతో స్కూల్ పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని ఉచితంగా అనుమతించారు. రోజుకు పదివేల మందికి ఉచితంగా భోజనం, నీరు అందించామని ఏసీఏ తెలిపింది. అరుుతే ఫ్రీ ఎంట్రీ విషయంలో స్పష్టత లేక స్టేడియంకు వచ్చిన వారు చాలా ఇబ్బందిపడ్డారు. కాలేజీ పిల్లలు గంటలు గంటలు గేట్ దగ్గర నిరీక్షించి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు. కాస్త ముందుగా ఓ ప్రణాళిక ప్రకారం ప్రవేశం గురించి చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు. ఏర్పాట్లలో చిన్న చిన్న లోపాలు ఉన్నా అవి అనుభవలేమి కారణంగా జరిగినవే. తర్వాతి మ్యాచ్ సమయానికి ఇవి సరిజేసుకుంటే బాగుంటుంది.