మైదానంలోనే ప్రేయసికి ప్ర‌పోజ్ చేసిన ఫుట్‌బాల్‌ ఆటగాడు | Viral Video: American Football Player Proposes To Girlfriend On Pitch | Sakshi
Sakshi News home page

మైదానంలోనే గ‌ర్ల్‌ఫ్రెండ్‌ చేతికి ఉంగరం తొడిగిన ఫుట్‌బాల్‌ ఆటగాడు

Published Mon, Jul 5 2021 11:49 AM | Last Updated on Mon, Jul 5 2021 4:19 PM

Viral Video: American Football Player Proposes To Girlfriend On Pitch - Sakshi

న్యూయార్క్‌: అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు హసాని డాట్సన్‌ స్టిఫెన్‌సన్‌ తన ప్రేయసికి గ్రౌండ్‌లోనే లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. మేజర్‌ లీగ్‌ సాకర్‌ టోర్నీలో భాగంగా ఆదివారం మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్‌ జోస్‌ ఎర్త్‌క్వేక్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అనంతరం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. మ్యాచ్‌ డ్రాగా ముగియగానే  స్టీఫెన్‌సన్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ పెట్రా వుకోవిక్‌ దగ్గరికి వెళ్లి మొకాలిపై కూర్చొని ‘విల్‌ యు మ్యారీ మీ’ అంటూ ఉంగరంతో ప్రపోజ్‌ చేశారు. బాయ్‌ఫ్రెండ్‌ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్‌తో షాక్‌కు గురైన అత‌ని లవర్‌ వెంట‌నే అతని ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది.

అనంతరం ఉంగరాన్ని ప్రేయసి చేతికి తొడగి, ఈ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుండిపోయేలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో మైదానంలోని ప్రేక్షకులు గట్టిగా కేకలు వేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా స్టీఫెన్‌సన్‌  ప్రపోజ్‌ చేసిన ఫోటోలను తన ప్రేయసి పెట్రా వుకోవిక్‌ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నీలాంటి వ్యక్తి ప్రేమ దొరినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. నా జీవితంలో ఈ అందమైన క్షణాలను మధుర జ్ఙాపకంగా ఉంచడంలో సహయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement