అమెరికాలో భారత సంతతికి చెందిన ఉద్యోగి చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటు పడిన ఎన్నారై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.183 కోట్లు కొల్లగొట్టాడు.
అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మాజీ ఫుట్‌బాల్ టీమ్ ఉద్యోగి అమిత్ పటేల్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. తాను ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన యూఎస్ ఫుట్‌బాల్ టీమ్ జాక్సన్‌విల్లే జాగ్వార్స్‌కు 22 మిలియన్ డాలర్లు అంటే ఇండియా కర్సెనీలో రూ.183 కోట్లు టోకరా పెట్టాడు. ఈ డబ్బుతో జల్సా చేశాడు.
జాక్సన్‌విల్లే జాగ్వార్స్ ఫుట్‌బాట్ టీంలో
జాక్సన్‌విల్లే జాగ్వార్స్ ఫుట్‌బాల్ టీంలో అమిత్ పటేల్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడు. జాగ్వార్స్ టీం యాజమాన్యం ఆటగాళ్లు వినియోగించుకునేందుకు వర్చువల్ క్రెడిట్‌కార్డ్ ప్రోగ్రామ్(వీసీసీ)ని అందుబాటులోకి తెచ్చింది. ఈప్రోగ్రాం ద్వారా ఫుట్‌బాల్ ఆటగాళ్లు వాళ్లకు కావాల్సిన ఫుడ్, ప్రయాణ ఖర్చులు ఇతర అవసరాల్ని తీర్చుకోవచ్చు. ఆ బాధ్యత అమిత్ పటేల్‌కి అప్పగించింది. అయితే, ఎంతో నమ్మకంతో ఉంటాడకున్న అమిత్ తన దుర్బుద్దిని చూపించుకున్నాడు.
మోసం ఎలా చేసేవాడంటే
వీసీసీలో ఆటగాళ్లకు ఖర్చు పెట్టే మొత్తంలో క్యాటరింగ్, ఫ్లైట్ ఛార్జీలు, హోటల్ ఛార్జీలు ఇలా అన్నీ ఫేక్ రిసిఫ్ట్‌లు క్రియేట్ చేశాడు. అకౌంట్స్‌ను మ్యాన్యువల్‌గా ఎంట్రీ చేసే ఫేక్ రిసిఫ్ట్‌లను సబ్మిట్ చేసేవాడు. అలా 2018 నుంచి 2023 అమిత్ చేసిన మోసాలకు అంతేలేకుండా పోయింది. చివరకు రూ.183 కోట్లను దుర్వినియోగం చేసినట్లు తేలడంతో ఉద్యోగం పోగొట్టుకోవడమే కాదు..ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో విచారణ ఎదుర్కొంటున్నాడు.
ఇక ఈ రూ.183 కోట్లను ఆన్‌లైన్ బెట్టింగ్, ఫ్లోరిడాలోని పోంటే వెడ్రా బీచ్‌లో భారీ విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కొనుగోలు, టెస్లా మోడల్ 3 సెడాన్, నిస్సాన్ పికప్‌ను కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment