Accounts department
-
జాక్సన్విల్లే జాగ్వార్స్ ఫుట్‌బాల్ టీంలో కలకలం..183 కోట్లు కాజేసిన భారతీయుడు!
అమెరికాలో భారత సంతతికి చెందిన ఉద్యోగి చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటు పడిన ఎన్నారై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.183 కోట్లు కొల్లగొట్టాడు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మాజీ ఫుట్‌బాల్ టీమ్ ఉద్యోగి అమిత్ పటేల్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. తాను ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన యూఎస్ ఫుట్‌బాల్ టీమ్ జాక్సన్విల్లే జాగ్వార్స్కు 22 మిలియన్ డాలర్లు అంటే ఇండియా కర్సెనీలో రూ.183 కోట్లు టోకరా పెట్టాడు. ఈ డబ్బుతో జల్సా చేశాడు. జాక్సన్విల్లే జాగ్వార్స్ ఫుట్‌బాట్ టీంలో జాక్సన్విల్లే జాగ్వార్స్ ఫుట్‌బాల్ టీంలో అమిత్ పటేల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. జాగ్వార్స్ టీం యాజమాన్యం ఆటగాళ్లు వినియోగించుకునేందుకు వర్చువల్ క్రెడిట్‌కార్డ్ ప్రోగ్రామ్(వీసీసీ)ని అందుబాటులోకి తెచ్చింది. ఈప్రోగ్రాం ద్వారా ఫుట్‌బాల్ ఆటగాళ్లు వాళ్లకు కావాల్సిన ఫుడ్, ప్రయాణ ఖర్చులు ఇతర అవసరాల్ని తీర్చుకోవచ్చు. ఆ బాధ్యత అమిత్ పటేల్‌కి అప్పగించింది. అయితే, ఎంతో నమ్మకంతో ఉంటాడకున్న అమిత్ తన దుర్బుద్దిని చూపించుకున్నాడు. మోసం ఎలా చేసేవాడంటే వీసీసీలో ఆటగాళ్లకు ఖర్చు పెట్టే మొత్తంలో క్యాటరింగ్, ఫ్లైట్ ఛార్జీలు, హోటల్ ఛార్జీలు ఇలా అన్నీ ఫేక్ రిసిఫ్ట్లు క్రియేట్ చేశాడు. అకౌంట్స్‌ను మ్యాన్యువల్‌గా ఎంట్రీ చేసే ఫేక్ రిసిఫ్ట్‌లను సబ్మిట్ చేసేవాడు. అలా 2018 నుంచి 2023 అమిత్ చేసిన మోసాలకు అంతేలేకుండా పోయింది. చివరకు రూ.183 కోట్లను దుర్వినియోగం చేసినట్లు తేలడంతో ఉద్యోగం పోగొట్టుకోవడమే కాదు..ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇక ఈ రూ.183 కోట్లను ఆన్లైన్ బెట్టింగ్, ఫ్లోరిడాలోని పోంటే వెడ్రా బీచ్‌లో భారీ విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు, టెస్లా మోడల్ 3 సెడాన్, నిస్సాన్ పికప్‌ను కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. నచ్చినవారికి ఎక్కడంటే అక్కడే! ఫిర్యాదుకు రెడీ?
సాక్షి, హైదరాబాద్: ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో డిప్యుటేషన్లకు సంబంధించి ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలే ఫైనల్. ఉద్యోగులు ఇదేమని ప్రశ్నిస్తే దశాబ్దాల క్రితం వచ్చిన ఆకాశ రామన్నల ఫిర్యాదులను మళ్లీ తెరమీదకు తెస్తామంటూ హెచ్చరిస్తుంటారు. డిప్యుటేషన్ల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అన్ని ఆధారాలతో ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అందులో డిప్యుటేషన్లకు సంబంధించి వికలాంగులు, మహిళలు, తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనలున్నా అవేవి పట్టించుకోకుండా అస్మదీయులకు మాత్రమే కోరుకున్నచోట డిప్యుటేషన్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాను అంగవైకల్యంతో బాధపడుతున్నానని, ఒకరోజు విధులకు వెళ్లి వస్తే మూడురోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని, దూరభారంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే డిప్యుటేషన్ ఇవ్వాలని వేడుకున్నా కనికరించలేదు. ఎలాంటి ఇబ్బందిలేని ఓ అధికారికి మాత్రం వైరా నుంచి ఖమ్మం జిల్లాకేంద్రానికి డిప్యుటేషన్ ఇచ్చారు. కుటుంబసభ్యుల అనారోగ్యం కారణంగా మంచిర్యాల నుంచి క్లియర్ వేకెన్సీ ఉన్న వైరాకు డిప్యుటేష¯న్ ఇవ్వాలని కోరితే కనీస స్పందన లేదని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌లో పనిచేస్తున్న మరో అవివాహిత ఉద్యోగి క్లియర్ వేకెన్సీ ఉన్న సంగారెడ్డికి డిప్యుటేషన్‌పై పంపాలని చాలాకాలంగా వేడుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. మానవతాదృక్పథంతో డిప్యుటేషన్లు పరిశీలించి చర్య తీసుకోవాలని ఆర్థికమంత్రి పేషీ సిఫారసు చేసినా డైరెక్టరేట్‌లో మాత్రం బుట్టదాఖలవుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. (చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..) సిమ్‌కార్డుల పితలాటకం తరచూ సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ను మారుస్తుండటం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. తాజాగా మరో కంపెనీకి సెల్ నెట్‌వర్క్‌ను మార్చటంతో గ్రామీణప్రాంతాలు, కార్యాలయ ఆవరణల్లోనూ సిగ్నల్స్ రాకపోవటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం కార్యాలయాలకు రాగానే విధుల్లో లాగిన్ కావాలంటే వారి సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీయే ఆధారం. కానీ, ఓటీపీ వచ్చేందుకు గంటల సమయం పడుతుండటంతో ఒక్కపూట మొత్తం అవస్థలు పడుతున్నామని, సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సీనియర్ ఐఏఎస్ అండ ఉందన్న ధీమాతో నిబంధనలన్నీ బేఖాతర్ చేస్తున్న ఉన్నతాధికారుల తీరుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఆపై ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించాలని ఉద్యోగులు, సంఘాలనేతలు భావిస్తున్నారు. రూ.23.8 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను స్వాధీనం చేసుకోకపోవటం, కొత్త కంప్యూటర్ల మొరాయింపు అంశంపైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. (చదవండి: పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్) -
ఇక్కడ.. లెక్కే లేదు..!
సాక్షి, నెట్వర్క్: ప్రతి పనికి, ప్రతి ఆదేశానికి ఇక్కడ ఓ లెక్క, పద్ధతి ఉండాలి. కానీ అర దశబ్దానికి పైగా ఒకే పోస్టులో పాతుకుపోయిన కొందరు ఉన్నతాధికారుల కారణంగా రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగంలో ఎలాంటి లెక్క, పద్ధతి లేకుండా పోయిందని చెపుతున్నారు. సిబ్బంది విన్నపాలు, విజ్ఞాపనలు కనీస పరిశీలన లేకుండానే బుట్టదాఖలవుతున్న తీరు ఉన్నత స్థాయి అధికారుల ఇష్టారాజ్యానికి అద్దం పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అద్దె భవనాల్లో ఉన్న పలు సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో నీరు కురుస్తోంది. అలాంటి వాటిని వదిలి సొంత భవనాల్లోకి వెళ్లాలన్న విజ్ఞప్తులను పట్టించుకునేవారు కరువయ్యారని అంటున్నారు. అలాగే పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లు, వేధింపులు, మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్ల పరిష్కారంలో జాప్యంపై ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. సొంతభవనాలు సిద్ధమైనా.. అద్దె ఆఫీసుల్లోనే రాష్ట్రంలో పలు చోట్ల సొంతంగా నిర్మించిన కొత్త సబ్‌ట్రెజరీ భవనాలు సిద్ధమైనా.. ప్రైవేటు భవనాలపై ఆ శాఖ ఉన్నతాధికారులకు మోజు తీరటం లేదని విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు సౌకర్యాల లేమితో పాటు పలు భవనాలు వర్షాలకు నీరు కురుస్తూ, పెచ్చులూడుతూ ఉద్యోగులను భయపెడుతున్నా ఉన్నతాధికారులు వాటిని వీడటం లేదని ఆరోపణలున్నాయి. సొంత భవనాల్లోకి మారకపోవడం ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ట్రెజరీ భవనాల ఆధునీకరణ కోసం నాలుగేళ్ల క్రితం రూ.23.8 కోట్లను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. అయితే ప్రభుత్వం ఉన్న భవనాల ఆధునీకరణ (రీ మోడలింగ్) కోసమే నిధులిస్తే.. అన్నీ తానై వ్యవహరిస్తున్న డైరెక్టరేట్ అధికారి కనుసన్నల్లో పలు చోట్ల నూతన భవనాలనే కట్టించేశారు. అయితే నూతన భవనాలు పూర్తయి ఆరునెలలు అవుతున్నా.. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారన్న కారణంతో వాటిని ట్రెజరీ డైరెక్టరేట్ తిరిగి స్వాధీనం చేసుకోకపోవటంతో ఆయా చోట్ల ఉద్యోగులు అవస్థలు పడాల్సి వస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరునెలల క్రితమే మిర్యాలగూడ, హుజూర్నగర్, చండూరు, నిడ్మనూరు, కోదాడ, నకిరేకల్, నాంపల్లిలలో నూతన భవనాలు సిద్ధం కాగా, అలంపూర్‌లో నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక రామాయంపేట, తూప్రాన్, భద్రాచలం తదితర చోట్ల టెండరు స్థాయిలోనే పనులు నిలిపేశారు. విన్నపాలు వినరు.. ‘ట్రెజరీ కార్యాలయానికి వచ్చే బిల్లులను నిబంధన మేరకు ఐదు రోజుల్లో ఆమోదించాలి.. లేదా తిరస్కరించాలి. లేదంటే మాకు మెమో తప్పదు. కానీ మేము ట్రెజరీస్ డైరెక్టరేట్‌కు చేసే విన్నపాలకు మాత్రం దిక్కులేదు. పరిష్కారానికి ఎన్ని నెలలైనా పట్టొచ్చు’అని ఉద్యోగులు అంటున్నారు. సమస్య తీవ్రతను చెప్పేందుకు డైరెక్టర్‌ను కలవడానికి వెళితే ఎవరికీ అనుమతి ఉండదంటూ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. తీవ్ర అనారోగ్యానికి గురై, కోలుకునేందుకు రూ.50 లక్షల ఆస్పత్రి బిల్లు చెల్లించిన ఒక ట్రెజరీ ఉ ద్యోగికి చెందిన మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైల్ ను డైరెక్టరేట్‌లో 3 నెలలు తొక్కిపెట్టిన వైనం.. డైరెక్టరేట్‌లో ఉద్యోగుల దుస్థితికి నిదర్శనమని సబ్‌ట్రెజరీ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యుటేషన్లు, పదోన్నతుల విషయ ంలో సీనియర్ ఐఏఎస్ పూర్తి మద్దతు తమకుందన్న ధీమాతో ఏకంగా ఆర్థిక మంత్రి సూచనలను సైతం డైరెక్టరేట్ ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు పోసి కొన్నా.. తప్పని మొరాయింపు ట్రెజరీ కార్యాలయాలకోసం ఇటీవల రూ.6 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు ఉద్యోగులకు చుక్కలు చూపెడుతున్నాయి. సిస్టమ్ ఆన్‌చేసిన అనంతరం బూట్ అయ్యేందుకే ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతోందని చెబుతున్నా రు. మధ్య, మధ్యలో సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయక షట్‌డౌన్ అవుతుండటంతో సమయమంతా వృథా అవు తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొన్న వాటికంటే ఆరేళ్ల క్రితంనాటి కంప్యూటర్లే మెరుగ్గా పనిచేస్తున్నాయని చెపుతున్నారు. ఆఫీసుకు వెళ్లాలంటే భయం.. ఆఫీసుకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. పూర్తి శిథిలావస్థకు చేరిన అద్దె భవనంలో ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నాం. భవనం స్లాబ్ పెచ్చులూడిపడుతోంది. వర్షం నీళ్లు వచ్చి అనేక ఫైళ్లు తడిచిపోతున్నాయి. కొత్త భవనం సిద్ధమైనా ఇంకా ప్రారంభించటం లేదు. – ఎం.సతీశ్, సీనియర్ అకౌంటెంట్, చండూరు, నల్లగొండ జిల్లా -
15న టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 15వ తేదీ ఉదయం విడుదల కానున్నారుు. ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయుంలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం ఇక్కడ సమావేశమైన అధికారులు ఈమేరకు నిర్ణయూనికి వచ్చినట్లు సవూచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 15లోగా పే అండ్ అకౌంట్స్ విభాగంలో బిల్లులు అందజేయాల్సి ఉంది. అందువల్ల బిల్లుల చెల్లింపులో సవుస్యలు తలెత్తకుండా ఫలితాలు విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల వుంది విద్యార్థులు హాజరయ్యూరు.