గ్వాడలహారా (మెక్సికో): టోక్యో ఒలింపిక్స్ ఫుట్‌బాల్ టోర్నీకి అమెరికా జట్టు అర్హత పొందలేకపోయింది. ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ దేశాల ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్న సెమీఫైనల్లో హోండురస్ 2-1తో అమెరికాను ఓడించి ‘టోక్యో’ బెర్త్ దక్కించుకుంది. ఒలింపిక్స్ ఫుట్‌బాల్ టోర్నీకి అమెరికా అర్హత పొందకపోవడం వరుసగా ఇది మూడోసారి.
భారత్ 0 యూఏఈ 6
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుతో సోమవారం జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత జట్టు 0-6 గోల్స్ తేడాతో ఓడిపోయింది. యూఏఈ తరఫున అలీ మబ్‌ఖౌత్ మూడు గోల్స్ (12వ, 32వ, 60వ ని.లో) చేయగా... లిమా (71వ, 84వ ని.లో) రెండు గోల్స్... ఖలీల్ (64వ ని.లో) ఒక గోల్ సాధిచారు.
Comments
Please login to add a commentAdd a comment