Tokyo Olympics 2020: USA Women's Take Gold and Silver Medal in Women's 400-Meter Hurdles - Sakshi
Sakshi News home page

Tokyo Olympics: రికార్డులు బద్దలు.. రెండు పతకాలు వారికే

Published Thu, Aug 5 2021 12:11 PM | Last Updated on Thu, Aug 5 2021 7:24 PM

Tokyo Olympics: 400m Hurdles Final USA Takes Gold And Silver - Sakshi

టోక్యో: పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో నార్వే అథ్లెట్‌ కర్‌స్టెన్‌ వార్‌హోమ్‌ ప్రపంచ రికార్డును మరిచిపోకముందే... మహిళల విభాగంలోనూ అటువంటి ప్రదర్శనే పునరావృతమైంది. బుధవారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్లో అమెరికా అథ్లెట్‌ సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌ అందరికంటే ముందుగా 51.46 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆమె... ఈ ఏడాది జూన్‌లో జరిగిన యూఎస్‌ ఒలింపిక్స్‌ ట్రయిల్స్‌లో 51.90 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది.

అంతేకాకుండా జమైకన్‌ అథ్లెట్‌ మెలైనె వాకర్‌ పేరిట ఉన్న ఒలింపిక్‌ రికార్డును (52.64 సెకన్లు; 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌) 21 ఏళ్ల మెక్‌లాఫ్లిన్‌ తన పేరిట బదిలీ చేసుకుంది. దాలియా మొహమ్మద్‌ (అమెరికా; 51.58 సెకన్లు) రజతం... ఫెమ్‌కే బోల్‌ (నెదర్లాండ్స్‌; 52.03 సెకన్లు) కాంస్యం గెలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement