Al Pacino Spotted On A Date Night With 29 Year Old Girlfriend Noor Alfallah, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Al Pacino And Noor Alfallah Photos: పెళ్లి చేసుకోకుండానే నలుగురికి తండ్రి.. 29 ఏళ్ల గర్ల్‌ ఫ్రెండ్‌తో డేట్‌కు!

Published Fri, Aug 4 2023 6:51 PM | Last Updated on Fri, Aug 4 2023 7:52 PM

Al Pacino spotted on a date night with 29 year old girlfriend Noor Alfallah - Sakshi

ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్‌ పాసినో ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే దాదాపు 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు. అది కూడా తనకంటే వయసులో చిన్నదైన 29 ఏళ్ల నూర్ అల్పాల్లాతో ఓ బిడ్డకు స్వాగతం పలికారు. జూన్‌లో నూర్‌ అల్ఫాల్లా బిడ్డకు జన్మనివ్వగా.. రోమన్ పాసినో అని నామకరణం చేశారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. అల్‌ పాసినో అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో తన గర్ల్‌ ఫ్రెండ్‌ నూర్ అల్ఫాల్లాతో కనిపించారు. ఈ జంట కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది!)

ప్రెగ్నెన్సీ సమయంలో అనుమానాలు?

అయితే గతంలో నూర్‌ ప్రెగ్నెన్సీ ఉన్నట్లు ప్రకటించగా.. నటుడు అల్ పాసినో అభ్యంతరం వ్యక్తం చేశారు. నూర్ ప్రెగ్నెన్సీ వార్తలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ డీఎన్‌ఏ టెస్ట్ చేయాల్సిందిగా కోరాడని తెలిసింది. అంతేకాకుండా తనకు 83 ఏళ్ల వయసులో పిల్లలను కనడం ఇష్టం లేదని తెలిపాడు. అయితే నూర్ గర్భం ధరించిన విషయాన్ని చాలా రోజుల పాటు అల్ పాసినోకు తెలియకుండా దాచింది. మే 31న గర్భం ధరించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

పెళ్లి చేసుకోకుండానే ముగ్గురితో సహజీవనం?

అల్ పాసినోకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. అతనికి మొదట తన యాక్టింగ్ కోచ్ జాన్ టారెంట్‌ అనే మహిళతో సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఆ తర్వాత మరో నటి బెవర్లీ డి ఏంజెలోతో డేటింగ్ చేశారు. వీరికీ కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత అల్, బెవర్లీ 2004లో విడిపోయారు.  అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగానే ఉంటున్నారు. ఆ తర్వాత అల్ పాసినో, నూర్ అల్ఫాల్లా ఏప్రిల్ 2022లో లాస్ ఏంజిల్స్‌లో కలిసి డిన్నర్ చేస్తుండగా.. మొదటిసారి ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. కొవిడ్ లాక్‌ డౌన్‌లో వీరిద్దరు డేటింగ్ ప్రారంభించారు. అల్ పాసినో తన తండ్రి కంటే పెద్ద వయసులో ఉన్నా.. అల్ఫాల్లా అతని వయస్సు అంతరాన్ని పెద్దగా పట్టించుకోదు. 

(ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement