Actor Cody Longo Found Dead At Home In Texas In Austin - Sakshi
Sakshi News home page

Cody Longo Death: ఇంట్లోనే శవమై కనిపించిన నటుడు

Published Sat, Feb 11 2023 6:32 PM | Last Updated on Sat, Feb 11 2023 7:45 PM

Actor Cody Longo found dead at home in Texas In Austin - Sakshi

హాలీవుడ్ యంగ్ హీరో కాడి లాంగో (34) మృతి చెందారు. అమెరికాలోని టెక్సాస్‌ నగరం ఆస్టిన్‌లోని ఆయన ఇంట్లో శవమై కనిపించారు. ఈ విషయాన్ని మేనేజర్ అలెక్స్ గిట్టెల్సన్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. లాంగో కుటుంబానికి ఆయన సానుభూతి తెలియజేశారు. 

అలెక్స్ గిట్టెల్సన్ ట్వీట్ చేస్తూ.. 'నా ప్రియమైన స్నేహితుడు, నా క్లయింట్ కాడి లాంగో ఇక లేరన్న విషాద వార్త నన్ను కలిచివేసింది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మిస్ యూ బ్రదర్.' అంటూ ట్వీట్ చేశారు. అయితే లాంగో చాలా సంవత్సరాలుగా మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. 2022లో రిహాలిబిటేషన్ కేంద్రానికి కూడా వెళ్లివచ్చినట్లు సమాచారం.

తన భర్త  పిల్లల కోసం చాలా కష్టపడేవారని దివంగత నటుడి భార్య స్టెఫానీ లాంగో తెలిపింది. లాంగోకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్, వైల్డ్‌ఫ్లవర్, నాట్ టుడే, హాలీవుడ్ హైట్స్‌లో లాంగో తన పాత్రలకు బాగా పేరు సంపాదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement