
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో మెయిన్ విలన్‌గా(స్కాట్ దొర) నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ 58 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో తెలుగు వాళ్లకు సుపరిచతమైన ఆయన మరణంతో సినీ పరిశ్రమ షాక్‌కి గురైంది. స్టీవెన్ సన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్ టీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
స్టీవెన్సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యం కారణమని ఇటాలియన్ వార్త పత్రిక రిపబ్లికా వెల్లడించింది. ఇటలీలో తన కొత్త చిత్రం ‘క్యాసినో’ షూటింగ్ చేస్తుండగానే ఆయన మిస్టరీ ఇల్‌నెస్‌కు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన మరణించారు అంటూ సదరు వార్తాసంస్థ తెలిపింది.
కాగా థోర్ సిరీస్‌తో పాపులర్ అయిన ఆయన కింగ్ ఆర్థర్, ది అదర్ గైస్,ది ట్రాన్స్‌పోర్టర్ వంటి పలు సినిమాల్లో నటించారు. చివరి సారిగా యాక్సిడెంట్ మ్యాన్ సినిమాలో కనిపించారు. ఆయన నటించిన మరో రెండు సినిమాలు, ఓ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.స్టీవెన్ సన్ 1997లో బ్రిటిష్ నటి రుత్ గెమ్మెల్‌ను వివాహం చేసుకోగా 8ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.
Comments
Please login to add a commentAdd a comment