చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. మరో దిగ్గజ నటుడు మృతి | Power Rangers star Jason David Frank passes away at 49 | Sakshi
Sakshi News home page

Jason David Frank: మరో విషాదం.. దిగ్గజ నటుడు మృతి

Published Mon, Nov 21 2022 4:06 PM | Last Updated on Mon, Nov 21 2022 4:49 PM

Power Rangers star Jason David Frank  passes away at 49 - Sakshi

చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా మరో దిగ్గజ హాలీవుడ్ నటుడు కన్నుమూశారు. పవర్ రేంజర్స్‌ సిరీస్‌లో నటించిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ మరణించారు. ఆయన ప్రస్తుతం ఆమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్నారు. అయితే అతని మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.  పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో ప్రముఖంగా గ్రీన్ రేంజర్ పాత్ర పోషించిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ 49 ఏళ్ల వయసులో కన్నుమూయడంతో సహచరులు షాక్‌కు గురయ్యారు.

పవర్ రేంజర్స్ స్టార్ దాదాపు 14 ఎపిసోడ్లలో నటించారు. ఆయన మరణవార్త విన్న అతని స్నేహితులు, సహచరులు నివాళులర్పించారు. పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో టామీ ఆలివర్ పాత్రతో జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ప్రాముఖ్యం సంపాదించారు. ఫ్రాంక్ మృతితో అతని కుటుబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ నటుడికి నలుగురు పిల్లలు ఉన్నారు. 1993 నుంచి 1996 వరకు మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో ఎక్కువగా నటించారు. ఆ తర్వాత  పవర్ రేంజర్స్ జియో, టర్బో, డినో థండర్‌తో సహా స్వీట్ వ్యాలీ హై, ఫ్యామిలీ మ్యాటర్స్,  వి బేర్ బేర్స్ ఎపిసోడ్స్‌లో కూడా జాసన్ కనిపించారు. 

అతని మరణ వార్త విన్న సహనటుడు వాల్టర్, జోన్స్ నివాళులర్పించారు. ఫ్రాంక్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. 'ఫ్రాంక్‌ లేడంటే నమ్మలేకపోతున్నాను. మా కుటుంబంలోని మరొక సభ్యుడిని కోల్పోయినందుకు బాధగా ఉంది. అతను మా అందరికీ స్ఫూర్తి. అతని ఉనికిని చాలా మిస్ అవుతున్నాం. మా రేంజర్ కుటుంబంలోని సభ్యుడిని కోల్పోవడం చాలా బాధాకరం.' అంటూ పోస్ట్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement